సాక్షి, కరీంనగర్: మద్యం మత్తులో ఉన్న కొందరు యువకులు ఓ యువకుడిని చితకబాదిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. శ్రీకాంత్ అనే వ్యక్తి కరీంనగర్ తెలంగాణ చౌక్ లో ఉన్న లక్కీ బార్‌కు వెళ్లాడు. అక్కడ అప్పటికే మద్యం సేవిస్తున్న మరో నలుగురు ఫ్రెండ్స్ ఉండగా.. శ్రీకాంత్ హాయ్ చెప్పాడు. అయితే, శ్రీకాంత్ వెటకారంగా నమస్తే చెప్పినట్టు భావించిన ఆ నలుగురు ఫ్రెండ్స్ అప్పటికే మద్యం మత్తులో కూడా ఉండటంతో.. బార్ లోనే శ్రీకాంత్ పై దాడికి పాల్పడ్డారు.
నలుగురు కలిసి విచక్షణారహితంగా దాడికి పాల్పడటంతో.. శ్రీకాంత్ ప్రస్తుతం ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ సీసీ కెమెరా ఫుటేజీ కూడా పోలీసులు పరిశీలించారు. బాధితుడి కుటుంబీకుల ఫిర్యాదు మేరకు టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు.
చదవండి: హైదరాబాద్‌లో మహిళా టీచర్ మిస్సింగ్.. అసలేం జరిగింది?
Comments
Please login to add a commentAdd a comment