
సాక్షి, అమరావతి: ముగ్గురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. అనంతపురం జాయింట్ కలెక్టర్‌గా కేతన్ గార్గ్‌ను, గుంటూరు కార్పొరేషన్ కమిషనర్‌గా నిశాంత్ కుమార్‌ను, ఏపీ భవన్ అదనపు రెసిడెంట్ కమినర్‌గా హిమాన్షు కౌశిక్‌ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.