సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని పలువురు ఐఎఫ్‌ఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. హైదరాబాద్‌లోని పీసీసీఎఫ్ ఆఫీసులో ఏపీసీసీఎఫ్(ఎల్‌ఆర్)గా పనిచేస్తున్న వై.బాబూరావును మహబూబ్‌నగర్ ఏపీసీసీఎఫ్/కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్‌గా నియమించారు. పీసీసీఎఫ్ కార్యాలయంలో ఏపీసీసీఎఫ్(జేఎఫ్‌ఎం)గా పనిచేస్తున్న ఎం.సి.పర్‌గేయిన్‌ను అచ్చంపేట (హైదరాబాద్‌లో తాత్కాలిక హెడ్‌క్వార్టర్స్) ఆమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఏపీసీసీఎఫ్/ఫీల్డ్ డైరెక్టర్‌గా బదిలీ చేశారు. హైదరాబాద్‌లోని సీసీఎఫ్/కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్‌గా పనిచేస్తున్న ఎస్‌ఎన్ కుక్రెటీని రంగారెడ్డిజిల్లాలోని అదే పోస్టులో నియమించారు. సీసీఎఫ్ డబ్ల్యూఎల్‌ఎం సర్కిల్, ఎఫ్‌సీఆర్ డీన్‌గా ఉన్న జి.చంద్రశేఖర్‌రెడ్డిని హైదరాబాద్‌లో ని సీసీఎఫ్/కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్‌గా బదిలీ చేశారు.
నిజామాబాద్‌లోని సీసీఎఫ్/కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్‌గా పనిచేస్తున్న ఏకే సిన్హాను మెదక్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్‌గా నియమించా రు. అచ్చంపేట(హైదరాబాద్‌లో తాత్కాలిక హెడ్‌క్వార్టర్స్) ఆమ్రాబాద్ టైగ ర్ రిజర్వ్ సీసీఎఫ్/ఫీల్డ్ డైరెక్టర్ వినయ్‌కుమార్‌ను నిజామాబాద్ జిల్లా కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్‌గా బదిలీచేశారు. నిర్మల్ (హైదరాబాద్‌లో తాత్కాలిక హెడ్‌క్వార్టర్స్) కవ్వాల్ టైగర్ రిజర్వ్ సీసీఎఫ్/ఫీల్డ్ డైరెక్టర్‌గా ఉన్న సంజీవ్‌కుమార్‌గుప్తాను అక్కడే పీడీగా, ఆదిలాబాద్ సీఎఫ్/కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్‌గా ఉన్న టీపీ తిమ్మారెడ్డిని అక్కడే కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్‌గా సవరించిన పరిధిని బట్టి కొనసాగించనున్నారు. వరంగల్ సీఎఫ్/కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్‌గా ఉన్న మహమ్మద్ జలాలుద్దీన్ అక్బర్‌ను వరంగల్‌లోనే కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్‌గా కొనసాగిస్తారు. వరంగల్ సీఎఫ్/కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ పీఅండ్‌ఈ సర్కిల్‌గా ఉన్న పీవీ రాజారావును భద్రాద్రి జిల్లా కొత్తగూడెం కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్‌గా బదిలీ చేశారు.
నిజామాబాద్ సీఎఫ్/కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ పీఅండ్‌ఈ సర్కిల్‌గా ఉన్న బి.ఆనంద్‌మోహన్‌ను కరీంనగర్ జిల్లా కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్‌గా బదిలీ చేశారు. ఖమ్మం సీఎఫ్/కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ఉన్న జి.నరసయ్యను అదే జిల్లా కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్‌గా కొనసాగిస్తారు. పాల్వంచ డీఎఫ్‌వోగా ఉన్న సి.శరవణన్‌ను భద్రాద్రిజిల్లా కొత్తగూడెం హెడ్‌క్వార్టర్ డీఎఫ్‌వోగా బదిలీ చేశారు. హైదరాబాద్ డీఎఫ్‌వోగా ఉన్న బి.శ్రీనివాస్‌ను రంగారెడ్డి డీఎఫ్‌వోగా బదలీచేశారు. కరీంనగర్(పశ్చిమ) డీఎఫ్‌వోగా ఉన్న సీపీ వినోద్‌కుమార్‌ను హైదరాబాద్ డీఎఫ్‌వోగా బదిలీచేశారు. నిజామాబాద్ డీఎఫ్‌వోగా ఉన్న వీఎస్‌ఎన్‌వీ ప్రసాద్‌ను సవరించిన పరిధి మేరకు అక్కడే కొనసాగిస్తారు. కొత్తగూడెం డీఎఫ్‌వోగా ఉన్న ఎస్.శాంతారాంను నల్లగొండ డీఎఫ్‌వోగా బదిలీ చేశారు. ఖమ్మం డీఎఫ్‌వోగా ఉన్న సునీల్ ఎస్. హిరేమత్‌ను సవరించిన పరిధి మేరకు అక్కడే కొనసాగిస్తారు. భద్రాచలం డీఎఫ్‌వోగా ఉన్న శివాల రాంబాబును ఆదిలాబాద్ డీఎఫ్‌వోగా బదిలీ చేశారు. కరీంనగర్ (తూర్పు) డీఎఫ్‌వోగా ఉన్న టి.రవికిరణ్‌ను జయశంకర్ జిల్లా డీఎఫ్‌వోగా బదిలీచేశారు.
ఐఎఫ్‌ఎస్ అధికారుల బదిలీ
Published Thu, Oct 13 2016 4:12 AM | Last Updated on Mon, Sep 4 2017 5:00 PM
Advertisement
Advertisement