women harrased
-
నగ్నంగా ఊరేగించిన మహిళకు సీఎం భరోసా
జైపూర్: రాజస్థాన్‌లో ఒక మహిళను వివస్త్రను చేసిన సంఘటన విచారణను స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్‌కు అప్పగించామని బాధితురాలి భర్తతో సహా మరో 10 మందిని అరెస్టు చేసినట్లు ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ తెలిపారు. ఈ సందర్బంగా బాధితురాలికి రూ.10 లక్షల ఆర్ధిక సాయం తోపాటు ఒక ఉద్యోగాన్ని కూడా కల్పిస్తున్నట్లు ప్రకటించారు. మణిపూర్‌లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన సంఘటన మరువక ముందే రాజస్థాన్‌లో అలాంటి మరో సంఘటన చోటు చేసుకుంది. ప్రతాప్‌గఢ్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కన మీనా అనే వ్యక్తి తన భార్యకి పరాయి వ్యక్తితో వివాహేతర సంబంధముందని అనుమానించి పది మంది చూస్తుండగా ఆమెను ఒకపక్క కొడుతూ వివస్త్రను చేసి నగ్నంగా ఊరేగించాడని తెలిపారు. బాధితురాలి అత్తమామలు ప్రోద్బలంతోనే మీనా ఇంతటి దారుణానికి పాల్పడ్డాడని వారు తెలిపారు. సంఘటన వెలుగులోకి రాగానే వీడియో వైరల్ కావడంతో పాటు దీనిపై రాజకీయ రగడ కూడా మొదలవడంతో స్వయంగా ముఖ్యమంత్రే రంగంలోకి దిగారు. కేసు విచారణ బాధ్యతను స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్‌కు అప్పగించారు. అనంతరం ప్రతాప్‌గఢ్ వెళ్లి గర్భవతియైన బాధితురాలిని ఆమె కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్బంగా అశోక్ గెహ్లాట్ మాట్లాడుతూ.. రాజస్థాన్ బిడ్డ చాలా ధైర్యవంతురాలు, ఆమె అవమానకరమైన బాధను గొప్ప తెగువతో భరించింది. ఆమె ఆర్ధిక, సామాజిక స్థితిగతులను దృష్టిలో ఉంచుకుని ఆమెకు రూ.10 లక్షలు ఆర్ధిక సహాయంతో పాటు ఉద్యోగాన్ని కూడా కల్పిస్తున్నామని ప్రకటించారు. ఆమెకు ఎలాంటి సహాయం కావాలన్నా ప్రభుత్వం తరపున అందజేస్తామని కూడా తెలిపారు. #WATCH | After meeting the Pratapgarh assault victim, Rajasthan CM Ashok Gehlot says, "In this case, an SIT has been formed. 11 people have been arrested... I spoke to the victim's family and assured them that justice would prevail... I offered her a government job... And we will… pic.twitter.com/rJQ4mFHbXk — ANI (@ANI) September 2, 2023 ఇది కూడా చదవండి: బాలాసోర్ రైలు ప్రమాదానికి అదే కారణం.. చార్జిషీట్లో సీబీఐ -
జార్ఖండ్‌లో యువతిపై దారుణం.. బట్టలు విప్పి చెట్టుకి కట్టేసి
రాంచీ: జార్ఖండ్ రాష్ట్రంలోని గిరిధి జిల్లాలో దారుణం జరిగింది. ఓ కుటుంబంలోని నలుగురు తమ కుమారుడితో ప్రేమ వ్యవహారంలో 26 ఏళ్ల యువతిని అడవిలోకి తీసుకెళ్లి చితకబాది వివస్త్రురాలిని చేసి చెట్టుకు కట్టేసి వెళ్లిపోయిన సంఘటన సంచలనం సృష్టించింది. పోలీసులు ఆ యువతిని రక్షించి వైద్యం నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. దాడికి పాల్పడిన ఆ నలుగురిలో యువతి ప్రియుడు కూడా ఉన్నట్లు తెలిపారు పోలీసులు. బాగోడార్ షబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ నౌషాద్ అలామ్ తెలిపిన వివరాల ప్రకారం సారియా పోలీస్ స్టేషన్ పరిధిలో 26 ఏళ్ల బాధితురాలు ఒక యువకుడితో ప్రేమలో పడింది. ఈ వ్యవహారం గురించి తెలుసుకున్న అతని కుటంబసభ్యులు.. తండ్రి, తల్లి, సవతి తల్లి కుమారుడిని మందలించి ఆ యువతిని ఇంటికి రప్పించమన్నారు. వెంటనే వారి కుమారుడు ఆమెకు కబురు పంపగా బుధవారం అర్ధరాత్రి ఆమె ఇంటికి చేరుకోగానే నలుగురు కలిసి దౌర్జన్యంగా బంధించి సమీపంలోని అడవికి తీసుకుని వెళ్లారు. అక్కడ ఆమె ప్రియుడితో సహా కుటుంబసభ్యులంతా ఏకమై ఆమెపై విచక్షణారహితంగా దాడి చేసి బట్టలను చింపివేశారని అవమానంతో ఆమె ఆత్మహత్య చేసుకుంటుందని భావించి యువతిని చెట్టుకు కట్టేసి వెళ్లిపోయారు. సంఘటనా స్థలానికి చేరుకొని బాధిత యువతిని స్థానిక ఆసుపత్రికి తరలించామని.. ఆమె ప్రియుడిని, అతడి తండ్రిని, తల్లిని, సవతి తల్లిని అరెస్టు చేసి రిమాండుకు తరలించినట్లు తెలిపారు. ఇది కూడా చదవండి: కేంద్రానికి ఊరట.. ఈడీ చీఫ్ పదవీకాలం పొడిగించిన సుప్రీంకోర్టు -
మరో ఆరు నెలల్లో పెళ్లి.. కాబోయే భార్య అనే సోయి లేకుండా..
యశవంతపుర: మూడుముళ్లు వేయకముందే మైనర్ యువతిపై కాబోయే భర్త అత్యాచారానికి పాల్పడి హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారు. లైంగిక దాడి జరిగినట్లు పోస్టుమార్టం నివేదికలో వెలుగు చూడటంతో పోలీసులు అరెస్ట్ చేస్తారనే భయంతో ఆ యువకుడు ఆత్మహత్యకు యత్నించి చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటన కర్నాటకలోని హాసన తాలూకాలో జరిగింది. వివరాల ప్రకారం.. కోణనూరు సమీపంలోని రామన కొప్ప గ్రామానికి చెందిన యువతితో కడలూరు గ్రామానికి చెందిన దినేశ్‌కు ఇటీవల నిశి్చతార్థం చేశారు. 18 ఏళ్లు నిండటానికి మరో 6 నెలల సమయం ఉంది. కాగా దినేశ్ ఆ మైనర్ యువతి ఇంటికి వెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని ఆమె తల్లిదండ్రులకు తెలిపింది. దీంతో నవంబర్ 28న మరోమారు ఆ మైనర్ యువతి ఇంటికి వెళ్లిన దినేష్..ఆమెను గొంతునులిమి హత్య చేశాడు. అయితే, పరువు పోతుందనే భయంతో ఆత్మహత్య చేసుకున్నట్లు మృతురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అత్యాచారం జరిగినట్లు పోస్టుమార్టం నివేదికలో వెల్లడైంది. పోలీసులు అరెస్ట్ చేస్తారనే భయంతో దినేశ్ మూడు రోజుల క్రితం విషం సేవించి ఆత్మహత్యకు యత్నించాడు. హాసన ఆస్పత్రిలో చేర్చగా చికిత్స పొందుతూ శుక్రవారం తెల్లవారుజామున మృతి చెందాడు. -
సీఎం యోగితో అంత ఈజీ కాదు.. కటకటాల్లోకి బీజేపీ నేత
ఉత్తరప్రదేశ్‌లో యోగి ఆదిత్యనాథ్ సర్కార్ హయంలో సంచనాలు చోటుచేసుకుంటున్నాయి. ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలైనా, తమ బీజేపీకి చెందిన నేతలైనా తప్పు చేస్తే వదిలేదు అన్నట్టుగా సీఎం యోగి ముందుకు సాగుతున్నారు. ఇటీవలే ఓ మహిళతో బీజేపీ నేత శ్రీకాంత్ త్యాగి అనుచితంగా ప్రవర్తించిన విషయం తెలిసిందే. కాగా, అతనిపై గ్యాంగ్‌స్టర్ యాక్ట్ కింద నేరారోపణలు నమోదు చేశారు. ఇదిలా ఉండగా.. మంగళవారం శ్రీకాంత్ త్యాగిని నోయిడా పోలీసులు అరెస్టు చేశారు. అయితే, శ్రీకాంత్ త్యాగి ఓ మహిళను దుర్బాషలాడి, దాడి చేసిన ఘటన, ఆపై అనుచరులతో బెదిరింపులకు గురిచేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో, రంగంలోకి దిగిన అధికారులు చర్యలు తీసుకున్నారు. కేసు నమోదు చేసి పరారీలో ఉన్న త్యాగిని అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించారు. అందులో భాగంగానే పరారీలో ఉన్న శ్రీకాంత్ త్యాగి ఆచూకి తెలిపిన వారికి రూ.25,000 రివార్డు కూడా ప్రకటించారు. మరోవైపు.. నోయిడాలోని సెక్టార్ 93 బి గ్రాండ్ ఓమాక్స్ సోసైటీలోని శ్రీకాంత్ త్యాగి అక్రమ నిర్మాణాన్ని అధికారులు ఇటీవలే బుల్డోజర్తో తొలగించిన విషయం తెలిసిందే. ఈ కట్టడాలకు సంబంధించే స్థానిక ఇంటి ఓనర్లకు, శ్రీకాంత్ మధ్య తరచూ వాగ్వాదాలు జరుగుతూ వస్తున్నాయి. ఈ క్రమంలో ఓ మహిళతో శ్రీకాంత్ దారుణంగా వ్యవహరించాడు. ఆమెను దుర్భాషలాడడంతో పాటు దాడి యత్నానికి దిగాడు. ఆ వీడియో వైరల్ కావడంతో.. పోలీసులు రంగంలోకి దిగారు. ఈ లోపు శ్రీకాంత్ అనుచరులు మరోసారి హౌజింగ్ సొసైటీ దగ్గరకు చేరి.. ఆమె అడ్రస్ కావాలంటూ వీరంగం సృష్టించారు. దీంతో వాళ్లను సైతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. Shrikant Tyagi- the National Executive Member Kisan Morcha & National Co-Coordinator - Yuva Kisan Samiti allegedly caught on camera for threatening a woman resident of Grand Omaxe sector 93B #Noida. pic.twitter.com/QTwAgK94dd — Utkarsh Singh (@utkarshs88) August 5, 2022 ఇది కూడా చదవండి: మహిళపై గూండాగిరికి సీఎం యోగి రిప్లై.. -
ఇన్స్పెక్టర్ రాసలీలలు.. లవ్ యూ అంటూ ఆమెకు దగ్గరై.. ఆ తర్వాత..
రామభద్రపురం : ప్రజలను రక్షించాల్సిన రక్షకభటుడే ఓ యువతిని మోసం చేశాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆమెను గర్భవతిని చేసి మోహం చాటేశాడు. తనను మోసం చేసిన ప్రియుడిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బాధితురాలు శనివారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. వివరాల ప్రకారం.. మండలంలోని మిర్తివలస గ్రామానికి చెందిన సువ్వాడ ఉషారాణి అదే గ్రామానికి చెందిన పొట్నూరు గోపాలకృష్ణ 2019 నుంచి ప్రేమించుకుంటున్నారు. గోపాలకృష్ణ హైదరాబాద్ సెంట్రల్ పోలీస్ లైన్స్‌లో రిజర్వ్ ఇన్స్పెక్టర్గా పని చేస్తున్నాడు. అయితే 2020లో ఇద్దరి మధ్య బేదాభిప్రాయాలు రావడంతో గ్రామపెద్దల వద్దకు పంచాయితీ చేరింది. దీంతో గోపాలకృష్ణ నుంచి కొంత మొత్తాన్ని ఉషారాణికి ఇప్పించి రాజీ కుదిర్చారు. కొద్ది రోజుల తర్వాత ఇద్దరూ మళ్లీ ఒక్కటయ్యారు. గోపాలకృష్ణ డిప్యుటేషన్‌పై విశాఖపట్నంలో విధులు నిర్వహిస్తూ, అప్పుడప్పుడూ గ్రామానికి వచ్చి ఉషారాణితో గడుపుతుండేవాడు. ఈ క్రమంలో ఆమె గర్భవతి కావడంతో పెళ్లి చేసుకోవాలని గోపాలకృష్ణపై ఒత్తిడి తీసుకువచ్చింది. అయితే, గోపాలకృష్ణ పెళ్లికి నిరాకరించడంతో తనకు న్యాయం చేయాలని బాధితురాలు విజయనగరం హ్యూమన్ రైట్స్ సంఘ సభ్యులను ఆశ్రయించింది. వారి సూచన మేరకు గ్రామ పెద్దలతో కలిసి స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. సీఐ ఎం. నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఎస్సై కృష్ణమూర్తి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇది కూడా చదవండి: యువతితో ఐదేళ్లుగా ప్రేమ.. నమ్మించి మోసం.. పెళ్లి చేసుకోవాలని నిలదీయడంతో.. -
మహిళను మోసం చేసి వదిలేసిన కానిస్టేబుల్
సాక్షి, లక్ష్మీపురం(గుంటూరు): ప్రేమ పేరుతో మహిళను వంచించి గర్భవతిని చేసి పరారయ్యడు ఓ కానిస్టేబుల్. దీనిపై ఫిర్యాదు చేసేందుకు గుంటూరు అర్బన్ ఎస్పీ గ్రీవెన్స్‌కు వచ్చిన బాధితురాలు అక్కడే ఫిట్స్ వచ్చి పడిపోవడం సంచలనం రేపింది. తాను మూడు నెలల గర్భవతినని, రెండు నెలల నుంచి కడుపు నిండా అన్నం కూడా తినలేదని ఆమె చెప్పడం చుట్టుపక్కలవారిని కలచివేసింది. బాధితురాలు తెలిపిన వివరాల మేరకు.. అనంతపురానికి చెందిన యవతికి తమ ఇంటి పక్కనే నివాసం ఉంటున్న మహేష్‌బాబు అనే వ్యక్తితో 2011లో పరిచయం ఏర్పడి.. అది కాస్తా ప్రేమగా మారింది. ఈ విషయం ఇరు కుటుంబాలకు తెలియజేయగా వారు అంగీకరించకపోవడంతో అనంతపురం నుంచి 2018 నవంబర్ 5న విజయవాడ వచ్చి దుర్గగుడిలో వివాహం చేసుకున్నారు. అప్పటికే మహేష్‌బాబుకు ఏపీఎస్పీ 16వ బెటాలియన్‌లో కానిస్టేబుల్‌గా ఉద్యోగం వచ్చింది. ఇద్దరూ మంగళగిరిలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని కాపురం పెట్టారు. ఇటీవల యువతి గర్భవతి అయిన విషయం తెలిసి మహేష్‌బాబు ఎంతో సంతోషించాడు. ఈ నేపథ్యంలో మే 2న ఇద్దరూ కలిసి సొంత ఊరైన అనంతపురానికి వెళ్లి ఓ లాడ్జిలో రూం తీసుకున్నారు. అయితే ఆమెను లాడ్జి రూంలో వదిలిపెట్టి వెళ్లిన మహేష్‌బాబు తిరిగి రాలేదు. ఫోన్ చేసినా లిఫ్ట్ చేయడంలేదు. దీంతో తిరిగి మే 3న ఆమె మంగళగిరికి చేరుకుని 4వ తేదీన మంగళగిరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు తర్వాత పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి మహేష్‌బాబు కారులో వచ్చి ఆమె చేతిలో రూ.1,000 పెట్టి బయల్దేరుతుండగా, తనను విడిచి వెళ్లొద్దని ఆమె కాళ్లు పట్టుకుని బతిమాలినా పట్టించుకోకుండా వెళ్లిపోయాడు. దీంతో దిక్కుతోచని ఆమె అర్బన్ ఎస్పీకి ఫిర్యాదు చేసేందుకు సోమవారం గ్రీవెన్స్‌కు వచ్చింది. అయితే తన భర్త తనకు ఎందుకు దూరంగా వెళుతున్నాడో తెలియట్లేదని ఆమె కన్నీటి పర్యంతం అయింది. తన గోడును వెళ్లబోసుకోవడానికి సోమవారం అర్బన్ ఎస్పీ గ్రీవెన్స్‌కు వచ్చిన ఆమె అక్కడున్న వారితో మాట్లాడుతూ రెండుసార్లు ఫిట్స్ వచ్చి పడిపోయింది. అనంతరం తేరుకుని లేచి అర్బన్ ఎస్పీకి వినతిపత్రం ఇచ్చే క్రమంలో మళ్లీ మూడోసారి ఫిట్స్ వచ్చి పడిపోవడంతో వెంటనే ఎస్పీ పీహెచ్డీ రామకృష్ణ 108 వాహనాన్ని పిలిపించి ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. -
కీచకుడు మధు అరెస్ట్
హైదరాబాద్: అమాయక యువతులను వేధిస్తూ, వారి జీవితాలతో ఆడుకుంటున్న ఎఫ్‌సీఐ మాజీ ఉద్యోగి, కీచకుడు మధును హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. మధు వాడిన ఫోన్లు, ల్యాప్ టాప్, హార్డ్ డిస్క్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నలుగురు అమ్మాయిలు ఇచ్చిన ఫిర్యాదుతో ఈ కేసు వెలుగు చూసింది. ఇప్పటికి 300 మంది అమ్మాయిలను మోసం చేసిన మధు.. మరో 500 మంది అమ్మాయిలను వేధిస్తున్నట్టు సమాచారం. పోలీసులు సైకో మధును శుక్రవారం మీడియా ముందు ప్రవేశపెట్టారు. హైదరాబాద్ డీసీపీ స్వాతి లక్రా కేసు వివరాలను వెల్లడించారు. అతనిపై పీడీ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. 'మధు అమ్మాయిల ఫోన్ నెంబర్లు సేకరించి వారిని వేధించడమే పనిగా పెట్టుకున్నాడు. ఫేస్బుక్ ద్వారా అమ్మాయిలకు గాలం వేశాడు. మధు దగ్గర ఉన్న జాబితాలో ఐదు వేల మంది అమ్మాయిల ప్రొఫైల్స్ ఉన్నాయి. మధు వేర్వేరు పేర్లతో సిమ్ కార్డులు తీసుకున్నాడు. తండ్రి పేరును కూడా వేరుగా రాశాడు. అతని వద్ద 18 మొబైల్స్, 30 వరకు సిమ్ కార్డులు ఉన్నాయి' అని స్వాతి లక్రా చెప్పారు. ఈ కేసును విచారిస్తున్నామని చెప్పారు. మధు వల్ల మోసపోయిన వారు ఇంకా ఎవరైనా ఉన్నారా అన్న విషయం దర్యాప్తులో వెలుగు చూడాల్సి ఉందని తెలిపారు.