![Arjun Rampal Gave Perfect Reply To A Troll On Instagram. - Sakshi](/styles/webp/s3/article_images/2019/09/5/arjun.gif.webp?itok=-Yi-7Hzx)
ముంబై పారిశ్రామిక నగరాన్ని భారీ వర్షాలు ముంచెత్తుతున్న విషయం తెలిసిందే. ముంబైలో ఇలాంటి వర్షాలు కురవడం ఇది మూడోసారి. ఈసారి వరదల్లో సాధారణ ప్రజలతో పాటు ప్రముఖ బాలీవుడ్ తారలు సైతం చిక్కుకోవడం గమనార్హం. వరదల్లో తమ పరిస్థితులను సైతం సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. ఈ క్రమంలో బాలీవుడ్ స్టార్ అర్జున్ రాంపాల్ వరదల్లో చిక్కుకున్న ఓ లగ్జరీ కారును ఉద్దేశిస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోను షేర్ చేస్తూ.. ఓ కామెంట్ చేశారు.
వివరాల్లోకి వెళ్తే అర్జున్ రాంపాల్ బుధవారం వరదల్లో కూరుకుపోయిన ముంబై వీధుల్లో కారులో వెళుతూ..‘ఖరీదైన లగ్జరీ కార్లు నీటిలో నడవడం చాలా కష్టం. ఇలాంటి పరిస్థితుల్లో కేవలం ఇండియా కార్లు మాత్రమే ముందుకు సాగగలవు. జాగ్రత్తగా నడపండి’ అంటూ పోస్ట్ చేశాడు. రెడ్ కలర్ మెర్సిడెస్ కారును ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేసినట్లు వీడియోలో కనిపిస్తోంది. దీనిపై స్పందించిన కొంతమంది నెటిజన్లు సోషల్‌మీడియాలో అర్జున్‌ను ట్రోల్ చేస్తూ విమర్శలకు దిగారు.
దీనిపై స్పందించిన ఓ నెటిజన్ ‘ఏం మాట్లాడుతున్నారండి, అయితే మీరు మీ రేంజ్ రోవర్ కార్ వాడటం మానేసి మారుతి ఆల్టోని కొనండి’ అని ట్రోల్ చేశాడు. ఆ కామెంట్‌కు బదులుగా.. ‘ఈ వీడియో నా ఆల్టో నుంచే తీశాను’ అని సమాధానమిచ్చాడు. హాస్యాస్పదంగా పెట్టిన ఈ కామెంట్‌ను చూసిన తన అభిమానులంతా సరిగ్గా సమాధానం చెప్పావ్ అంటూ అర్జున్‌ను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment