ప్రియుడితో సీక్రెట్‌ ఎంగేజ్‌మెంట్‌.. పెళ్లికి సిద్ధమైన టాలీవుడ్ హీరోయిన్! | Tollywood Heroine Gives Hint On Valentines Day To Marry In March 2024 | Sakshi
Sakshi News home page

Tollywood Heroine: ఐదేళ్లుగా డేటింగ్.. సీక్రెట్‌ ఎంగేజ్‌మెంట్‌.. పెళ్లిపై హింట్ ఇచ్చిన హీరోయిన్!

Feb 15 2024 4:05 PM | Updated on Feb 15 2024 5:00 PM

Tollywood Heroine Gives Hint On Valentines Day To Marry In March 2024 - Sakshi

ఈ బ్యూటీ తెలుగు సినిమాతోనే హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. బోణి అనే చిత్రం ద్వారా టాలీవుడ్ బోణి కొట్టిన ముద్దుగుమ్మ కృతి కర్బంద. ఆ తర్వాత అలా మొదలైంది, కెమెరామెన్ గంగతో రాంబాబు, తీన్‌మార్, ఒంగోలు గిత్త, బ్రూస్‌లీ, మిస్టర్ నూకయ్య,ఓం త్రీడీ లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులను మెప్పించింది. చివరసారిగా 2015లో వచ్చిన 'బ్రూస్ లీ' మూవీలో రామ్ చరణ్‌కి అక్కగా నటించింది.  మోడల్‌ కెరీర్ ప్రారంభించిన ఢిల్లీ భామ తెలుగుతో పాటు కన్నడలోనూ చాలా సినిమాలు చేసింది. అయితే ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలతో బిజీగా మారిపోయింది బాలీవుడ్ భామ. 

అయితే 2019 నుంచి ఓ బాలీవుడ్ నటుడితో ప్రేమలో ఉన్న కృతి ఇటీవలే  రహస్యంగా నిశ్చితార్థం కూడా చేసుకుంది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వీరి రిలేషన్‌ నిజమేనని తెలిపోయింది. కేవలం కొద్దిమంది సన్నిహితులు, కుటుంబ సభ్యుల మధ్యే కృతి కర్బందా-పులకిత్ సామ్రాట్ ఎంగేజ్‌మెంట్ జరిగింది. దీంతో వీరి పెళ్లి ఎప్పుడనే విషయంపై చర్చ మొదలైంది.

తాజా సమాచారం ప్రకారం త్వరలోనే ఈ జంట పెళ్లి పీటలెక్కనున్నట్లు తెలుస్తోంది. వాలెంటైన్స్ డే సందర్భంగా కృతి చేసిన పోస్ట్‌తో పెళ్లిపై హింట్‌ కూడా ఇచ్చేసింది. వాలైంటైన్స్‌ డే సందర్భంగా తనకు కాబోయే భర్తతో ఉన్న ఫోటోను షేర్ చేసింది. అంతే కాకుండా మార్చి నెలలోనే ఒక్కటి కాబోతున్నామంటూ క్యాప్షన్ కూడా ఇచ్చింది. దీంతో జంట వచ్చే నెలలోనే పెళ్లిబంధంతో ఒక్కటి కానున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ప్రేమికుల రోజే క్లారిటీ ఇచ్చేసింది ముద్దుగుమ్మ. ఇంకా పెళ్లి తేదీ ఎప్పుడనే విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. 

కాగా.. పుల్కిత్ సామ్రాట్, కృతి కర్బందా 2019 నుంచి డేటింగ్‌ కొనసాగిస్తున్నారు. పాగల్‌పంటి అనే మూవీ సెట్‌లో వీరిద్దరి మధ్య ప్రేమ మొదలైంది. ఈ జంట పాగల్‌పంటి సినిమాతో పాటు వీరే కి వెడ్డింగ్, తైష్ వంటి చిత్రాలలో కలిసి నటించారు. పుల్కిత్ సామ్రాట్ చివరిసారిగా ఫక్రీ- 3లో కనిపించారు. కృతి కర్బంద నటించిన తాజా చిత్రం రిస్కీ రోమియో విడుదలకు సిద్ధమవుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement