వివాదంలో ప్రముఖ నటుడు.. కేసు నమోదు | Complaint of assault filed against actor Arjun Rampal in Delhi | Sakshi
Sakshi News home page

వివాదంలో ప్రముఖ నటుడు.. కేసు నమోదు

Published Sun, Apr 9 2017 9:28 AM | Last Updated on Tue, Sep 3 2019 8:43 PM

వివాదంలో ప్రముఖ నటుడు.. కేసు నమోదు - Sakshi

వివాదంలో ప్రముఖ నటుడు.. కేసు నమోదు

ముంబై: బాలీవుడ్ ప్రముఖ నటుడు అర్జున్ రాంపాల్ ఓ వివాదంలో చిక్కుకున్నాడు. ఆ హీరోపై దాడి కేసు నమోదైంది. ఆ వివరాలిలా ఉన్నాయి.. మోడల్ గా కెరీర్ ఆరంభించి ఆపై కొన్ని సినిమాల్లో హీరోగా నటించిన రాంపాల్ 2000 దశకంలో స్టార్ హీరోగా ఓ వెలుగు వెలిగాడు. నిర్మాతగానూ రాంపాల్ కొన్ని సినిమాలను రూపొందించాడు. ప్రస్తుతం టెలివిజన్ షోలతో బిజీగా ఉన్న అర్జున్ రాంపాల్ ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఓ ఫొటోగ్రాఫర్ పై దాడికి పాల్పడ్డాడు. ఈ వివాదం ముదిరి పోలీస్ స్టేషన్ కు చేరింది.

ఢిల్లీలోని ఓ ఫైవ్ స్టార్ హోటల్ లో జరిగిన ఈవెంట్లో ఓ ఫొటోగ్రాఫర్ రాంపాల్ వద్దకు వచ్చాడు. నటుడు వద్దని ఎంత వారిస్తున్నా ఫొటోగ్రాఫర్ కెమెరాకు పని చెబుతూ.. ఫొటోలు తీశాడు. దీంతో చిర్రెత్తుకొచ్చిన రాంపాల్ మొదట ఫొటోగ్రాఫర్ చేతిలో కెమెరాను తీసుకుని విసిరికొట్టడంతో అది పాడయింది. దీంతో వెంటనే రాంపాల్ ను ప్రశ్నించగా.. తనపై దాడికి పాల్పడి గాయపరిచాడని బాధిత ఫొటోగ్రాఫర్ పోలీసులను ఆశ్రయించాడు. తనకు న్యాయం చేయాలని కోరుతూ నటుడు రాంపాల్ పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement