
ముంబై: దివంగత నటుడు సుశాంత్ సింగ్ మృతి కేసులో వెలుగు చూసిన డ్రగ్ వ్యవహరంలో సంబంధాలు ఉన్నట్లు బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ కేసులో నార్కొటిక్ కంట్రోల్ బ్యూరో(ఎన్‌సీబీ) మరోసారి అర్జున్‌కు మంగళవారం సమన్లు అందజేసి తదుపరి విచారణకు ఇవాళ(డిసెంబర్ 16) ఎన్‌సీబీ కార్యాలయంలో హజరుకావల్సిందిగా ఆదేశించింది. అయితే ఈ రోజు విచారణకు అర్జున్ హాజరకాలేదు. డిసెంబర్ 21వ తేదీ వరకు ఆయనకు గడువుకాలని ఎన్‌సీబీని కోరాడు. కాగా ఇప్పటికే ఈ కేసులో అర్జున్‌కు గత నవంబర్ 9న ఎన్‌సీబీ సమన్లు అందజేసి ఆయన ఇంటిపై దాడులు నిర్వహించిన సంగతి తెలిసిందే. కొద్ది గంటలపాటు ఆయన ఇంటిలో తనిఖీ చేసిన ఎన్‌సీబీ అధికారులు కొన్నీ డాక్యుమెంట్స్‌తో పాటు పలు ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్‌ను స్వాధీనం చేసుకుని 13న విచారించింది. ఆ తర్వాత ఆయన గర్ల్‌ఫ్రెండ్ గ్యాబ్రియోల్ డెమెట్రియేడ్స్‌కు కూడా సమన్లు అందజేసి విచారించారు. (చదవండి: అర్జున్ రాంపాల్‌కు మరోసారి సమన్లు)
అయితే ఈ ఏడాది జూన్ 14న హీరో సుశాంత్ సింగ్ ముంబైలోని తన ఇంటిలో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. సుశాంత్ మృతి కేసు దర్యాప్తులో భాగంగా బాలీవుడ్ డ్రగ్ వ్యవహరం వెలుగు చూసింది. ఈ కేసులో ప్రధాన నిందితురాలైన రియా చక్రవర్తి, ఆమె సోదరుడు షోవిక్ చక్రవర్తి సుశాంత్‌కు డ్రగ్స్ ఇచ్చినట్లు ఆరోపణలు రుజువు కావడంతో వారిని పోలీసులు ఆరెస్టు చేశారు. విచారణలో రియా హీరోయిన్ దీపికా పదుకొనె, శ్రద్ధా కపూర్, సారా అలీఖాన్, రకుల్ ప్రీత్ సింగ్‌ల పేర్లను వెల్లడించడంతో ఎన్‌సీబీ వారికి కూడా సమన్లు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఈ కేసులో అరెస్టెయిన రియా, ఆమె సోదరుడు షోవిక్‌లకు ఇటీవల బెయిల్ లభించగా సుశాంత్ ఇంటీ మేనేజర్ శామ్యూల్ మిరాండా, పర్సనల్ స్టాఫ్ దీపేశ్ సావంత్‌తో మరో ఇద్దరూ జైలులోనే ఉన్నారు. (చదవండి: సుశాంత్ కేసు: రూ. 2.5 కోట్ల డ్రగ్స్ స్వాధీనం)
Comments
Please login to add a commentAdd a comment