బాలీవుడ్ హీరో అర్జున్ రాంపాల్కు నోటీసులు | rjun Rampal summoned by Mumbai police for meeting jailed gangster Arun Gawli | Sakshi
Sakshi News home page

బాలీవుడ్ హీరో అర్జున్ రాంపాల్కు నోటీసులు

Published Tue, Feb 3 2015 11:34 AM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

బాలీవుడ్ హీరో అర్జున్ రాంపాల్కు నోటీసులు - Sakshi

బాలీవుడ్ హీరో అర్జున్ రాంపాల్కు నోటీసులు

ముంబయి : బాలీవుడ్ హీరో అర్జున్ రాంపాల్కు ముంబయి పోలీసులు మంగళవారం నోటీసులు జారీ చేశారు. అండర్ వరల్డ్ డాన్ అరుణ్ గావ్లీతో సంబంధాలపై పోలీసులు ఈ మేరకు నోటీసులు ఇచ్చినట్లు సమాచారం. గత నెలలో అనుమతి లేకుండా అరుణ్ గావ్లీని కలిసినందుకు పోలీసులు అర్జున్ రాంపాల్కు నోటీసులు ఇచ్చారు. కాగా కార్పొరేటర్ కమ్లాకర్ జమ్సందేకర్ హత్య కేసులో అరుణ్ గావ్లీ జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు.

కాగా అర్జున్ రాంపాల్ 'డాడీ' చిత్రంలో డాన్ పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రం గావ్లీ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. సినిమాలోని సన్నివేశాలను మరింత రక్తి కట్టించేందుకు అర్జున్ రాంపాల్... అరుణ్ గావ్లీ దగ్గర కొన్ని టిప్స్ తీసుకున్నట్లు సమాచారం. డిసెంబర్ 29న జేజే ఆస్పత్రిలో అవుట్ పేషెంట్గా ఉన్న అర్జున్ గావ్లీతో సంబంధిత అధికారుల నుంచి అనుమతి తీసుకోకుండా సుమారు గంటపాటు ఉన్నట్లు తెలుస్తోంది.  దీనిపై వివరణ ఇవ్వాల్సిందిగా ముంబయి పోలీసులు తమ నోటీసులో పేర్కొన్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement