IFS officers
-
తెలంగాణలో 13 మంది ఐఏఎస్‌ల బదిలీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో 13 మంది ఐఏఎస్‌ల బదిలీ అయ్యారు. రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌గా నారాయణ రెడ్డి, నల్గొండ కలెక్టర్‌గా త్రిపాఠి, యాదాద్రి జిల్లా కలెక్టర్‌గా హన్మంతరావు బదిలీ అయ్యారు. వీరితోపాటు ముగ్గురు ఐఎఫ్ఎస్ అధికారులను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. మేడ్చల్ జడ్పీ సీఈవో, నిజామాబాద్ మున్సిపల్ కమిషనర్ లీప్ కుమార్ బదిలీ అయ్యారు. సీసీఎల్ఏ డైరెక్టర్‌గా మందా మకరందు, ఐ అండ్ పీఆర్ స్పెషల్ కమిషనర్‌గా ఎస్ హరీష్ రావు, మున్సిపల్‌శాఖ డైరెక్టర్‌గా టీకే శ్రీదేవి బదిలీ అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. -
తెలంగాణలో ఐఎఫ్ఎస్ అధికారులకు పదోన్నతులు, బదిలీలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో పలువురు ఐఎఫ్ఎస్ అధికారులు బదిలీ అయ్యారు. ఈ క్రమంలో అధికారులకు పదోన్నతులు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, వైల్డ్ లైఫ్ పీసీసీఎఫ్, చీఫ్ లైఫ్ వార్డెన్‌గా లోకేశ్ జైశ్వాల్, హరితహారం పీసీసీఎఫ్‌గా సువర్ణ, అటవీ ఉత్పత్తుల చీఫ్ కన్జర్వేటర్‌గా రామలింగం, జూపార్కుల సంచాలకులుగా వీఎస్ఎన్వీ ప్రసాద్ నియామకం అయ్యారు. భద్రాద్రి డీఎఫ్‌వో లక్ష్మణ్ రంజిత్ నాయక్ అటవీ అభివృద్ధి సంస్థకు బదిలీ అయ్యారు. భద్రాద్రి కొత్తగూడెం డీఎఫ్‌వోగా కిష్ట గౌడ్ నియామకం అయ్యారు. ఇది కూడా చదవండి: బెంచ్ మార్క్ సెట్ చేయాలని ఇలా చేశాను.. కేటీఆర్ కొడుకు హిమాన్షు -
'స్వేచ్ఛ అంటే ఇలా ఉంటుందా'! ఏ జీవికైనా అంతేగా..
మనిషి దగ్గర నుంచి చిన్న చిన్న జంతువుల వరకు అన్ని ఫ్రీడమ్‌నే కోరుకుంటాయి. తమకంటూ ఒక స్వేచ్ఛ ఉండాలనుకుంటాయి. ఐతే మనం పెంచుకునేందుకనో లేక మరే ఇతర కారణాల వల్లో కొన్ని పక్షులను, లేదా జంతువులను తెచ్చుకుని బంధించి ఉంచుతాం. ఐతే మనం ఎంతా బాగా టైంకి ఫుడ్ పెట్టి మంచిగా పెంచుతున్నా.. అవి ఏదో ఆర్టిఫిషయల్‌గా ఉంటాయే గానీ హ్యాపీగా ఉండలేవు. అదే తమదైన వాతావరణంలో స్వేచ్ఛగా ఉంటే మాత్రం అవి కూడా ఎంతో ఉల్లాసంగా గెంతులేస్తూ సహజసిద్ధంగా చక్కగా ఉంటాయి. ఐతే ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే 'ఫ్రీడమ్ అంటే ఇలా ఉంటుందా!' అనే క్యాప్షన్‌ని జోడించి మరీ అటవీ శాఖ అధికారి ఓ అద్భుతమైన వీడియోని పోస్ట్ చేశారు. ఆ వీడియోలో బోనుల్లో బంధించి ఉన్న చిరుతలు, కోతులు, లేళ్లు, పక్షులు, గుర్రాలను తదితర వాటిని అడవిలో వదులుతారు. అవి ఒక్కసారిగా మాకు ఫ్రీడమ్ దొరికిందోచ్! అంటూ భలే రివ్వున వెళ్లిపోయాయి. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. This is how freedom looks like. pic.twitter.com/EFUp4fT2sO — Parveen Kaswan, IFS (@ParveenKaswan) March 4, 2023 (చదవండి: ఢిల్లీలోని ఆటో రిక్షాలో యూఎస్ సెక్రటరీ) -
ఐఎఫ్ఎస్ అధికారులతో కేటీఆర్ భేటీ
గచ్చిబౌలి: ఇండియన్ ఫారిన్ సర్వీస్ (ఐఎఫ్ఎస్) అధికారులతో సోమవారం రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారు. గచ్చి బౌలిలోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ) అందుకు వేదికైంది. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో అమలు చేస్తున్న ప్రగతిశీల పారిశ్రామిక విధానాలు, ఐటీ రంగం అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలు, సాధించిన ప్రగతి, ఎకో సిస్టమ్‌ను ఆయన వారికి వివరించారు. టీహబ్, వీహబ్, ఇంక్యుబేటర్ల గురించి టీహబ్ రెండోఫేజ్ గురించి కూడా వారికి వివరించారు. ఐఎఫ్ఎస్ అధికారుల మిడ్ కేరీర్ శిక్షణ కార్యక్రమంలో భాగంగా ఆయన వారితో భేటీ కావడంతోపాటు వారిని ఉద్దేశించి ప్రసంగించారు. కార్యక్రమంలో ఐఎస్బీ డీన్ ప్రొఫెసర్ మదన్ పిల్లుట్ల, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, ఐఎస్బీ ఫ్యాకల్టీ ప్రతినిధులు, ఐఎఫ్ఎస్ అధికారులు పాల్గొన్నారు. -
తెలంగాణలో అటవీశాఖ అధికారులు బదిలీ
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో పలువురు అటవీ శాఖ (IFS) సీనియర్ అధికారులుఅధికారుల బదిలీలు అయ్యారు. ఈ మేరకు మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. బదిలీ అయిన అధికారుల జాబితాను విడుదల చేసింది. ఫారెస్ట్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ వైస్ చైర్మన్, ఎండీగా డాక్టర్. జి. చంద్రశేఖర్ రెడ్డి అమ్రాబాద్ టైగర్ రిజర్వు ఫీల్డ్ డైరెక్టర్ గా బి. శ్రీనివాస్. స్టేట్ ట్రేడింగ్ సర్కిల్ అదనపు పీసీసీఎఫ్ గా డాక్టర్ ఏ.కే. సిన్హా. ఐ.టీ, వర్కింగ్ ప్లాన్ అదనపు పీసీసీఎఫ్ గా వినయ్ కుమార్. ఫారెస్ట్ అకాడమీ డైరెక్టర్ గా పి. వెంకట రాజా రావు. ఫారెస్ట్ కాలేజీ, పరిశోధనా సంస్థ పర్సన్ ఇంఛార్జిగా ప్రియాంక వర్గీస్ కు అదనపు బాధ్యతలు. హైదరాబాద్ సర్కిల్ చీఫ్ కన్జర్వేటర్ గా ఎం.జె. అక్బర్. అదిలాబాద్ సర్కిల్ చీఫ్ కన్జర్వేటర్ గా డాక్టర్ జి. రామలింగం. వరంగల్ సర్కిల్ జీఫ్ కన్జర్వేటర్ గా ఎస్.జె. ఆశ. భద్రాద్రి కొత్తగూడెం సర్కిల్ చీఫ్ కన్జర్వేటర్ గా డి. భీమా నాయక్. మహబూబ్ నగర్ సర్కిల్ చీఫ్ కన్జర్వేటర్ గా ఎన్. క్షితిజ. కరీంనగర్ సర్కిల్ చీఫ్ కన్జర్వేటర్ గా బి. సైదులు. నెహ్రూ జూ పార్క్ క్యూరేటర్ గా వీవీఎల్. సుభద్రా దేవి. -
ఏపీలో భారీగా ఐఎఫ్ఎస్ల బదిలీ, పోస్టింగులు
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో 30 మంది ఐఎఫ్ఎస్ అధికారులను బదిలీ చేస్తూ.. వెయిటింగ్లో ఉన్న వారికి పోస్టింగ్‌లు ఇస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఆదేశాలు తక్షణమే వర్తిస్తాయని సీఎస్ నీలం సాహ్ని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 30 మంది ఐఎఫ్ఎస్ల బదిలీ, పోస్టింగుల వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
‘అదే పులి సహజ బుద్ది.. తప్పు లేదు’
-
భయానకం.. కాపాడాలని చూస్తే దాడి చేసింది!
భయానక ఘటన. ఓ చిరుత పులిని రక్షించాలని చూసిన జనంపై అది దాడి చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సుశాంత్ నందా అనే అటవీ అధికారి గురువారం ట్విటర్లో ఈ వీడియోను షేర్ చేశాడు. గుంతలో పడిపోయిన చిరుత పులిని అటవీ అధికారులు, స్థానికులు కలిసి రెస్క్యు చేసే ప్రయత్నం చేశారు. అదే సమయంలో అది గుంట నుంచి పైకి వచ్చింది. పైకి వచ్చిన పులి చూట్టు ఉన్న జనసముహాన్ని చూసి బెంబేలెత్తి ఒక్కసారిగా వారిపై విరుచుకుపడింది. ఈ క్రమంలో ఓ వ్యక్తిపైకి దూకి దాడి చేయడంతో అతడు కింద పడిపోయాడు. దీంతో ఆ వ్యక్తిని వదిలి మరో వ్యక్తిపై దాడి చేస్తూ.. అలా అక్కడి వారందరిని భయాందోళనకు గురి చేసింది. ఈ వీడియోకు ఇప్పటీ వరకూ దాదాపు 3 వేల వ్యూస్ రాగా, వందల్లో కామెంట్లు వచ్చాయి. (కరోనా సునామీ: ఒక్క రోజే 33 కేసులు) ఇక ఈ వీడియోకు సుశాంత్.. ‘భయానక రెస్క్యు.. ఓ చిరుత పులిని కాపాడాలని చూసిన జనంపై అది దాడి చేసి.. మరోమారు పులుల సహాజత్వాన్ని వారికి గుర్తుచేసింది. ఇందులో దాని తప్పు లేదు’ అంటూ ట్వీట్ చేశాడు. ‘ఇది వారి ముర్ఖత్వానికి నిదర్శనం. ఎందుకంటే ప్రకృతిలో చిరుత పులి ఎంత క్రూరమైనవో తెలిసి కూడా దానిని రక్షించే ప్రయత్నం చేశారు. కానీ అది తన స్వభావాన్ని చూపించింది’ అని ‘ఆ పులికి ఎమైంది’ అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. ( కరోనా: కలకలం రేపిన వియత్నాం బృందం ) -
సీఎం ముఖ్య కార్యదర్శిగా ప్రవీణ్ ప్రకాశ్
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యకార్యదర్శిగా ప్రవీణ్ ప్రకాశ్ నియమితులయ్యారు. న్యూఢిల్లీలోని ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్‌గా ఉన్న ఆయనను ముఖ్యమంత్రి ముఖ్యకార్యదర్శిగా ప్రభుత్వం బదిలీ చేసింది. ముగ్గురు ఐఏఎస్‌లను, ఒక ఐఎఫ్ఎస్ అధికారిని బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ.సుబ్రహ్మణ్యం సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. సాధారణ పరిపాలన (రాజకీయ) ముఖ్యకార్యదర్శి ఆర్పీ సిసోడియాను గిరిజన సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శిగా బదిలీ అయ్యారు. సాధారణ పరిపాలన (రాజకీయ) శాఖ ముఖ్యకార్యదర్శి అదనపు బాధ్యలను ప్రవీణ్ కుమార్‌కు అప్పగించారు. అటవీ అభివృద్ధి సంస్ధ వైస్ చైర్మన్ అండ్ ఎండీ ఎన్.ప్రతీప్ కుమార్‌కు పీసీసీఎఫ్ పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. -
ఐఎఫ్ఎస్ అధికారుల బదిలీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని పలువురు ఐఎఫ్ఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. హైదరాబాద్‌లోని పీసీసీఎఫ్ ఆఫీసులో ఏపీసీసీఎఫ్(ఎల్ఆర్)గా పనిచేస్తున్న వై.బాబూరావును మహబూబ్‌నగర్ ఏపీసీసీఎఫ్/కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్‌గా నియమించారు. పీసీసీఎఫ్ కార్యాలయంలో ఏపీసీసీఎఫ్(జేఎఫ్ఎం)గా పనిచేస్తున్న ఎం.సి.పర్గేయిన్ను అచ్చంపేట (హైదరాబాద్‌లో తాత్కాలిక హెడ్‌క్వార్టర్స్) ఆమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఏపీసీసీఎఫ్/ఫీల్డ్ డైరెక్టర్‌గా బదిలీ చేశారు. హైదరాబాద్‌లోని సీసీఎఫ్/కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్‌గా పనిచేస్తున్న ఎస్ఎన్ కుక్రెటీని రంగారెడ్డిజిల్లాలోని అదే పోస్టులో నియమించారు. సీసీఎఫ్ డబ్ల్యూఎల్ఎం సర్కిల్, ఎఫ్‌సీఆర్ డీన్‌గా ఉన్న జి.చంద్రశేఖర్‌రెడ్డిని హైదరాబాద్‌లో ని సీసీఎఫ్/కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్‌గా బదిలీ చేశారు. నిజామాబాద్‌లోని సీసీఎఫ్/కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్‌గా పనిచేస్తున్న ఏకే సిన్హాను మెదక్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్‌గా నియమించా రు. అచ్చంపేట(హైదరాబాద్‌లో తాత్కాలిక హెడ్‌క్వార్టర్స్) ఆమ్రాబాద్ టైగ ర్ రిజర్వ్ సీసీఎఫ్/ఫీల్డ్ డైరెక్టర్ వినయ్‌కుమార్‌ను నిజామాబాద్ జిల్లా కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్‌గా బదిలీచేశారు. నిర్మల్ (హైదరాబాద్‌లో తాత్కాలిక హెడ్‌క్వార్టర్స్) కవ్వాల్ టైగర్ రిజర్వ్ సీసీఎఫ్/ఫీల్డ్ డైరెక్టర్‌గా ఉన్న సంజీవ్కుమార్గుప్తాను అక్కడే పీడీగా, ఆదిలాబాద్ సీఎఫ్/కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్‌గా ఉన్న టీపీ తిమ్మారెడ్డిని అక్కడే కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్‌గా సవరించిన పరిధిని బట్టి కొనసాగించనున్నారు. వరంగల్ సీఎఫ్/కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్‌గా ఉన్న మహమ్మద్ జలాలుద్దీన్ అక్బర్‌ను వరంగల్‌లోనే కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్‌గా కొనసాగిస్తారు. వరంగల్ సీఎఫ్/కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ పీఅండ్‌ఈ సర్కిల్‌గా ఉన్న పీవీ రాజారావును భద్రాద్రి జిల్లా కొత్తగూడెం కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్‌గా బదిలీ చేశారు. నిజామాబాద్ సీఎఫ్/కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ పీఅండ్‌ఈ సర్కిల్‌గా ఉన్న బి.ఆనంద్‌మోహన్‌ను కరీంనగర్ జిల్లా కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్‌గా బదిలీ చేశారు. ఖమ్మం సీఎఫ్/కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ఉన్న జి.నరసయ్యను అదే జిల్లా కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్‌గా కొనసాగిస్తారు. పాల్వంచ డీఎఫ్‌వోగా ఉన్న సి.శరవణన్‌ను భద్రాద్రిజిల్లా కొత్తగూడెం హెడ్‌క్వార్టర్ డీఎఫ్‌వోగా బదిలీ చేశారు. హైదరాబాద్ డీఎఫ్‌వోగా ఉన్న బి.శ్రీనివాస్‌ను రంగారెడ్డి డీఎఫ్‌వోగా బదలీచేశారు. కరీంనగర్(పశ్చిమ) డీఎఫ్‌వోగా ఉన్న సీపీ వినోద్‌కుమార్‌ను హైదరాబాద్ డీఎఫ్‌వోగా బదిలీచేశారు. నిజామాబాద్ డీఎఫ్‌వోగా ఉన్న వీఎస్ఎన్వీ ప్రసాద్‌ను సవరించిన పరిధి మేరకు అక్కడే కొనసాగిస్తారు. కొత్తగూడెం డీఎఫ్‌వోగా ఉన్న ఎస్.శాంతారాంను నల్లగొండ డీఎఫ్‌వోగా బదిలీ చేశారు. ఖమ్మం డీఎఫ్‌వోగా ఉన్న సునీల్ ఎస్. హిరేమత్‌ను సవరించిన పరిధి మేరకు అక్కడే కొనసాగిస్తారు. భద్రాచలం డీఎఫ్‌వోగా ఉన్న శివాల రాంబాబును ఆదిలాబాద్ డీఎఫ్‌వోగా బదిలీ చేశారు. కరీంనగర్ (తూర్పు) డీఎఫ్‌వోగా ఉన్న టి.రవికిరణ్‌ను జయశంకర్ జిల్లా డీఎఫ్‌వోగా బదిలీచేశారు. -
కృష్ణా జిల్లా జేసీగా గంధం చంద్రుడు
హైదరాబాద్: రాష్ట్రంలో పలువురు ఐఏఎస్, ఐఎఫ్ఎస్ అధికారులను బదిలీ చేస్తు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. మున్సిపల్ శాఖ కార్యదర్శి - జి.జయలక్ష్మీ స్త్రీ,శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ - పి. ఉషా కుమారి పర్యటాక శాఖ ముఖ్య కార్యదర్శి - నీరబ్ కుమార్ ప్రసాద్ వర్షాభావ ప్రాంత అభివృద్ధి విభాగం ముఖ్య కార్యదర్శి - డి.శ్రీనివాసులు సీసీఎల్ఏ సంయుక్త కార్యదర్శి - ఎం.జగన్నాథం కృష్ణా జిల్లా జేసీ - గంధం చంద్రుడు రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ వీసీ, ఎండీ - రేఖారాణి ఆయుష్ విభాగం కమిషనర్ - నళినీ మోహన్ ప్రణాళిక శాఖ ప్రత్యేక కార్యదర్శి - చిరంజీవి చౌదరి ప్రణాళిక శాఖ అదనపు కార్యదర్శి - శాంతిప్రియ పాండే ఇంధన శాఖ అదనపు కార్యదర్శి, నెడ్‌క్యాప్ ఎండీ - రాహుల్ పాండే -
ముందస్తు పదవీ విరమణ కోరాను: సుజాతాసింగ్
న్యూఢిల్లీ: విదేశాంగ కార్యదర్శిగా తన పదవీ కాలం ముగియటానికి ముందుగానే పదవీ విరమణ కావాలని తాను కోరినట్లు సుజాతాసింగ్ పేర్కొన్నారు. వ్యవస్థ కన్నా ఏ వ్యక్తీ అధికం కాదని ఆమె వ్యాఖ్యానించారు. విదేశాంగ కార్యదర్శి పదవి నుంచి ప్రభుత్వం తనను అర్ధంతరంగా తొలగించిన నేపథ్యంలో.. సుజాతాసింగ్ తన సహ ఐఎఫ్ఎస్ అధికారులకు వీడ్కోలు ఈ-మెయిల్ సందేశం పంపించారు. ఇందులో తన తొలగింపు విషయాన్ని ఆమె ప్రస్తావించలేదు. అయితే.. 38 ఏళ్ల ప్రభుత్వ సర్వీసు తర్వాత తాను ముందస్తుగా పదవీ విరమణ కోరుకున్నానని పేర్కొన్నారు. సంస్థల నిర్మాణంలో వ్యక్తులు కీలక పాత్ర పోషించినప్పటికీ.. సంస్థలే కీలకమని.. సంస్థలు ఒక దానితో ఒకటి ఎలా సమన్వయం చేసుకుంటాయనేది ముఖ్యమని ఆమె పేర్కొన్నారు. భారత విదేశాంగ శాఖలో 38 ఏళ్ల పాటు పనిచేయటం తనకు లభించిన విశిష్ట అవకాశమని.. గత 18 నెలల పాటు విదేశాంగ కార్యదర్శిగా పనిచేయటం తనకు జీవితాంతం గర్వంగా గుర్తుండిపోతుందని చెప్పారు. -
‘ఆంధ్రా’కు వెళ్లే అధికారుల రిలీవ్
ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం సాక్షి, హైదరాబాద్: తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన అఖిల భారత సర్వీసు అధికారులను గురువారం రిలీవ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గతనెల 29వ తేదీన ఐదుగురు ఐఏఎస్, 12 మంది ఐపీఎస్‌లను రిలీవ్ చేసిన రాష్ట్ర ప్రభుత్వం గురువారం 17 మంది ఐఏఎస్, 10 మంది ఐపీఎస్, తొమ్మిది మంది ఐఎఫ్ఎస్ అధికారులను రిలీవ్ చేసింది. సోమేశ్ కుమార్, పూనం మాలకొండయ్య, రోనాల్డ్ రాస్, జయేష్ రంజన్లను ఇక్కడే కొనసాగించాలని కోరిన ప్రభుత్వం తాజాగా భార్యభర్తలకు సంబంధించి ఆంధ్రాకు వెళ్లే అధికారులను రిలీవ్ చేసి, తిరిగి తెప్పించుకోవడం కంటే.. ఇక్కడే ఉంచేయాలన్న ఉద్దేశంతో ఉన్నట్లు సమాచారం. అందుకే ఐఏఎస్‌లను మొత్తంగా కాకుండా విడతల వారీగా రిలీవ్ చేయడం గమనార్హం. కాగా, ఆంధ్రాకు వెళ్లే అధికారులను రిలీవ్ చేసిన ప్రభుత్వం.. అక్కడ నుంచి ఇక్కడకు వచ్చిన అధికారులకు ఇప్పటి వరకు పోస్టింగ్‌లు ఇవ్వకుండా జాప్యం చేస్తోంది. సాధారణంగా అక్కడ నుంచి వచ్చిన వారికి వెంటనే పోస్టింగ్‌లు ఇస్తారని ప్రచారం జరిగినా.. జాప్యం కారణంగా ఐఏఎస్‌లలో టెన్షన్ పెరుగుతోంది. అదే విధంగా పలు జిల్లాలకు కొత్త కలెక్టర్లను నియమిస్తారన్న ప్రచారం కూడా జరుగుతోంది. ముఖ్యమంత్రి కార్యాలయంలోనూ మార్పులు జరిగే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. తాజాగా ఇక్కడ నుంచి రిలీవ్ అయిన అధికారుల వివరాలు ఇలా ఉన్నాయి. ఐఏఎస్‌లు: పి.కోటేశ్వరరావు, వి.విజయరామరాజు, డాక్టర్ మల్లికార్జున్, జె.నివాస్, కార్తీకేయ మిశ్ర, సుజాతా శర్మ, ఎం. పద్మ, సామ్యూల్ ఆనందకుమార్, పీఎస్ ప్రద్యుమ్న, పి.వెంకటరామిరెడ్డి, ఎ.బాబు, బి. శ్రీధర్, ముఖేశ్ కుమార్ మీనా, జె. శ్యామల రావు, లవ్ అగర్వాల్, బి. కిషోర్, డాక్టర్ విజయ్‌కుమార్. ఐపీఎస్‌లు: సత్య ఏసుబాబు, పి. వెంకటరామిరెడ్డి, రాజకుమారి, త్రివిక్రమ వర్మ, అబ్రహం లింకన్, కృపానంద్ త్రిపాఠీ, కుమార్ విశ్వజీత్, అమిత్‌గార్గ్, అంజనా సిన్హా, ఎహ్సాన్ రాజా ఐఎఫ్ఎస్లు: శివప్రసాద్, బీఎన్ఎన్ మూర్తి, సురేందర్, పీవీ రమణారెడ్డి, రాజేంద్ర ప్రసాద్ ఖజునా, విపిన్ చౌదరి, సురేంద్ర పాండే, చిరంజీవి చౌదరి, రమాప్రసాద్ -
సభలో ఆస్తుల రచ్చ
-వెల్లడించని అధికారులపై సభ్యుల ఆగ్రహావేశాలు - చర్యలు తప్పవని హెచ్చరించిన సీఎం సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాష్ట్రంలో ఆస్తుల వివరాలను వెల్లడించని ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, కేఏఎస్ అధికారులపై క్రమశిక్షణా చర్యలు చేపడతామని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య శాసన సభకు తెలిపారు. ఇప్పటికే అలాంటి అధికారులకు నోటీసులను జారీ చేశామని చెప్పారు. మంగళవారం ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిస్తూ, ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారులందరూ ఏటా డిసెంబరు 31లోగా ప్రభుత్వ నిర్ణీత నమూనాలో స్థిరాస్తి వివరాలను సమర్పించాల్సి ఉందని వెల్లడించారు. కేఏఎస్ అధికారులు మార్చి 31లోగా సమర్పించాల్సి ఉంటుందన్నారు. రాష్ట్రంలోని 216 మంది ఐఏఎస్ అధికారులకు గాను 214 మంది, 143 మంది ఐపీఎస్ అధికారులకు గాను 113 మంది ఆస్తి వివరాలను సమర్పించారని తెలిపారు. 146 మందికి గాను 29 మంది ఐఎఫ్ఎస్ అధికారులు ఇంకా తమ స్థిర, చరాస్తుల వివరాలను సమర్పించ లేదని చెప్పారు. అలాగే 285 మంది కేఏఎస్ అధికారులకు గాను 184 మంది వివరాలు వెల్లడించ లేదని తెలిపారు. నిర్ణీత గడువులోగా ఆస్తి వివరాలను సమర్పించని 14 మంది అధికారులపై క్రమశిక్షణా చర్యలు చేపట్టామని, ఆరుగురు అధికారులకు జరిమానా విధిస్తూ ఆదేశాలను జారీ చేశామని వివరించారు. ఈ సందర్భంగా పార్టీలకతీతంగా సభ్యులు మాట్లాడుతూ, ఆస్తుల వివరాలను వెల్లడించని అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ సభ్యుడు రమేశ్ కుమార్ అధికారుల తీరుపై తీవ్ర ఆక్షేపణ వ్యక్తం చేస్తూ, పాలనా వ్యవహారాలను పర్యవేక్షించే వారే ఆస్తుల వివరాలను వెల్లడించక పోవడం వారి అవిధేయతను చాటుతోందని తూర్పారబట్టారు. బీజేపీ, జేడీఎస్‌లకు చెందిన సభ్యులు కూడా అధికారుల తీరును తప్పుబట్టారు. వారి పట్ల ఉదాసీనంగా వ్యవహరించవద్దని సీఎంను కోరారు.