
నవంబర్ 26న పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు
ఈరోజు మీతోపాటు పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు
అర్జున్ రాంపాల్ (యాక్టర్)
ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న వారి సంవత్సర సంఖ్య 9. ఇది కుజునికి సంబంధించినది. 9 అంకె పరిపూర్ణతకు, సంతృప్తికి, కార్యసిద్ధికి సంకేతం కాబట్టి కొత్త ఆశలు, ఆశయాలతో జీవితం ప్రారంభించడానికి ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది. పై అధికారుల నుండి మీరు కోరినవి లభిస్తాయి. అయితే కుజుని ప్రభావం వల్ల దూకుడుగా వ్యవహరించడం, నిర్మొహమాటంగా మాట్లాడటం మూలాన ఇతరులతో వివాదాలు వచ్చే అవకాశం ఉంది. ఇతర కులస్థులతో ప్రేమ వ్యవహారాల వల్ల కొంత చికాకు కలుగుతుంది. అయితే దీనిని సామరస్యంగానే పరిష్కరించుకోవాలి. పదునైన ఆయుధాల వాడకంలోనూ, వాహనాలు నడిపేటప్పుడూ, నిప్పుతోనూ అప్రమత్తంగా ఉండకపోతే ముప్పు తప్పదు. పుట్టిన తేదీ 26. ఇది శనికి సంబంధించినది కావడం వల్ల ఈరోజు పుట్టిన వారికి ఆయా వృత్తి ఉద్యోగ వ్యాపారాలు అభివృద్ధికరంగా సాగుతాయి.
అయితే దేనిమీదా అతిగా ఆశలు పెట్టుకోవడం అంత మంచిది కాదు. అవివాహితులకు వివాహయోగం, నిరుద్యోగులకు ఉద్యోగప్రాప్తి ఉన్నాయి. ఇనుము, ఐరన్ అండ్ స్టీల్, ఆయిల్ వ్యాపారులకు అభివృద్ధికరంగా ఉంటుంది. లక్కీ నంబర్స్: 1,2,3,6,8,9; లక్కీ డేస్: ఆది, సోమ, మంగళ, శుక్ర, శనివారాలు; లక్కీ కలర్స్: వైట్, సిల్వర్, రెడ్, ఆరంజ్, బ్లూ, బ్లాక్, పర్పుల్. సూచనలు: సుబ్రహ్మణ్యేశ్వరునికి అభిషేకం, సుదర్శన హోమం చేయించడం, ఇంటిలో ఖురాన్ పఠన చేయించడం లేదా ప్రేయర్ పెట్టించడం, రక్తదానం చేయడం, తల్లిని, తోబుట్టువులను ఆదరించడం, అనాథలకు మందులు పంపిణీ చేయడం, కాకులకు, కోతులకు ఆహారం పెట్టడం, వృద్ధులను ఆదరించడం మంచిది.
- డాక్టర్ మహమ్మద్ దావూద్, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్