
అర్మాన్ కోహ్లి- నీరూ రాంధవా
ముంబై : తన గర్ల్ ఫ్రెండ్, ఫ్యాషన్ స్టైలిస్ట్ నీరూ రాంధవాను దారుణంగా కొట్టి, హింసించిన కేసుల్లో వివాదాస్పద నటుడు అర్మాన్ కోహ్లి మంగళవారం అరెస్టైన విషయం తెలిసిందే. అయితే కోహ్లిపై పెట్టిన కేసును వాపసు తీసుకుంటున్నట్లు చెప్పి నీరూ రాంధవా అందరినీ ఆశ్చర్యపరిచారు. ఓ జాతీయ మీడియాతో మాట్లాడిన నీరూ.. కేసు వెనక్కి తీసుకోవడానికి గల కారణాలు వెల్లడించారు.
‘అతడికి ఇతరులను హింసించగల సామర్థ్యం ఉంది. అందుకే అతడి ఆగడాలకు నేను బలయ్యాను. నా దగ్గర బ్రిటన్ పాస్‌పోర్టు ఉంది. యూకే వెళ్లి అక్కడే సెటిల్ అవ్వాలనుకుంటున్నాను. ఈ కేసును పట్టుకుని కూర్చుంటే తరచుగా ముంబై రావాల్సి ఉంటుంది. అర్మాన్ లాంటి దిగజారిన వ్యక్తి కోసం సమయం వృథా చేసుకోవడం ఇష్టం లేదు. నా జీవితంలో అతడో పీడకల. అతడు నా పట్ల ప్రవర్తించిన తీరుకు తగిన గుణపాఠం చెప్పాననే అనుకుంటున్నాను. పాజిటివ్ ఆటిట్యూడ్‌తో అతడిని క్షమించేశాను’ అంటూ వ్యాఖ్యానించారు.
కాగా తనకు బెయిలు కావాలంటూ అర్మాన్ చేసిన విఙ్ఞప్తిని బాంద్రా కోర్టు తిరస్కరించింది. ఈ నేపథ్యంలో జూన్ 26 వరకు అతడు జైలులోనే గడపాల్సి ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment