‘అందమైన భార్యను వదిలి.. ఇదేం పని?’ | Arjun Rampal Post Announcing Girlfriend Pregnancy On Social Media | Sakshi
Sakshi News home page

‘ప్రపంచంలోని గొప్ప తల్లుల్లో ఆమె ఒకరు’

Published Fri, Apr 26 2019 6:45 PM | Last Updated on Fri, Apr 26 2019 6:52 PM

Arjun Rampal Post Announcing Girlfriend Pregnancy On Social Media - Sakshi

తన భర్త గర్ల్‌ఫ్రెండ్‌ తల్లికానున్న విషయాన్ని బాలీవుడ్‌ నటుడు అర్జున్‌ రాంపాల్‌ భార్య మెహర్‌​ జెసియా తేలికగా తీసుకున్నారని ఆమె సన్నిహితులు తెలిపారు. ఒక తల్లిగా తన పిల్లలకు మంచి భవిష్యత్తు ఏర్పరచడం పట్ల మాత్రమే ఆమెకు శ్రద్ధ ఉందని పేర్కొన్నారు. ‘రాక్‌ ఆన్‌’ ఫేమ్‌ అర్జున్‌ రాంపాల్‌ 20 ఏళ్ల వైవాహిక బంధానికి స్వస్తి చెప్పి భార్యను విడాకులు కోరిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వేర్వేరు దారుల్లో ప్రయాణించాలనుకుంటున్న కారణంగా విడాకులు తీసుకుంటున్నాం అని ఈ దంపతులు సంయుక్త ప్రకటన విడుదల చేశారు. అయితే వీరికి ఇంకా విడాకులు మంజూరు కాలేదు.

ప్రస్తుతం తన గర్ల్‌ఫ్రెండ్‌, దక్షిణాఫ్రికా మోడల్‌ గాబ్రియెల్లా డెమెత్రియెడ్స్‌తో అర్జున్‌ సహజీవనం చేస్తున్నాడు. ఈ క్రమంలో.. ‘ నువ్వు నాకు దొరకడం నిజంగా నా అదృష్టం. నాకు బేబిని ఇస్తున్నందుకు థ్యాంక్యూ బేబీ’ అంటూ ఇన్‌స్టాగ్రామ్‌ పోస్ట్‌ ద్వారా తాను మరోసారి తండ్రి కాబోతున్న విషయాన్ని అర్జున్‌ అభిమానులతో పంచుకున్నాడు. దీనిపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది అర్జున్‌కు శుభాకాంక్షలు చెబుతుండగా.. మరికొంత మంది మాత్రం..‘ అందమైన భార్యను, ఇద్దరు కూతుళ్లను వదిలిపెట్టి ఇదేం పని. ఇలా చేయడం సరైందేనా’ అంటూ ప్రశ్నిస్తున్నారు.


భార్య మెహర్‌తో అర్జున్‌ రాంపాల్‌

ఈ విషయంపై స్పందించిన అతడి భార్య మెహర్‌ స్నేహితులు మాట్లాడుతూ.. ‘ ఇంతవరకు వాళ్లిద్దరికి విడాకులు మంజూరు కాలేదు. కానీ అర్జున్‌ జీవితంలో ముందుకు సాగిపోయాడన్న నిజాన్ని మెహర్‌ అంగీకరించింది. ఆర్థిక పరమైన చిక్కుముడులు తొలగిన తర్వాత వారికి విడాకులు మంజూరయ్యే అవకాశం ఉంది. మెహర్‌ ప్రపంచంలోని గొప్ప తల్లులో ఒకరు. తన ఇద్దరు కూతుళ్లకు అత్యుత్తమ భవిష్యత్తు అందించేందుకు నిరంతరం శ్రమిస్తూ ఉంటుంది’ అని చెప్పుకొచ్చారు. కాగా 20 ఏళ్ల క్రితం పెళ్లి చేసుకున్న అర్జున్‌- మెహర్‌ దంపతులకు మహిక(17), మైరా(13) అనే ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. ఇక ఐపీఎల్‌ సెలబ్రేషన్స్‌లో భాగంగా 2009లో ఓ పార్టీలో అర్జున్‌-గాబ్రియెల్లాలకు పరిచయమైంది. ఈ క్రమంలో ఆమెతో సహజీవనం మొదలుపెట్టిన అర్జున్‌ భార్యతో బంధానికి స్వస్తి పలికాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement