ముంబై: మాదక ద్రవ్యాల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటోన్న బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ ఇంటిపై, నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ) సోదాలు నిర్వహించింది. నవంబర్ 11న విచారణకు హాజరుకావ్సాలిందిగా ఎన్‌సీబీ రాంపాల్‌కి సమన్లు జారీచేసింది. సబర్బన్ బాంద్రాలోని ఆయన ఇంటి నుంచి ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ఎన్‌సీబీ ఆయన డ్రైవర్‌ను విచారించింది. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణానంతరం బాలీవుడ్‌లో మాదక ద్రవ్యాల వాడకంపై ఎన్‌సీబీ విచారణను ప్రారంభించిన సంగతి తెలిసిందే.
జూహూ ప్రాంతంలోని బాలీవుడ్ నిర్మాత ఫిరోజ్ నదియాద్‌వాలా ఇంటిపై దాడిచేసి, మాదకద్రవ్యాలు కలిగి ఉన్నారంటూ ఆయన భార్యని ఆదివారం అరెస్టు చేశారు. ఈ కేసులో ఎన్‌సీబీ ఎదుట హాజరైన నదియాద్‌వాలా తన స్టేట్‌మెంట్ ఇచ్చారు. ఇదివరకే అరెస్టు అయిన వహీద్ అబ్దుల్ ఖాదిర్ షేక్ అలియాస్ సుల్తాన్ ఇచ్చిన సమాచారంతో ఎన్‌సీబీ అధికారులు నదియాద్‌వాలా ఇంటిపై దాడిచేసి, పది గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మాదకద్రవ్యాల కేసులో ఎన్‌సీబీ, తాజాగా మరో ఐదుగురు వ్యక్తులను అరెస్టు చేసింది. ఇప్పటివరకు 727.1 గ్రాము గంజా, 74.1 గ్రాముల ఇతర మాదకద్రవ్యాలను, రూ.3.58 లక్షల నగదును వారి వద్దనుంచి స్వాధీనం చేసుకున్నట్లు ఎన్‌సీబీ అధికారులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment