భయానక ఘటన. ఓ చిరుత పులిని రక్షించాలని చూసిన జనంపై అది దాడి చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సుశాంత్ నందా అనే అటవీ అధికారి గురువారం ట్విటర్‌లో ఈ వీడియోను షేర్ చేశాడు. గుంతలో పడిపోయిన చిరుత పులిని అటవీ అధికారులు, స్థానికులు కలిసి రెస్క్యు చేసే ప్రయత్నం చేశారు. అదే సమయంలో అది గుంట నుంచి పైకి వచ్చింది. పైకి వచ్చిన పులి చూట్టు ఉన్న జనసముహాన్ని చూసి బెంబేలెత్తి ఒక్కసారిగా వారిపై విరుచుకుపడింది. ఈ క్రమంలో ఓ వ్యక్తిపైకి దూకి దాడి చేయడంతో అతడు కింద పడిపోయాడు. దీంతో ఆ వ్యక్తిని వదిలి మరో వ్యక్తిపై దాడి చేస్తూ.. అలా అక్కడి వారందరిని భయాందోళనకు గురి చేసింది. ఈ వీడియోకు ఇప్పటీ వరకూ దాదాపు 3 వేల వ్యూస్ రాగా, వందల్లో కామెంట్లు వచ్చాయి. (కరోనా సునామీ: ఒక్క రోజే 33 కేసులు)
ఇక ఈ వీడియోకు సుశాంత్.. ‘భయానక రెస్క్యు.. ఓ చిరుత పులిని కాపాడాలని చూసిన జనంపై అది దాడి చేసి.. మరోమారు పులుల సహాజత్వాన్ని వారికి గుర్తుచేసింది. ఇందులో దాని తప్పు లేదు’ అంటూ ట్వీట్ చేశాడు. ‘ఇది వారి ముర్ఖత్వానికి నిదర్శనం. ఎందుకంటే ప్రకృతిలో చిరుత పులి ఎంత క్రూరమైనవో తెలిసి కూడా దానిని రక్షించే ప్రయత్నం చేశారు. కానీ అది తన స్వభావాన్ని చూపించింది’ అని ‘ఆ పులికి ఎమైంది’ అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment