Actor Satya Dev Shared Adorable Family Pic On His Son Birthday - Sakshi
Sakshi News home page

Satya Dev: సత్య దేవ్‌ భార్య, కొడుకును చూశారా? వైరల్‌ అవుతున్న ఫ్యామిలీ ఫొటో

Published Wed, Feb 8 2023 9:04 PM | Last Updated on Thu, Feb 9 2023 9:41 AM

Actor Satya Dev Shared Adorable Family Pic On His Son Birthday - Sakshi

టాలీవుడ్‌లో వర్సలైట్‌ యాక్టింగ్‌తో అతి తక్కువ సమయంలో మంచి నటుడిగా పేరు తెచ్చుకున్న నటుడు సత్యదేవ్‌. ఓ వైపు హీరోగా సినిమాలు చేస్తూనే, మరోవైపు వైవిధ్యమైన పాత్రల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. ఇటీవలె మెగాస్టార్‌ చిరంజీవి 'గాడ్‌ఫాదర్‌' చిత్రంలో కీలక పాత్రలో నటించి మెప్పించిన సత్యదేవ్‌ తాజాగా 'గుర్తుందాదా శీతాకాలం' సినిమాలో హీరోగా అలరించాడు. అయితే సినిమాల్లో రాకముందే సత్యదేవ్‌కు పెళ్లయిన సంగతి తెలిసిందే.

చదవండి: ఫేం కోసం తప్పుడు ప్రచారం.. ‘సింగింగ్‌ ఐకాన్‌’ యశస్వి మోసం బట్టబయలు!

అయితే ఎప్పుడు తన కుటుంబాన్ని మీడియాకు పరిచయం చేయలేదు. దీంతో సత్యదేవ్‌కు పెళ్లయిందనే విషయం చాలా మందికి తెలియదు. ఈ నేపథ్యంలో రీసెంట్‌గా గుర్తుందా శీతాకాలం మూవీ ప్రమోషన్‌ ఈవెంట్‌లో తన భార్యను పరిచయం చేసిన సత్యదేవ్‌ తాజాగా తన కొడుకును కూడా పరిచయం చేశాడు. ఈ రోజు తన కొడుకు బర్త్‌డే సందర్భంగా ఫ్యామిలీ ఫొటో షేర్‌ చేశాడు. సత్య దేవ్‌ భార్య పేరు దీపికా, కొడుకు పేరు సవర్ణిక్‌.

చదవండి: షణ్ముఖ్‌తో హగ్‌లు, ముద్దులు.. స్టేజ్‌పై శ్రీహాన్‌ ముందే సిరి కన్నీళ్లు!

బుధవారం(ఫిబ్రవరి 8) తనయుడి బర్త్‌డే సందర్భంగా భార్య, కొడుకుతో ఉన్న ఫొటోను షేర్‌ చేశాడు. ‘సవర్ణిక్ మూడో ఏడాదిలోకి అడుగుపెడుతున్నాడు. నా ప్రేమకు పుట్టినరోజు శుభాకాంక్షలు’ కొడుకు స్పెషల్‌ బర్త్‌డే విషెస్‌ తెలిపాడు. దీంతో సత్య దేవ్‌ ఫ్యామిలీ ఫొటో నెట్టింట వైరల్‌గా మారింది. ఇంతకాలం మీడియాకు దూరంగా ఉంచిన సత్య దేవ్‌ కొడుకు చాలా క్యూట్‌గా ఉన్నాడంటూ నెటిజన్లు కామెంట్స్‌ చేస్తున్నారు. అంతేకాదు అందమైన ఫ్యామిలీ, చూడముచ్చటైన జంట అంటూ సత్యదేవ్‌ దంపతులపై ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజన్లు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement