యశవంతపుర: మూడుముళ్లు వేయకముందే మైనర్ యువతిపై కాబోయే భర్త అత్యాచారానికి పాల్పడి హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారు. లైంగిక దాడి జరిగినట్లు పోస్టుమార్టం నివేదికలో వెలుగు చూడటంతో పోలీసులు అరెస్ట్ చేస్తారనే భయంతో ఆ యువకుడు ఆత్మహత్యకు యత్నించి చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటన కర్నాటకలోని హాసన తాలూకాలో జరిగింది.
వివరాల ప్రకారం.. కోణనూరు సమీపంలోని రామన కొప్ప గ్రామానికి చెందిన యువతితో కడలూరు గ్రామానికి చెందిన దినేశ్‌కు ఇటీవల నిశి్చతార్థం చేశారు. 18 ఏళ్లు నిండటానికి మరో 6 నెలల సమయం ఉంది. కాగా దినేశ్ ఆ మైనర్ యువతి ఇంటికి వెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని ఆమె తల్లిదండ్రులకు తెలిపింది. దీంతో నవంబర్ 28న మరోమారు ఆ మైనర్ యువతి ఇంటికి వెళ్లిన దినేష్..ఆమెను గొంతునులిమి హత్య చేశాడు.
అయితే, పరువు పోతుందనే భయంతో ఆత్మహత్య చేసుకున్నట్లు మృతురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అత్యాచారం జరిగినట్లు పోస్టుమార్టం నివేదికలో వెల్లడైంది. పోలీసులు అరెస్ట్ చేస్తారనే భయంతో దినేశ్ మూడు రోజుల క్రితం విషం సేవించి ఆత్మహత్యకు యత్నించాడు. హాసన ఆస్పత్రిలో చేర్చగా చికిత్స పొందుతూ శుక్రవారం తెల్లవారుజామున మృతి చెందాడు.
Comments
Please login to add a commentAdd a comment