ఉత్తరప్రదేశ్‌లో యోగి ఆదిత్యనాథ్ సర్కార్ హయంలో సంచనాలు చోటుచేసుకుంటున్నాయి. ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలైనా, తమ బీజేపీకి చెందిన నేతలైనా తప్పు చేస్తే వదిలేదు అన్నట్టుగా సీఎం యోగి ముందుకు సాగుతున్నారు. ఇటీవలే ఓ మహిళతో బీజేపీ నేత శ్రీకాంత్ త్యాగి అనుచితంగా ప్రవర్తించిన విషయం తెలిసిందే. కాగా, అతనిపై గ్యాంగ్‌స్టర్ యాక్ట్ కింద నేరారోపణలు నమోదు చేశారు.
ఇదిలా ఉండగా.. మంగళవారం శ్రీకాంత్ త్యాగిని నోయిడా పోలీసులు అరెస్టు చేశారు. అయితే, శ్రీకాంత్ త్యాగి ఓ మహిళను దుర్బాషలాడి, దాడి చేసిన ఘటన, ఆపై అనుచరులతో బెదిరింపులకు గురిచేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో, రంగంలోకి దిగిన అధికారులు చర్యలు తీసుకున్నారు. కేసు నమోదు చేసి పరారీలో ఉన్న త్యాగిని అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించారు. అందులో భాగంగానే పరారీలో ఉన్న శ్రీకాంత్ త్యాగి ఆచూకి తెలిపిన వారికి రూ.25,000 రివార్డు కూడా ప్రకటించారు.
మరోవైపు.. నోయిడాలోని సెక్టార్ 93 బి గ్రాండ్ ఓమాక్స్ సోసైటీలోని శ్రీకాంత్ త్యాగి అక్రమ నిర్మాణాన్ని అధికారులు ఇటీవలే బుల్డోజర్‌తో తొలగించిన విషయం తెలిసిందే. ఈ కట్టడాలకు సంబంధించే స్థానిక ఇంటి ఓనర్లకు, శ్రీకాంత్ మధ్య తరచూ వాగ్వాదాలు జరుగుతూ వస్తున్నాయి. ఈ క్రమంలో ఓ మహిళతో శ్రీకాంత్ దారుణంగా వ్యవహరించాడు. ఆమెను దుర్భాషలాడడంతో పాటు దాడి యత్నానికి దిగాడు. ఆ వీడియో వైరల్ కావడంతో.. పోలీసులు రంగంలోకి దిగారు. ఈ లోపు శ్రీకాంత్ అనుచరులు మరోసారి హౌజింగ్ సొసైటీ దగ్గరకు చేరి.. ఆమె అడ్రస్ కావాలంటూ వీరంగం సృష్టించారు. దీంతో వాళ్లను సైతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Shrikant Tyagi- the National Executive Member Kisan Morcha & National Co-Coordinator - Yuva Kisan Samiti allegedly caught on camera for threatening a woman resident of Grand Omaxe sector 93B #Noida. pic.twitter.com/QTwAgK94dd
— Utkarsh Singh (@utkarshs88) August 5, 2022
ఇది కూడా చదవండి: మహిళపై గూండాగిరికి సీఎం యోగి రిప్లై..
Comments
Please login to add a commentAdd a comment