![3 IAS And 2 IFS Officers Transferred In Andhra Pradesh - Sakshi](/styles/webp/s3/article_images/2019/09/16/AP-LOGO.jpg.webp?itok=Bg6DWcOA)
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యకార్యదర్శిగా ప్రవీణ్ ప్రకాశ్ నియమితులయ్యారు. న్యూఢిల్లీలోని ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్‌గా ఉన్న ఆయనను ముఖ్యమంత్రి ముఖ్యకార్యదర్శిగా ప్రభుత్వం బదిలీ చేసింది. ముగ్గురు ఐఏఎస్‌లను, ఒక ఐఎఫ్‌ఎస్ అధికారిని బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ.సుబ్రహ్మణ్యం సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. సాధారణ పరిపాలన (రాజకీయ) ముఖ్యకార్యదర్శి ఆర్పీ సిసోడియాను గిరిజన సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శిగా బదిలీ అయ్యారు. సాధారణ పరిపాలన (రాజకీయ) శాఖ ముఖ్యకార్యదర్శి అదనపు బాధ్యలను ప్రవీణ్ కుమార్‌కు అప్పగించారు. అటవీ అభివృద్ధి సంస్ధ వైస్ చైర్మన్ అండ్ ఎండీ ఎన్.ప్రతీప్ కుమార్‌కు పీసీసీఎఫ్ పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు.
Comments
Please login to add a commentAdd a comment