ఇన్ని మెసేజ్‌లా.. నేనెవరిపై దాడి చేయలేదు: నటుడు | Woke up to be flooded by messages of assaulting a fan | Sakshi
Sakshi News home page

ఇన్ని మెసేజ్‌లా.. నేనెవరిపై దాడి చేయలేదు: నటుడు

Published Sun, Apr 9 2017 5:03 PM | Last Updated on Wed, Apr 3 2019 6:34 PM

ఇన్ని మెసేజ్‌లా.. నేనెవరిపై దాడి చేయలేదు: నటుడు - Sakshi

ఇన్ని మెసేజ్‌లా.. నేనెవరిపై దాడి చేయలేదు: నటుడు

ముంబై: ‘పొద్దున్న లేచి చూడగానే.. నేను అభిమానిపై దాడి చేసినట్టు వరదలా మెసేజ్‌లు వచ్చిపడ్డాయి. ఎవరు వీళ్లు? ఎందుకిలా వార్తలు సృష్టిస్తారు. నేనెవరిపై దాడి చేయలేదు. ఫేక్‌  న్యూస్‌’ ఇది బాలీవుడ్‌ నటుడు అర్జున్‌ రాంపాల్‌ చేసిన ట్వీట్‌. తాను ఓ అభిమానిపై దాడి చేసినట్టు పోలీసు కేసు నమోదు కావడంతో ఆయన ఈ మేరకు వివరణ ఇచ్చారు.

అర్జున్‌ రాంపాల్‌ తనపై దాడి చేసినట్టు షాబిత్‌ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ముంబైలోని షాంగ్రీ-లా హోటల్‌ నైట్‌క్లబ్‌లో అర్జున్‌ రాంపాల్‌ డీజేగా ఉండగా ఆదివారం తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. నైట్‌క్లబ్‌లో రాంపాల్‌ ఎంత వద్దని వారిస్తున్నా ఫొటోగ్రాఫర్ ఫొటోలు తీసేందుకు ప్రయత్నించడంతో.. చిర్రెత్తుకొచ్చిన రాంపాల్ అతని కెమెరాను లాక్కొని జనాల్లోకి విసిరాడు. అది జనాలు క్యాచ్‌ చేస్తారని రాంపాల్‌ అనుకున్నప్పటికీ.. అది కాస్తా వెళ్లి షాబిత్‌ అనే వ్యక్తికి తాకింది. దీంతో తనకు గాయమైందని అతను పోలీసులకు ఫిర్యాదు చేశాడు.  పోలీసులు ప్రస్తుతం నైట్‌ క్లబ్‌ సీసీటీవీ కెమెరా దృశ్యాలను పరిశీలిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement