వాళ్లకు విడాకులు మంజూరయ్యాయి! | Report Says Arjun Rampal And Mehr Jesia Got Divorce Officially | Sakshi
Sakshi News home page

ఆ జంట అధికారికంగా విడిపోయింది!

Published Thu, Nov 21 2019 3:06 PM | Last Updated on Thu, Nov 21 2019 3:13 PM

Report Says Arjun Rampal And Mehr Jesia Got Divorce Officially - Sakshi

ముంబై : బాలీవుడ్‌ నటుడు అర్జున్‌ రాంపాల్‌, మాజీ సూపర్ మోడల్‌ మెహర్‌ జెసియా అధికారికంగా విడిపోయారు. బాంద్రా ఫ్యామిలీ కోర్టు ఈ జంటకు విడాకులు మంజూరు చేసింది.  ‘రాక్‌ ఆన్‌’ ఫేమ్‌ అర్జున్‌ రాంపాల్‌ 20 ఏళ్ల వైవాహిక బంధానికి స్వస్తి చెప్పి భార్య మెహర్‌ జెసియాను విడాకులు కోరిన సంగతి తెలిసిందే. ఆమె కూడా ఇందుకు సమ్మతం తెలపడంతో... ‘ ఈ 20 ఏళ్ల ప్రయాణంలో ఎన్నో అందమైన ఙ్ఞాపకాలు ఉన్నాయి. ప్రస్తుతం మేం వేర్వేరు దారుల్లో ప్రయాణించాలనుకుంటున్నాం. కొత్త జీవితం ఆరంభించాలనుకుంటున్నాం అంటూ 2018లో సంయుక్త ప్రకటన విడుదల చేశారు. పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించడంతో జడ్జి శైలజా సావంత్‌ ప్రత్యేక వివాహ చట్టం కింద వీరికి విడాకులు మంజూరు చేస్తున్నట్లు గురువారం ప్రకటించారు. ఈ మేరకు ముంబై మిర్రర్‌ కథనం ప్రచురించింది.

కాగా అర్జున్‌ రాంపాల్‌ 1998లో మెహర్‌ను పెళ్లి చేసుకున్నాడు. ఈ జంటకు కుమార్తెలు మహిక(17), మైరా(13) ఉన్నారు. ఇక భార్యతో విడిపోనున్నట్లు ప్రకటించిన.. అనంతరం రాంపాల్‌  దక్షిణాఫ్రికా మోడల్‌ గాబ్రియెల్లా డెమెత్రియెడ్స్‌తో సహజీవనం చేస్తున్నాడు. ఈ క్రమంలో ఈ ఏడాది జూలైలో ఆమె మగ బిడ్డకు జన్మనిచ్చింది. అతడికి అరిక్‌ అని నామకరణం చేశారు. కాగా ఐపీఎల్‌ సెలబ్రేషన్స్‌లో భాగంగా 2009లో ఓ పార్టీలో అర్జున్‌కు పరిచయమైన గాబ్రియెల్లా పలు బాలీవుడ్‌ సినిమాల్లోనూ నటించింది. అంతేకాకుండా నాగార్జున- కార్తి కాంబినేషన్‌లో తెరెకెక్కిన ‘ఊపిరి’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను కూడా పలకరించిన సంగతి తెలిసిందే.


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement