Sussanne
-
సుజానే తో విడిపోవడం... : హృతిక్
కెరీర్ లో ఫెయిల్యూర్స్, వ్యక్తిగత జీవితంలో కొన్ని సంఘటనలు, బ్రెయిన్ సర్జరీ తదితర అంశాలు బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ ను ఈ సంవత్సరం కష్టాల్లోకి నెట్టాయి. భార్య సుజానే తో విభేధాల కారణంగా హృతిక్ రోషన్ విడిపోవడంతో ఎమోషనల్ గా ఒత్తిడి గురయ్యాని.. అప్పుడే తాను మానసికంగా బలంగా తయారయ్యాను అని హృతిక్ తెలిపారు. బ్యాంగ్ బ్యాంగ్ ప్రమోషన్ లో భాగంగా మీడియాతో మాట్లాడుతూ.. తన కేరిర్ లో అత్యంత ఉత్తేజకరమైన చిత్రం అని అన్నారు. ఈ చిత్రంలో చాలా సంతోషకరమైన కారెక్టర్ ను పోషించానని తెలిపారు. తన జీవితంలో చాలా గడ్డు పరిస్థుతులు ఎదుర్కొనే సమయంలో ఇలాంటి పాత్ర దొరకడం కొంత రిలీఫ్ ఇచ్చిందన్నారు. ఈ చిత్ర ప్రయాణం జీవితంలో గొప్ప విజయం లాంటిదన్నారు. ఇలాంటి సవాళ్లను అధిగమించినపుడు అలాంటి సంఘటనలు చాలా తేలికవుతాయన్నారు. తనకు సల్మాన్ ఖాన్ కు ఎలాంటి విభేదాలు లేవని హృతిక్ స్పష్టం చేశారు. -
కొడుకు కోసం ఒక్కటైన హృతిక్, సుజానే
బాలీవుడ్ జంట హృతిక్ రోషన్, సుజానే విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. వాళ్లకు ఇంకా విడాకులు మంజూరుకాలేదు గానీ విడివిడిగానే ఉంటున్నారు. కానీ.. తమ పిల్లాడి కోసం మాత్రం వాళ్లు మళ్లీ ఒక్కటయ్యారు. తమ చిన్న కొడుకు హృదాన్ పుట్టినరోజు కోసం హృతిక్ రోషన్ షూటింగులకు సెలవుపెట్టి, లోనావాలా వెళ్లాడు. ఆ పుట్టినరోజు పార్టీలో సుజానే కూడా ఉంది. లోనావాలలో పార్టీ చేసుకున్న తర్వాత అందరూ కలిసి ముంబై వచ్చారు. ఆ రోజు రాత్రి జుహూ లోని ఓ మల్టీప్లెక్సులో ఓ సినిమాకు హృతిక్, సుజానే, పిల్లలు అంతా కలిసి వెళ్లారు. వాళ్లతో పాటు కొంతమంది స్నేహితులు, వాళ్ల పిల్లలు కూడా ఉన్నారు. పిల్లలంటే దంపతులిద్దరికీ చాలా అభిమానమని, అందుకే వాళ్ల సంతోషం కోసం ఇలా కలిసి వచ్చారని అంటున్నారు. -
హృతిక్, సుజానేల విడాకులకు కారణమెవరు?
బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్, సుజానే విడిపోతున్నారన్న వార్త మీడియాలో చర్చనీయాంశమైంది. హృతిక్, సుజానే విడిపోవడం వెనుక అనేక ఊహాగానాలు వెలువడుతున్నాయి. 17 ఏళ్ల స్నేహం, 13 సంవత్సరాల దాంపత్య జీవితానికి పుల్ స్టాప్ పడటం వెనుక అనేక కథనాలు మీడియాలో వెలువడుతున్నాయి. సుజానేకు అత్త, మామలతో విబేధాలు తీవ్రస్థాయికి చేరుకోవడం ఒకటైతే.. బాలీవుడ్ హీరో అర్జున్ రాంపాల్ తో ఉన్న ఫ్రెండ్ షిప్ మరో కారణమని తెలుస్తోంది. అత్తారింటి వారితో విబేధాలు తారాస్థాయికి చేరుకోవడంతో వేరు కాపురానికి హృతిక్ పై సుజానే చాలాకాలంగా ఒత్తిడి చేస్తున్నట్టు తెలుస్తోంది. కానీ, తన తల్లిదండ్రులు, విడాకులు పొందిన తన సోదరిని వదిలి బయటకు రావడం ఇష్టం లేక.. సుజానే నిర్ణయాన్ని వ్యతిరేకించడంతో వారి మధ్య మరింత అగాధం పెరిగిందని తెలుస్తోంది. హాలీవుడ్ నటి బార్బారా మోరీతో హృతిక్ సన్నిహిత సంబంధం కూడా వారు విడిపోవడానికి కారణమైందని మరో వాదన. అత్తారింటిలో ఉండటం ఇష్టం లేక గత మూడు నెలల నుంచి హృతిక్, సుజానేలు విడివిడిగా ఉంటున్నట్టు తెలిసింది. ఇక ఎన్నో ఏళ్లుగా రోషన్, రాంపాల్ కుటుంబాల మధ్య సన్నిహిత సంబంధాలున్నాయి. అర్జున్, అతని సతీమణి మెహర్ లు సుజానేకు క్లోజ్ ఫ్రెండ్స్. సుజానే, హృతిక్ ల మధ్య విబేధాలు తలెత్తినా సుజానే తల్లితండ్రులు ఈ విషయంపై రాంపాల్ తో చర్చించడానికి ఇష్టపడలేదని మరో వాదన. హృతిక్, సుజానేలు విడిపోవడంపై స్పందించాలని మీడియా ఫోన్ లో కోరగా అందుకు అర్జున్ రాంపాల్ ఆగ్రహించినట్టు తెలిసింది. ఏది ఏమైనా.. కారణాలేమైనా..17 ఏళ్ల హృతిక్, సుజానేల ప్రేమకథ ట్రాజేడిగా ముగియనుంది. -
17 ఏళ్ల స్నేహం,13 ఏళ్ల బంధానికి బ్రేక్
-
హృతిక్ రోషన్ కు సుజానే విడాకులు!
బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్, సుజానేలు 13 ఏళ్ల దాంపత్య జీవితానికి ముగింపు పలికారు. నాతో విడిపోవడానికి సుజానే నిర్ణయించుకుంది అని హృతిక్ ఓ ప్రకటనలో తెలిపారు. దాంతో మా 17 సంవత్సరాల రిలేషన్‌కు తెరపడింది అని హృతిక్ వెల్లడించారు. తమ కుటుంబానికి ఈ విషయం జీర్ణించుకోలేనిది. తమ ప్రైవసీకి భంగం కలిగించకూడదని హృతిక్ మీడియాకు, ప్రజలకు విజ్ఞప్తి చేశారు. 13 ఏళ్ల దాంపత్య జీవితంలో హృతిక్, సుజానేలకు రెహాన్(7), హ్రిదాన్(5) ఇద్దరు కుమారులున్నారు. బాలీవుడ్ నటుడు సంజయ్ ఖాన్ కూతురైన సుజానేతో హృతిక్ వివాహం 2000 సంవత్సరంలో జరిగింది. గత కొద్దికాలంగా హృతిక్, సుజానేలు విడిపోతున్నారంటూ వార్తలు వెలువడుతున్న సంగతి తెలిసిందే. అయితే గత మూడు నెలలుగా వీరిద్దరూ విడివిడిగానే ఉంటున్నట్టు సమాచారం. అంతేకాకుండా పబ్లిక్ ఫంక్షన్లో కూడా వీరిద్దరూ కనిపించలేదు. హృతిక్‌కు సంబంధించిన అన్ని కార్యక్రమాలకు సుజానే దూరంగా ఉంది. సెప్టెంబర్‌లో రాకేశ్ రోషన్ జన్మదినం సందర్భంగా ఇలా కనిపించి అలా మాయమైందని వార్తలు వెలువడ్డాయి.