
సాక్షి, ముంబై : ఎయిర్‌హోస్టెస్‌కు మత్తుమందు ఇచ్చి ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డ వ్యక్తిని ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే విచారణలో అతను బాలీవుడ్ నటుడు అర్జున్ రామ్‌పాల్ బావ అని తేలటంతో వ్యవహారం బాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
ముంబై మిర్రర్ కథనం ప్రకారం.. ఇన్వెస్టర్ అయిన అమిత్ గిల్‌కు నటుడు అర్జున్ రామ్‌పాల్ సోదరి కోమల్‌తో కొన్నేళ్ల క్రితం వివాహం జరిగింది. మూడేళ్ల క్రితం ఓ ప్రైవేట్ ఎయిర్‌లైన్స్‌లో పని చేసే ఎయిర్‌హోస్టెస్ ఒకరు గిల్‌ను నమ్మి రూ.18 లక్షలు పెట్టుబడి పెట్టింది. అయితే తర్వాత గిల్ నుంచి ఎలాంటి స్పందన లేకపోవటంతో ఆమె నిలదీయగా.. గిల్ ఆమెకు ఓ చెక్ ఇచ్చాడు. అది కాస్త బౌన్స్ కావటంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేస్తానని అతన్ని బెదిరించింది. దీంతో రూ. 12 లక్షలు చెల్లించాడు. ఇక మిగిలిన సొమ్ము కోసం ఆమెను పదే పదే తన ఆఫీస్ చుట్టూ తిప్పించుకున్నాడు.
ఈ క్రమంలో ఓరోజు ఆఫీస్‌కు వచ్చిన ఆమెకు మత్తు మందు కలిపిన కూల్ డ్రింకు ఇచ్చి ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు. ఆపై ఆమెను నగ్నంగా ఫోటోలు తీసి వేధించటం ప్రారంభించాడు. రెండేళ్లపాటు అతని వేధింపులను భరించిన ఆమె చివరకు సాంటాక్రూజ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దర్యాప్తులో అతని వేధింపులు నిజమని తేలటంతో చివరకు అతన్ని అరెస్ట్ చేశారు. కాగా, ఈ ఘటనపై స్పందించేందుకు రామ్‌పాల్ నిరాకరించారు. అమిత్ గిల్‌పై నిర్భయ కేసు దాఖలు చేసినట్లు ముంబై కమీషనర్ వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment