Bandra court
-
కంగనాపై దేశద్రోహం కేసు
ముంబై: ముంబైలోని బాంద్రా మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ఆదేశాల మేరకు బాలీవుడ్ నటి కంగనా రనౌత్, ఆమె సోదరి రంగోలి చందేల్‌పై ముంబై పోలీసులు శనివారం ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. బాలీవుడ్ కాస్టింగ్ డైరెక్టర్, ఫిట్‌నెట్ ట్రైనర్ మునావర్ అలీ సయ్యద్ దాఖలు చేసిన ఫిర్యాదుపై దర్యాప్తు జరపాలని పోలీసులను న్యాయస్థానం ఆదేశించింది. కంగనా, ఆమె సోదరి గత రెండు నెలలుగా ట్వీట్లు, వివాదాస్పద ప్రకటనలు, ఇంటర్వ్యూలతో సమాజంలోని వివిధ వర్గాలు, మతాల మధ్య విద్వేషాలను రెచ్చగొడుతున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ మునావర్ అలీ సయ్యద్ బాంద్రా కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు కంగనా, రంగోలిపై ఐపీసీ సెక్షన్ 153ఏ(మతం, వర్గం ఆధారంగా ప్రజల మధ్య శత్రుత్వాన్ని ప్రోత్సహించడం), 295ఏ(మత విశ్వాసాలను గాయపర్చడం), 124ఏ (దేశద్రోహం) కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కంగనా, ఆమె సోదరి అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారని సయ్యద్ తరపు న్యాయవాది పేర్కొన్నారు. బంధుప్రీతి అంటూ బాలీవుడ్ కళాకారుల మధ్య చీలిక తెచ్చేందుకు ప్రయత్నించారని విమర్శించారు. ప్రజల మత విశ్వాసాలను కించపర్చారని తెలిపారు. -
పప్పు సేన నన్ను మిస్ అవుతోంది : కంగన
సాక్షి, ముంబై: బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌కు వరుస కేసుల షాక్ తగులుతోంది. ఇప్పటికే కర్నాటక కోర్టు ఆదేశాలకు మేరకు ఎఫ్ఐఆర్ నమోదు కాగా తాజాగా బాంద్రా కోర్ట్ కంగనాకు మరో ఝలక్ ఇచ్చింది. అంతేకాదు కంగనాతోపాటు ఆమె సోదరి రంగోలి చందేల్‌కి ఇబ్బందులు తప్పలేదు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే పై అవమానకరమైన వ్యాఖ్యలు,సోషల్ మీడియాలో మతవిద్వేషాన్ని రెచ్చగొడుతున్నారన్న ఆరోపణల నేపథ్యంలో వారిపై కేసు నమోదు చేయాలని ఫిర్యాదు నమోదైంది. దీన్ని విచారించిన బాంద్రా మేజిస్ట్రేట్ మెట్రోపాలిటన్ కోర్టు కంగనా, ఆమె సోదరి రంగోలి చందేల్ పై కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఆదేశించింది. ఇద్దరు సోదరీమణులు బాలీవుడ్, ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే గురించి అవమానకరమైన వ్యాఖ్యలను ట్వీట్ చేస్తున్నారని ఆరోపించిన మున్నవారాలి అకాసాహిల్ అహస్రఫాలి సయ్యద్ ఈ ఫిర్యాదును నమోదు చేశారు. సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని, వారి ట్వీట్లు మత విద్వేషాన్ని వ్యాప్తి చేస్తున్నాయని ఆరోపించారు. ఈమేరకు బాంద్రా పోలీస్‌స్టేషన్‌లో దీనిపై ఫిర్యాదు చేయడానికి ప్రయత్నించానని, కాని వారు దానిని నమోదు చేయలేదని ఆయన ఆరోపించారు. దీంతో బాంద్రా కోర్టును ఆశ్రయించానన్నారు. మరోవైపు దీనిపై స్పందించిన కంగనా మహారాష్ట్రలోని పప్పు సేనకు తనపై మక్కువ ఎక్కువై పోయిందంటూ వ్యంగ్యంగా కమెంట్ చేశారు. అంత మిస్ అవ్వద్దు.. త్వరలోనే అక్కడకు వస్తాను అంటూ ట్వీట్ చేశారు. తన నవరాత్రి ఉపవాస ఫోటోలను షేర్ చేశారు. కాగా వ్యవసాయ చట్టాలపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ తుమకూరు కోర్టు ఆదేశాల మేరకు క్యతాసంద్ర పోలీస్ స్టేషన్లో కంగనాపై ఎఫ్ఐఆర్ దాఖలైన సంగతి తెలిసిందే. Who all are fasting on Navratris? Pictures clicked from today’s celebrations as I am also fasting, meanwhile another FIR filed against me, Pappu sena in Maharashtra seems to be obsessing over me, don’t miss me so much I will be there soon ❤️#Navratri pic.twitter.com/qRW8HVNf0F — Kangana Ranaut (@KanganaTeam) October 17, 2020 -
వాళ్లకు విడాకులు మంజూరయ్యాయి!
ముంబై : బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్, మాజీ సూపర్ మోడల్ మెహర్ జెసియా అధికారికంగా విడిపోయారు. బాంద్రా ఫ్యామిలీ కోర్టు ఈ జంటకు విడాకులు మంజూరు చేసింది. ‘రాక్ ఆన్’ ఫేమ్ అర్జున్ రాంపాల్ 20 ఏళ్ల వైవాహిక బంధానికి స్వస్తి చెప్పి భార్య మెహర్ జెసియాను విడాకులు కోరిన సంగతి తెలిసిందే. ఆమె కూడా ఇందుకు సమ్మతం తెలపడంతో... ‘ ఈ 20 ఏళ్ల ప్రయాణంలో ఎన్నో అందమైన ఙ్ఞాపకాలు ఉన్నాయి. ప్రస్తుతం మేం వేర్వేరు దారుల్లో ప్రయాణించాలనుకుంటున్నాం. కొత్త జీవితం ఆరంభించాలనుకుంటున్నాం అంటూ 2018లో సంయుక్త ప్రకటన విడుదల చేశారు. పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించడంతో జడ్జి శైలజా సావంత్ ప్రత్యేక వివాహ చట్టం కింద వీరికి విడాకులు మంజూరు చేస్తున్నట్లు గురువారం ప్రకటించారు. ఈ మేరకు ముంబై మిర్రర్ కథనం ప్రచురించింది. కాగా అర్జున్ రాంపాల్ 1998లో మెహర్‌ను పెళ్లి చేసుకున్నాడు. ఈ జంటకు కుమార్తెలు మహిక(17), మైరా(13) ఉన్నారు. ఇక భార్యతో విడిపోనున్నట్లు ప్రకటించిన.. అనంతరం రాంపాల్ దక్షిణాఫ్రికా మోడల్ గాబ్రియెల్లా డెమెత్రియెడ్స్‌తో సహజీవనం చేస్తున్నాడు. ఈ క్రమంలో ఈ ఏడాది జూలైలో ఆమె మగ బిడ్డకు జన్మనిచ్చింది. అతడికి అరిక్ అని నామకరణం చేశారు. కాగా ఐపీఎల్ సెలబ్రేషన్స్‌లో భాగంగా 2009లో ఓ పార్టీలో అర్జున్‌కు పరిచయమైన గాబ్రియెల్లా పలు బాలీవుడ్ సినిమాల్లోనూ నటించింది. అంతేకాకుండా నాగార్జున- కార్తి కాంబినేషన్లో తెరెకెక్కిన ‘ఊపిరి’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను కూడా పలకరించిన సంగతి తెలిసిందే. -
అర్మాన్ కోహ్లిని క్షమించేశాను : నీరా
ముంబై : తన గర్ల్ ఫ్రెండ్, ఫ్యాషన్ స్టైలిస్ట్ నీరూ రాంధవాను దారుణంగా కొట్టి, హింసించిన కేసుల్లో వివాదాస్పద నటుడు అర్మాన్ కోహ్లి మంగళవారం అరెస్టైన విషయం తెలిసిందే. అయితే కోహ్లిపై పెట్టిన కేసును వాపసు తీసుకుంటున్నట్లు చెప్పి నీరూ రాంధవా అందరినీ ఆశ్చర్యపరిచారు. ఓ జాతీయ మీడియాతో మాట్లాడిన నీరూ.. కేసు వెనక్కి తీసుకోవడానికి గల కారణాలు వెల్లడించారు. ‘అతడికి ఇతరులను హింసించగల సామర్థ్యం ఉంది. అందుకే అతడి ఆగడాలకు నేను బలయ్యాను. నా దగ్గర బ్రిటన్ పాస్‌పోర్టు ఉంది. యూకే వెళ్లి అక్కడే సెటిల్ అవ్వాలనుకుంటున్నాను. ఈ కేసును పట్టుకుని కూర్చుంటే తరచుగా ముంబై రావాల్సి ఉంటుంది. అర్మాన్ లాంటి దిగజారిన వ్యక్తి కోసం సమయం వృథా చేసుకోవడం ఇష్టం లేదు. నా జీవితంలో అతడో పీడకల. అతడు నా పట్ల ప్రవర్తించిన తీరుకు తగిన గుణపాఠం చెప్పాననే అనుకుంటున్నాను. పాజిటివ్ ఆటిట్యూడ్‌తో అతడిని క్షమించేశాను’ అంటూ వ్యాఖ్యానించారు. కాగా తనకు బెయిలు కావాలంటూ అర్మాన్ చేసిన విఙ్ఞప్తిని బాంద్రా కోర్టు తిరస్కరించింది. ఈ నేపథ్యంలో జూన్ 26 వరకు అతడు జైలులోనే గడపాల్సి ఉంటుంది. -
బాలీవుడ్ జంటకు విడాకులు మంజూరు
ముంబై: బాలీవుడ్ జంట అర్బాజ్ ఖాన్, మలైకా అరోరాలు 18 ఏళ్ల వివాహ బంధానికి స్వస్తి పలికారు. విభేదాల కారణంగా విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్న ఈ జంట గత నవంబర్ నెలలో తొలిసారిగా కోర్టు మెట్లెక్కింది. ముంబైలోని బాంద్రా ఫ్యామిలీ కోర్టుకు వ్యక్తిగతంగా హాజరైన అర్బాజ్, మలైకాలకు పలుమార్లు కౌన్సెలింగ్ నిర్వహించినా ప్రయోజనం లేకపోయింది. దీంతో వీరి విడాకుల పిటిషన్ పై ఫ్యామిలీ కోర్టు తుది తీర్పిచ్చింది. వీరికి విడాకులు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. అర్బాజ్, మలైకాల వివాహం 1998లో జరిగింది. వీరికి 14 ఏళ్ల ఓ కొడుకు ఉన్నాడు. మనస్పర్థల కారణంగా గతేడాది తాము విడిపోవాలనుకుంటున్నట్లు ఇద్దరూ ప్రకటించారు. గురువారం బాంద్రా ఫ్యామిలీ కోర్టు వీరి వివాహ బంధం ముగిసినట్లు తీర్పిచ్చింది. బాబు సంరక్షణ బాధ్యతలను మలైకాకు అప్పగించగా.. బాబును కలిసి అతడితో సమయం వెచ్చించేందుకు అర్బాజ్ ను ఫ్యామిలీ కోర్టు అనుమతించింది. విడాకులు కావాలంటూ కోర్టు మెట్లు ఎక్కిన వీరిద్దరూ కలిసి ఈ ఏడాది కొత్త సంవత్సర వేడుకలు జరుపుకోవడంతో అంతా సద్దుమణిగిందని పొరపడ్డారు. స్నేహితులతో కలిసి గోవాలో వీరు న్యూఇయర్ పార్టీని ఎంజాయ్ చేశారు. సల్మాన్ ఇంట్లో ప్రతి వేడుకకు మలైకా ఆరోరా రావడంతో విడాకుల నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటారని భావించారు. కానీ తమ కుమారుడి సంతోషం కోసమే ఈ సందిగ్ద కాలంలోనూ వారు కలిసి ఉన్నట్లు తెలుస్తోంది. బాలీవుడ్ హీరో అర్జున్ కపూర్‌తో మలైకా చనువుగా ఉండటమూ వీరి బంధానికి ముగింపు పలికేలా చేసిందని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. -
కోర్టుకు హాజరైన బాలీవుడ్ జంట
ముంబై: బాలీవుడ్ జంట అర్బాజ్ ఖాన్, మలైకా అరోరా 17 ఏళ్ల వివాహ బంధం ముగిసింది. విభేదాల కారణంగా విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్న ఈ జంట మంగళవారం ముంబైలోని బాంద్రా ఫ్యామిలీ కోర్టుకు వ్యక్తిగతంగా హాజరయ్యారు. అర్బాజ్, మలైకా పరస్పర అంగీకారంతో విడాకులు కోరుతూ కోర్టులో దరఖాస్తు చేశారు. అర్బాజ్, మలైకా 1997లో వివాహం చేసుకున్నారు. వీరికి ఓ కొడుకు ఉన్నాడు. బాలీవుడ్ హీరో అర్జున్ కపూర్‌తో మలైకాకు ఎఫైర్ ఉందని, దీంతో అర్బాజ్‌తో విభేదాలు ఏర్పడినట్టు వార్తలు వచ్చాయి. ఇద్దరూ విడిపోతున్నట్టు గత మార్చిలో ఓ ప్రకటన చేశారు. ఆ తర్వాత మలైకా, అర్బాజ్ కలసిఉండేలా ఇరు కుటుంబాలు ప్రయత్నాలు చేసినా ఫలించలేదు. విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్న వీరిద్దరూ నిన్న కోర్టుకు వచ్చారు. మ్యారేజి కౌన్సిలింగ్‌కు కలసి వచ్చిన ఇద్దరూ తర్వాత ఎవరి దారిన వారు వెళ్లారు. విడాకులకు దరఖాస్తు చేసిన తర్వాత కోర్టు ఆరు నెలల సమయం ఇస్తుంది. అప్పటికీ విడిపోవాలని నిర్ణయించుకుంటే విడాకులు మంజూరు చేస్తుంది. ప్రస్తుతం మలైకా అర్బాజ్‌కు దూరంగా ఉంటోంది. -
అతుల్ శర్మ నన్ను చంపుతానని బెదిరించాడు: పేస్
ముంబై: తనను, తన కూతుర్ని చంపుతానని బెదిరించారని క్రికెటర్ అతుల్ శర్మపై టెన్నిస్ స్టార్ లియాండర్ పేస్ బాంద్రా కుర్లా కాంప్లెక్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అతుల్ శర్మతో తన మాజీ భార్య రియా పిళ్లై తో సంబంధాలున్నట్టు తెలిపే సాక్ష్యాధారాలను కోర్టుకు పేస్ సమర్పించారు. బంద్రా కోర్టు కాంప్లెక్స్ లో నన్ను, నాకూతుర్ని చంపుతానని అతుల్ శర్మ బెదిరించారని లియాండ్ పేస్ తెలిపారు. లియాండర్ పేస్ ఫిర్యాదు మేరకు అతుల్ శర్మపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. -
షారుక్ ఖాన్ పై కేసు నమోదు!
ముంబై: బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ పై ముంబైలో బాంద్రా కోర్టులో కేసు నమోదు చేశారు. షారుక్ నివాసం మన్నత్ పక్కన అక్రమ ర్యాంప్ నిర్మాణంపై గత కొద్దిరోజులుగా వివాదం రేగుతున్న సంగతి తెలిసిందే. షారుక్ నివాసం వద్ద నిర్మించిన అక్రమ కట్టడంపై కోర్టుకు ఫిర్యాదు చేశామని, వచ్చె నెల విచారణకు రానుందని న్యాయవాది వివియన్ డిసౌజా వెల్లడించారు. ఈ వివాదంపై సామాజిక కార్యకర్త నికోలాస్ అల్మీదా కేసు నమోదు చేశారు. ఈ కేసులో బృహన్ ముంబై మున్సిపల్ కార్పోరేషన్ కమిషనర్, మరో ముగ్గురు అధికారులను ప్రతివాదులగా చేశారు. ప్రజల రాకపోకలకు ఇబ్బంది కలిగేలా నిర్మించిన కట్టడాన్ని తొలగించడానికి పలువురు అధికారులను కలిశానని, అయితే వారి వద్ద నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో కోర్టును ఆశ్రయించానని అల్మీదా వెల్లడించారు.