స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఇటీవల మగబిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. అప్పుడే బాబుకి నీల్ కిచ్లూ అని పేరు కూడా పెట్టేశారు. ఇదిలా ఇక ఈ చిన్నారి రాకతో కాజల్ కుటుంబం సంతోషంలో మునిగితేలుతోంది. అప్పటి నుంచి కాజల్ తన ముద్దుల తనయుడి ఫొటోలను తరచూ షేర్ చేస్తు వస్తుంది. అయితే ఈ ఫొటోల్లో నీల్ కిచ్లు ముఖం కనిపించి కనిపంచకుండ జాగ్రత్త పడుతోంది ఆమె. తాజాగా మరో ఫొటోను సోషల్ మీడియా వేదికగా పంచుకుంది కాజల్. నేటితో కాజల్ తనయుడికి రెండు నెలలు నిండాయి. గత ఏప్రిల్ 19న కాజల్ నీల్ కిచ్లుకు జన్మనిచ్చింది.
చదవండి: సాయి పల్లవికి చీర పెట్టిన సరళ కుటుంబ సభ్యులు
ఈ సందర్భంగా ఆమె తనయుడి ఫొటోను షేర్ చేస్తూ ఎమోషనల్ అయ్యింది. ‘బెస్ట్‌బర్త్‌డేఎవర్’ అంటూ తన కుమారుడికి విషెస్ తెలిపిన ప్రతి ఒక్కరి ధన్యవాదాలు తెలిపింది. వైట్ కుర్తా, పైజామాతో కొడుకును అలంకరించి ముద్దులు ఒలికిస్తున్న ఫొటోను షేర్ చేసింది. దీంతో కాజల్ పోస్ట్‌కు రామ్ చరణ్ భార్య, ఉపాసన ‘మోస్ట్ అడరాబుల్’ అంటూ కామెంట్ చేసింది. ప్రస్తుతం కాజల్ పోస్ట్ తన ఫ్యాన్స్‌ను బాగా ఆకట్టుకుంటుంది. దీంతో ఆ ఫొటోను ఆమె ఫ్యాన్స్, ఫాలోవర్స్ పలు సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలో షేర్ చేస్తూ వైరల్ చేస్తున్నారు.
చదవండి: స్టార్ హీరో విజయ్ ఆఫీసులో మృతదేహం కలకలం, ఏం జరిగింది?
Comments
Please login to add a commentAdd a comment