బాలీవుడ్‌కు అమలాపాల్‌ | Amala Paul Entry With Arjun Rampal Movie | Sakshi
Sakshi News home page

బాలీవుడ్‌కు అమలాపాల్‌

Published Thu, Jul 26 2018 12:07 PM | Last Updated on Wed, Apr 3 2019 6:34 PM

Amala Paul Entry With Arjun Rampal Movie - Sakshi

తమిళసినిమా: సంచలనం అన్న పదానికి మారు పేరు అమలాపాల్‌ అని అనవచ్చు. ఎప్పుడూ ఒకేలా ఉండటం నావల్ల కాదు అని ముఖం మీద కొట్టినట్లు చెప్పగలిన నటి అమలాపాల్‌. దర్శకుడు విజయ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుని రెండేళ్లకే ఆ బంధానికి చెల్లు చీటి చెప్పేసిన సంచలన నటి అమలాపాల్‌. వైవాహిక జీవితంలో ఇంత జరిగినా ఆ ప్రభావం తన కేరీర్‌పై ఏమాత్రం పడకుండా జాగ్రత్త పడిన నటి ఈ కేరళ కుట్టి. పెళ్లి, సంసారం, విడాకులు అన్నీ దాటి హీరోయిన్‌గా రాణిస్తున్న అరుదైన నటి అమలాపాల్‌.

ఆమె ప్రస్తుతం తమిళంలో రాక్షసన్, మలయాళంలో పృధ్వీరాజ్‌కు జంటగా ఒక చిత్రం చేస్తోంది. విషయమేమిటంటే తాజాగా ఆ అమ్మడికి బాలీవుడ్‌ అవకా«శం వరించిందన్నది సమాచారం. అవును దక్షిణాదిని చుట్టేసిన ఈ బామ ఇక బాలీవుడ్‌లో కలకలం సృష్టించడానికి రెడీ అవుతోంది. హిందీలో నరేశ్‌ మల్హోత్ర దర్శకత్వం వహించనున్న చిత్రంలో అర్జున్‌ రామ్‌పాల్‌కు జంటగా నటించడానికి అమలాపాల్‌ సిద్ధం అవుతోంది. ఈ చిత్ర కథ నచ్చడంతో నటించడానికి అంగీకరించినట్లు అమలాపాల్‌ పేర్కొంది. ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్ర షూటింగ్‌ అక్టోబరు నెలలో హిమాలయాల్లో ప్రారంభం కానుందట. ఈ చిత్రం తరువాత మరిన్ని బాలీవుడ్‌ అవకాశాలు వస్తాయనే ఆశాభావాన్ని అమలాపాల్‌ వ్యక్తం చేస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement