son birthday
-
బుల్లితెర నటి లహరి కుమారుడి ఫస్ట్ బర్త్‌డే (ఫోటోలు)
-
Allu Ayaan Birthday Photos: నెట్టింట వైరల్ అవుతున్న అల్లు అర్జున్-అయాన్ క్యూట్ పిక్స్
-
సత్య దేవ్ భార్య, కొడుకును చూశారా? ఫ్యామిలీ ఫొటో షేర్ చేసిన హీరో
టాలీవుడ్లో వర్సలైట్ యాక్టింగ్‌తో అతి తక్కువ సమయంలో మంచి నటుడిగా పేరు తెచ్చుకున్న నటుడు సత్యదేవ్. ఓ వైపు హీరోగా సినిమాలు చేస్తూనే, మరోవైపు వైవిధ్యమైన పాత్రల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. ఇటీవలె మెగాస్టార్ చిరంజీవి 'గాడ్‌ఫాదర్' చిత్రంలో కీలక పాత్రలో నటించి మెప్పించిన సత్యదేవ్ తాజాగా 'గుర్తుందాదా శీతాకాలం' సినిమాలో హీరోగా అలరించాడు. అయితే సినిమాల్లో రాకముందే సత్యదేవ్‌కు పెళ్లయిన సంగతి తెలిసిందే. చదవండి: ఫేం కోసం తప్పుడు ప్రచారం.. ‘సింగింగ్ ఐకాన్’ యశస్వి మోసం బట్టబయలు! అయితే ఎప్పుడు తన కుటుంబాన్ని మీడియాకు పరిచయం చేయలేదు. దీంతో సత్యదేవ్‌కు పెళ్లయిందనే విషయం చాలా మందికి తెలియదు. ఈ నేపథ్యంలో రీసెంట్గా గుర్తుందా శీతాకాలం మూవీ ప్రమోషన్ ఈవెంట్లో తన భార్యను పరిచయం చేసిన సత్యదేవ్ తాజాగా తన కొడుకును కూడా పరిచయం చేశాడు. ఈ రోజు తన కొడుకు బర్త్‌డే సందర్భంగా ఫ్యామిలీ ఫొటో షేర్ చేశాడు. సత్య దేవ్ భార్య పేరు దీపికా, కొడుకు పేరు సవర్ణిక్. చదవండి: షణ్ముఖ్‌తో హగ్‌లు, ముద్దులు.. స్టేజ్‌పై శ్రీహాన్ ముందే సిరి కన్నీళ్లు! బుధవారం(ఫిబ్రవరి 8) తనయుడి బర్త్‌డే సందర్భంగా భార్య, కొడుకుతో ఉన్న ఫొటోను షేర్ చేశాడు. ‘సవర్ణిక్ మూడో ఏడాదిలోకి అడుగుపెడుతున్నాడు. నా ప్రేమకు పుట్టినరోజు శుభాకాంక్షలు’ కొడుకు స్పెషల్ బర్త్‌డే విషెస్ తెలిపాడు. దీంతో సత్య దేవ్ ఫ్యామిలీ ఫొటో నెట్టింట వైరల్‌గా మారింది. ఇంతకాలం మీడియాకు దూరంగా ఉంచిన సత్య దేవ్ కొడుకు చాలా క్యూట్‌గా ఉన్నాడంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాదు అందమైన ఫ్యామిలీ, చూడముచ్చటైన జంట అంటూ సత్యదేవ్ దంపతులపై ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజన్లు. View this post on Instagram A post shared by Satyadev (@actorsatyadev) -
తనయుడి బర్త్‌డే.. థ్యాంక్స్ చెప్పిన కాజల్!
స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఇటీవల మగబిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. అప్పుడే బాబుకి నీల్ కిచ్లూ అని పేరు కూడా పెట్టేశారు. ఇదిలా ఇక ఈ చిన్నారి రాకతో కాజల్ కుటుంబం సంతోషంలో మునిగితేలుతోంది. అప్పటి నుంచి కాజల్ తన ముద్దుల తనయుడి ఫొటోలను తరచూ షేర్ చేస్తు వస్తుంది. అయితే ఈ ఫొటోల్లో నీల్ కిచ్లు ముఖం కనిపించి కనిపంచకుండ జాగ్రత్త పడుతోంది ఆమె. తాజాగా మరో ఫొటోను సోషల్ మీడియా వేదికగా పంచుకుంది కాజల్. నేటితో కాజల్ తనయుడికి రెండు నెలలు నిండాయి. గత ఏప్రిల్ 19న కాజల్ నీల్ కిచ్లుకు జన్మనిచ్చింది. చదవండి: సాయి పల్లవికి చీర పెట్టిన సరళ కుటుంబ సభ్యులు ఈ సందర్భంగా ఆమె తనయుడి ఫొటోను షేర్ చేస్తూ ఎమోషనల్ అయ్యింది. ‘బెస్ట్బర్త్డేఎవర్’ అంటూ తన కుమారుడికి విషెస్ తెలిపిన ప్రతి ఒక్కరి ధన్యవాదాలు తెలిపింది. వైట్ కుర్తా, పైజామాతో కొడుకును అలంకరించి ముద్దులు ఒలికిస్తున్న ఫొటోను షేర్ చేసింది. దీంతో కాజల్ పోస్ట్‌కు రామ్ చరణ్ భార్య, ఉపాసన ‘మోస్ట్ అడరాబుల్’ అంటూ కామెంట్ చేసింది. ప్రస్తుతం కాజల్ పోస్ట్ తన ఫ్యాన్స్‌ను బాగా ఆకట్టుకుంటుంది. దీంతో ఆ ఫొటోను ఆమె ఫ్యాన్స్, ఫాలోవర్స్ పలు సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలో షేర్ చేస్తూ వైరల్ చేస్తున్నారు. చదవండి: స్టార్ హీరో విజయ్ ఆఫీసులో మృతదేహం కలకలం, ఏం జరిగింది? View this post on Instagram A post shared by Kajal A Kitchlu (@kajalaggarwalofficial) -
Slumdog Husband: కుక్కకు భర్తగా బ్రహ్మాజీ తనయుడు సంజయ్ రావు..
Daggubati Rana launched Sanjay Rao Slumdog Husband Motion Poster: పాపులర్ నటుడు బ్రహ్మాజీ తనయుడు, 'ఓ పిట్టకథ' ఫేమ్ సంజయ్ రావ్ హీరోగా నటిస్తున్న మరో చిత్రం స్లమ్‌డాగ్ హస్బండ్. ఈ సినిమాతో డ్యాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాధ్ శిష్యుడు డాక్టర్ ఏఆర్ శ్రీధర్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. మైక్ మూవీస్ బ్యానర్‌పై అక్కిరెడ్డి, వెంకట్ అన్నపు రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్గా ప్రణవి నటిస్తోంది. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా మోషన్ పోస్టర్‌ను దగ్గుబాటి రానా ఆవిష్కరించాడు. సంజయ్ రావు పుట్టినరోజు సందర్భంగా ఈ పోస్టర్‌ను విడుదల చేశారు. మోషన్ మోస్టర్ ఎంతో హ్యూమరస్‌గా ఉందన్న రానా మూవీ యూనిట్‌కు ఆల్ ది బెస్ట్ తెలిపారు. 'స్లమ్‌డాగ్ హస్బండ్' మూవీ సరికొత్త కాన్సెప్ట్‌తో వస్తున్నట్లు తెలుస్తోంది. వివాహాల్లో కొంతమంది పాటిస్తున్న కొన్ని మూఢనమ్మకాలను వినోదాత్మకంగా చూపెడుతున్నాడు దర్శకుడు. ఈ పోస్టర్ ఐశ్వర్య రాయ్‌కు చెట్టుతో పెళ్లి చేయడం, కొందరికి జంతువులతో వివాహం చేసిన న్యూస్ క్లిప్పింగ్స్, రాశుల ఫొటోలతో ఆసక్తికరంగా ఉంది. అంతేకాకుండా ఇందులో హీరోకు కుక్కతో పెళ్లి జరిపించే ఫొటోను చూపించారు అర్జున్ రెడ్డి సినిమా తరహాలో 'ఎవడ్రా నా కుక్కపై రంగుపోసింది' అని డైలాగ్ చెప్పడం బాగా నవ్విస్తోంది. 'మిమ్మల్ని ఈ పెళ్లికి సాదరంగా ఆహ్వానిస్తున్నాం' అంటూ మోషన్ పోస్టర్‌ను ముగించారు. చదవండి: కమల్ హాసన్: ఆయనతో కలిసి నటించాలని ప్రాధేయపడ్డా.. కానీ.. We are so happy to announce that our #slumdoghusband movie motion poster has been launched. Special thanks for your sweet gesture @RanaDaggubati garu.#productionno04 #SlumDogHusband #SDH#ranadaggubati #motionposterlaunched Link▶️https://t.co/zuq6Fdc6yo@Mic_Movies pic.twitter.com/nPsGUSmXs5 — Productionno4 (@Productionno04) May 29, 2022 -
కన్నతల్లితోనే ఛాలెంజ్! ఆరేళ్ల తర్వాత..
చెప్పింది వినకుండా పిల్లలు మారాం చేసినప్పుడు.. ఫలానా కొనిస్తాం లేదంటే ఫలానా దగ్గరికి తీసుకెళ్తాం అంటూ బుజ్జగిస్తుంటారు పేరెంట్స్. ఈరోజుల్లో పిల్లల పాలిట సెల్‌ఫోన్ ఒక వ్యసనంగా మారింది. ఆ అలవాటు మాన్పించే ప్రయత్నాలు ఎన్ని ఉన్నా.. పూర్తి స్థాయిలో వర్కవుట్ కావడం లేదు. ఈ తరుణంలో ఓ తల్లి చేసిన పని.. ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్‌గా మారింది. ఆరేళ్ల కిందట.. మిన్నెసోటా(అమెరికా)కు చెందిన 12 ఏళ్ల పిలగాడు సివెర్ట్ క్లెఫ్‌సాస్ ఇంట్లో ఉన్న మొబైల్‌కు అతుక్కుపోవడం మొదలుపెట్టాడు. కొడుకును ఎలాగైనా ఆ వ్యసనానికి దూరం చేయాలని తల్లి లోర్నా గోల్డ్స్ట్రాండ్ భావించింది. ఇందుకోసం కొడుకుతో ఓ ఛాలెంజ్ చేసింది. బహుశా ఏ తల్లికి ఇలాంటి ఐడియా వచ్చి ఉండదేమో.! ఆరేళ్ల పాటు సోషల్ మీడియాకు గనుక దూరంగా ఉంటే.. సివెర్ట్ 18వ పుట్టినరోజున 1,800 డాలర్లు (మన కరెన్సీలో లక్ష 36 వేల రూపాయలు) ఇస్తానని ఛాలెంజ్ విసిరింది. అంత చిన్న వయసులో అంత పెద్ద ఫిగర్ వినేసరికి సివెర్ట్ టెంప్ట్ అయ్యాడు. తల్లి ఛాలెంజ్‌కు సై చెప్పాడు. ఆరేళ్లు గిర్రున తిరిగింది.. తల్లితో చేసిన ఛాలెంజ్‌కు కట్టుబడి ఈ ఆరేళ్లు సోషల్ మీడియా జోలికి పోలేదు ఆ కుర్రాడు. మీరు నమ్మినా.. నమ్మకపోయినా.. అదే నిజం అంటున్నాడు. రీసెంట్గా బర్త్‌డే 18వ పుట్టినరోజు చేసుకున్న ఆ కుర్రాడికి.. ఛాలెంజ్ ప్రకారం 1,800 డాలర్లను కొడుక్కి అందించింది లోర్నా. అంతేకాదు కొడుకు ఫొటోను తన ఫేస్బుక్లో షేర్ చేసి.. జరిగిందంతా చెప్పింది. తన పెద్ద కూతురిలా కొడుకు కూడా సోషల్ మీడియాకు బానిస కావడం, మానసికంగా కుంగిపోవడం ఇష్టం లేకనే ఇలా ఛాలెంజ్ విసిరానని చెప్తోందామె. ఈ ఆరేళ్ల కాలంలో తన తోటి వాళ్లెందరో స్మార్ట్ఫోన్లు, సోషల్ మీడియాకు అడిక్ట్ అయ్యారు. కానీ, తన కొడుకు మాత్రం వాటికి దూరంగా ఉన్నాడని మెచ్చుకుంది ఆ తల్లి. ఇంతకీ ఈ తల్లికి ఈ ఐడియా ఎలా తట్టిందో తెలుసా? ఓరోజు రేడియోలో 18 ఫర్ 18 ఛాలెంజ్ అనే కాన్సెప్ట్ గురించి వినిందట. ఆ స్ఫూర్తితో కొడుక్కి ఈ ఛాలెంజ్ విసిరిందామె. ఇక ఎలాగూ కొడుకు తన ఛాలెంజ్ పూర్తి చేయడంతో.. ఇప్పుడతనికి స్వేచ్ఛ దొరికినట్లయ్యింది. -
చిరంజీవి, ఎన్టీఆర్‌లను కలిసిన మంత్రి పువ్వాడ అజయ్
సాక్షి, హైదరాబాద్ : మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తన కుమారుడు నయన్‌తో కలిసి మెగాస్టార్ చిరంజీవి, జూ. ఎన్టీఆర్‌లను కలిశారు. తొలుత ఎన్టీఆర్‌ను కలిసిన అజయ్ కుమార్, నయన్‌లు.. ఆపై చిరంజీవిని కలిశారు. నయన్ పుట్టినరోజు సందర్భంగా చిరంజీవి అతనితో స్వయంగా కేక్ కట్ చేయించారు. దీనికి సంబంధించిన ఫోటోలను మంత్రి పువ్వాడ అజయ్ పోస్ట్ చేశారు. అయితే అకస్మాత్తుగా మంత్రి పువ్వాడ వరసగా సినీ ప్రముఖులు చిరంజీవి, ఎన్టీఆర్‌లను కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. పువ్వాడ నయన్‌ను సినిమాల్లోకి తీసుకొస్తున్నారా అంటూ కొందరు నెటిజన్లు సందేహం వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే టాలీవుడ్లో నయన్ ఎంట్రీ ఉండబోతుందంటూ అప్పుడే ఊహాగానాలు తెరపైకి వచ్చాయి. మరోవైపు మంత్రి కేటీఆర్‌ను కూడా కలిశారు. 'నేడు నా తనయుడు Dr. పువ్వాడ నయన్ రాజ్ పుట్టిన రోజు సందర్భంగా రామన్న కుటుంబాన్ని మర్యాపూర్వకంగా కలిసి వారి ఆశీర్వాదం తీసుకోవడమైంది' అంటూ మంత్రి పువ్వాడ అజయ్ ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ దంపతులు నయన్‌కు బర్త్‌డే విషెస్ అందజేశారు. ఈ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. నా తనయుడు Dr.పువ్వాడ నయన్ పుట్టినరోజు సందర్బంగా ప్రముఖ నటుడు, మెగాస్టార్ @KChiruTweets గారిని మర్యాదపూర్వకంగా కలిసి కలవడమైంది. @Koratala_fans pic.twitter.com/udJhDfg5zO — Ajay Kumar Puvvada (@puvvada_ajay) July 5, 2021 నేడు నా తనయుడు Dr. పువ్వాడ నయన్ రాజ్ పుట్టిన రోజు సందర్భంగా రామన్న కుటుంబాన్ని మర్యాపూర్వకంగా కలిసి వారి ఆశీర్వాదం తీసుకోవడమైంది. @TelanganaCMO @MinisterKTR @KTRTRS @trspartyonline pic.twitter.com/GfkdLcBNbt — Ajay Kumar Puvvada (@puvvada_ajay) July 5, 2021 -
అవ్రామ్ మంచు @ 1
మంచు మోహన్‌బాబు మనవడు అవ్రామ్ మంచు తొలి పుట్టినరోజు ఆదివారం ఘనంగా జరిగింది. సినిమా పరిశ్రమ నుంచి నటుడు చిరంజీవితో పాటు పలువురు ప్రముఖులు ఈ వేడుకకు హాజరయ్యారు. ఇంకా పలువురు రాజకీయ నాయకులు కూడా హాజరై, చిన్ని అవ్రామ్ని ఆశీర్వదించారు. తనయుడి పుట్టినరోజు వేడుకను విష్ణు, విరానికా వీలైనంత పసందుగా జరిపారు. ఇక తమ్ముడి జన్మదిన వేడుకలో అరియానా, వివియానా కూడా బాగా సందడి చేశారు. -
ఈమె ఎవరో గుర్తు ఉన్నారా?
న్యూఢిల్లీ : నటి సమీరా రెడ్డి గుర్తు ఉన్నారా? టాలీవుడ్లో ఎన్టీఆర్‌తో అశోక్, బాలీవుడ్లో సైఫ్ అలీ ఖాన్‌తో రేస్ సినిమాలు తీసిన ఈమె, చాలా కాలానికి మళ్లీ అభిమానులకు కనిపించింది. అయితే సినిమాల్లో కాదండి.. సోషల్ మీడియాలో తాను పోస్టు చేసిన ఫోటోలతో. ప్రస్తుతం ఆమె తల్లి బాధ్యతల్లో బిజీగా ఉన్నారు. ముంబైకి చెందిన బిజినెస్‌మేన్ అక్షయ్ వార్దేను పెళ్లి చేసుకున్న అనంతరం ఆమె వార్తల్లో కనిపించడం చాలా అరుదుగా మారారు. తాజాగా తన కొడుకు రేపు మూడో ఏడాదిలోకి అడుగు పెట్టబోతున్న తరుణంలో, కొడుకుతో కలిసి దిగిన ఫోటోలను అభిమానుల కోసం తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు. ‘నీతో ఇది నా మొదటి రోజు. రేపు నీవు మూడో ఏడాదిలోకి ప్రవేశించబోతున్నావు. నా ప్రపంచంలోకి వచ్చిన నీకు ధన్యవాదాలు’ అనే క్యాప్షన్‌తో సమీరా ఈ ఫోటోలను పోస్టు చేశారు. ఈ పోస్టులకు నటి సమితా శెట్టి వావ్ అని కామెంట్ పెట్టారు. అభిమానులు సైతం ఆ క్యూట్ ఫోటోలకు వావ్ అనకుండా ఉండలేకపోతున్నారు. 2014లో అక్షయ్ వార్దేను ఆమె పెళ్లి చేసుకున్నారు. అనంతరం ఆమె పూర్తిగా సినిమాలకు గుడ్‌బై చెప్పేశారు. తన జీవితంలో పెద్ద మార్పు వచ్చినట్టు అప్పుడే సమీరా రెడ్డి ప్రకటించారు. కొన్ని రోజుల క్రితం సమీరా రెడ్డి, సోనాలి బింద్రే బాద్రాలో కలుసుకున్నట్టు తెలిసింది. -
జున్నూతో నానీ
‘‘మా దొంగ రాస్కెల్ బర్త్‌డే ఇవాళ (గురువారం). జున్నుగాడి ఫస్ట్ బర్త్‌డే ఇది’’ అంటూ నానీ ఈ ఫొటోను షేర్ చేశారు. జున్ను అసలు పేరు అర్జున్. ఇంతకీ జున్ను అని చదవగానే ‘హలో’ సినిమా గుర్తొస్తోంది కదూ. అందులో హీరోయిన్ కల్యాణి ముద్దు పేరు జున్ను అని గుర్తుండే ఉంటుంది. -
కొడుకు కోసం ఒక్కటైన హృతిక్, సుజానే
బాలీవుడ్ జంట హృతిక్ రోషన్, సుజానే విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. వాళ్లకు ఇంకా విడాకులు మంజూరుకాలేదు గానీ విడివిడిగానే ఉంటున్నారు. కానీ.. తమ పిల్లాడి కోసం మాత్రం వాళ్లు మళ్లీ ఒక్కటయ్యారు. తమ చిన్న కొడుకు హృదాన్ పుట్టినరోజు కోసం హృతిక్ రోషన్ షూటింగులకు సెలవుపెట్టి, లోనావాలా వెళ్లాడు. ఆ పుట్టినరోజు పార్టీలో సుజానే కూడా ఉంది. లోనావాలలో పార్టీ చేసుకున్న తర్వాత అందరూ కలిసి ముంబై వచ్చారు. ఆ రోజు రాత్రి జుహూ లోని ఓ మల్టీప్లెక్సులో ఓ సినిమాకు హృతిక్, సుజానే, పిల్లలు అంతా కలిసి వెళ్లారు. వాళ్లతో పాటు కొంతమంది స్నేహితులు, వాళ్ల పిల్లలు కూడా ఉన్నారు. పిల్లలంటే దంపతులిద్దరికీ చాలా అభిమానమని, అందుకే వాళ్ల సంతోషం కోసం ఇలా కలిసి వచ్చారని అంటున్నారు.