![Arjun Rampals girlfriend Gabriellas brother is arrested by NCB - Sakshi](/styles/webp/s3/article_images/2021/09/26/arjun%20rampal.jpg.webp?itok=Knef_BSE)
బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ గర్ల్‌ఫ్రెండ్ గాబ్రియెల్లా డెమెట్రియాడ్స్ సోదరుడిని ఇటీవల నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ) అరెస్ట్ చేసింది. ఈ విషయం తెలిసి షాక్ అయ్యానని, ఈ కేసులోకి తన పేరు లాగొద్దని కోరాడు.
ఈ విషయమై మీడియాకి ఓ ప్రకటనని విడుదల చేసిన అర్జున్..‘అగిసిలాస్ డెమెట్రియాడ్స్ (గాబ్రియెల్లా సోదరుడు) అరెస్టు విషయం తెలిసి షాక్ అయ్యాను. అతన కేవలం నా భాగస్వామి సోదరుడు మాత్రమే. అంతేకానీ అతనితో మరే విధమైన రిలేషన్‌షిప్ లేదు. ఈ కేసులోని నన్నులాగొద్దు’ అని తెలిపాడు. నటుడు, నటుడి కుటుంబం చట్టానికి లోబడి ఉండే పౌరులని, ఈ కేసులోకి తన పేరు తీసుకురావడం బాధాకరం అని ఆవేదన వ్యక్తం చేశాడు.
అయితే ఇటీవల అగిసిలాస్ ఇంటిపై దాడి చేసి కొంత మొత్తంలో డ్రగ్స్ స్వాధీనం చేసుకున్న ఎన్‌సీబీ అరెస్ట్ చేసి జ్యుడీషియల్ కస్టడీకి పంపింది. డ్రైవ్ సమయంలో చరాస్, ఎల్‌ఎస్‌డి, ఎండిఎమ్‌ఎ/ఎక్స్టసీ వంటివి లభించడంతో అతడితో పాటు మరో నలుగురు డ్రగ్ డీలర్లపై మూడు ఎన్‌డీపీఎస్ కేసులను నమోదు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment