Did Vijay Varma confirm his relationship with Tamannaah Bhatia on Valentine's day - Sakshi
Sakshi News home page

Tamanna-Vijay Varma: వాలంటైన్స్‌ డే: తమన్నా-విజయ్‌ వర్మ రిలేషన్‌పై క్లారిటీ వచ్చేసింది?

Published Wed, Feb 15 2023 5:54 PM | Last Updated on Wed, Feb 15 2023 6:27 PM

Is Vijay Varma Confirms His Relationship With Tamannaah On Valentines Day - Sakshi

ఇండస్ట్రీలో హీరోయిన్‌ తమన్నాకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. తెరపై తన అందం, అభినయం, డాన్స్‌తో కుర్రకారును కట్టిపడేస్తుంది. అలా మిల్కీ బ్యూటీగా అభిమానుల గుండెల్లో నిలిచిపోయింది. అయితే ఇప్పటికీ గాసిప్స్‌కు దూరంగా ఉన్న తమన్నా ఈ ఏడాది న్యూఇయర్‌ నుంచి డేటింగ్‌ రూమర్స్‌తో వార్తల్లోకి ఎక్కింది. గోవాలో జరిగిన న్యూ ఇయర్‌ వేడుకలో నటుడు విజయ్‌ వర్మకు లిప్‌లాక్‌ ఇచ్చి ఫ్యాన్స్‌కి షాకిచ్చింది. దీంతో అతడితో తమన్నా రిలేషన్‌లో ఉందంటూ ఒక్కసారిగా గాసిప్స్‌ గుప్పుమన్నాయి. దీనిపై ఇప్పటి మిల్కీ బ్యూటీ దీనిపై స్పందించకపోవడం గమనార్హం.

అయితే తమన్నా రిలేషన్‌ స్టేటస్‌పై అభిమానులంతా సందేహంలో ఉన్నారు. ఈ వార్తల్లో ఎంతవరకు నిజముందో తెలియక ఫ్యాన్స్‌ తలలు పట్టుకుంటున్నారు. ఈ నేపథ్యంలో వాలంటైన్స్‌ డే సందర్భంగా తమన్నాతో డేటింగ్‌ రూమర్స్‌పై క్లారిటీ ఇచ్చాడు నటుడు విజయ్‌. ప్రేమికుల రోజును పురస్కరించుకుని విజయ్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో స్టోరీ ఓ పోస్ట్‌ షేర్‌ చేశాడు. అందులో ఎదురెదురుగా నిలుచుని ఉండి, ఇద్దరి కాళ్ల మధ్యలో హార్ట్‌ ఎమోజీని జత చేసి ఫొటో పోస్ట్‌ చేశాడు. అయితే ఈ ఫొటోలో వారి ముఖాలు కనపడకుండ జాగ్రత్త పడ్డాడు. విజయ్‌ ఎదురుగా ఉన్నది తమన్నా అంటూ సందేహం వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు.

అంతేకాదు ఈ వ్యక్తి వేసుకున్న షూ, జాకెట్‌ ఆధారంగా అది తమన్నానే అంటూ పట్టేశారు నెటిజన్లు. గతంలో తమన్నా అచ్చం అలాంటి షూ, చేతిలో జాకెట్‌ పట్టుకుని ఉన్న ఫొటోలను సోషల్‌ మీడియాలో వైరల్‌ చేస్తున్నారు. వాలంటైన్స్‌ డే రోజు స్పెషల్‌ పోస్ట్‌ షేర్‌ చేసి పరోక్షంగా తమన్నాతో రిలేషన్‌ రూమర్స్‌పై స్పష్టత ఇచ్చాడని నెటిజన్లంతా అభిప్రాయం వ్యక్తం చేస్తు‍న్నారు. అంతేకాదు ఇదే విషయాన్ని కన్‌ఫాం చేస్తూ తమన్నా ఫ్యాన్‌ పేజీలో ఓ ట్విటర్‌ యూజర్‌ పోస్ట్‌ కూడా షేర్‌ చేశారు. దీంతో ఆ ట్వీట్‌ వైరల్‌గా మారింది. కాగా తమన్నా ప్రస్తుతం తెలుగులో భోళా శంకర్‌ చిత్రంతో బిజీగా ఉండగా.. తమిళం, హిందీలో పలు చిత్రాలు చేస్తోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement