కోర్టుకు హాజరైన బాలీవుడ్‌ జంట | Malaika-Arbaaz at family court in Bandra for divorce proceedings | Sakshi
Sakshi News home page

కోర్టుకు హాజరైన బాలీవుడ్‌ జంట

Published Wed, Nov 30 2016 9:19 AM | Last Updated on Tue, Oct 2 2018 3:56 PM

కోర్టుకు హాజరైన బాలీవుడ్‌ జంట - Sakshi

కోర్టుకు హాజరైన బాలీవుడ్‌ జంట

ముంబై: బాలీవుడ్‌ జంట అర్బాజ్‌ ఖాన్‌, మలైకా అరోరా 17 ఏళ్ల వివాహ బంధం ముగిసింది. విభేదాల కారణంగా విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్న ఈ జంట మంగళవారం ముంబైలోని బాంద్రా ఫ్యామిలీ కోర్టుకు వ్యక‍్తిగతంగా హాజరయ్యారు. అర్బాజ్‌, మలైకా పరస్పర అంగీకారంతో విడాకులు కోరుతూ కోర్టులో దరఖాస్తు చేశారు.

అర్బాజ్‌, మలైకా 1997లో వివాహం చేసుకున్నారు. వీరికి ఓ కొడుకు ఉన్నాడు. బాలీవుడ్‌ హీరో అర్జున్‌ కపూర్‌తో మలైకాకు ఎఫైర్‌ ఉందని, దీంతో అర్బాజ్‌తో విభేదాలు ఏర్పడినట్టు వార్తలు వచ్చాయి. ఇద్దరూ విడిపోతున్నట్టు గత మార్చిలో ఓ ప్రకటన చేశారు. ఆ తర్వాత మలైకా, అర్బాజ్‌ కలసిఉండేలా ఇరు కుటుంబాలు ప్రయత్నాలు చేసినా ఫలించలేదు. విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్న వీరిద్దరూ నిన్న కోర్టుకు వచ్చారు. మ్యారేజి కౌన్సిలింగ్‌కు కలసి వచ్చిన ఇద్దరూ తర్వాత ఎవరి దారిన వారు వెళ్లారు. విడాకులకు దరఖాస్తు చేసిన తర్వాత కోర్టు ఆరు నెలల సమయం ఇస్తుంది. అప్పటికీ విడిపోవాలని నిర్ణయించుకుంటే విడాకులు మంజూరు చేస్తుంది. ప్రస్తుతం మలైకా అర్బాజ్‌కు దూరంగా ఉంటోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement