ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన అఖిల భారత సర్వీసు అధికారులను గురువారం రిలీవ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గతనెల 29వ తేదీన ఐదుగురు ఐఏఎస్, 12 మంది ఐపీఎస్‌లను రిలీవ్ చేసిన రాష్ట్ర ప్రభుత్వం గురువారం 17 మంది ఐఏఎస్, 10 మంది ఐపీఎస్, తొమ్మిది మంది ఐఎఫ్‌ఎస్ అధికారులను రిలీవ్ చేసింది. సోమేశ్ కుమార్, పూనం మాలకొండయ్య, రోనాల్డ్ రాస్, జయేష్ రంజన్‌లను ఇక్కడే కొనసాగించాలని కోరిన ప్రభుత్వం తాజాగా భార్యభర్తలకు సంబంధించి ఆంధ్రాకు వెళ్లే అధికారులను రిలీవ్ చేసి, తిరిగి తెప్పించుకోవడం కంటే.. ఇక్కడే ఉంచేయాలన్న ఉద్దేశంతో ఉన్నట్లు సమాచారం.
అందుకే ఐఏఎస్‌లను మొత్తంగా కాకుండా విడతల వారీగా రిలీవ్ చేయడం గమనార్హం. కాగా, ఆంధ్రాకు వెళ్లే అధికారులను రిలీవ్ చేసిన ప్రభుత్వం.. అక్కడ నుంచి ఇక్కడకు వచ్చిన అధికారులకు ఇప్పటి వరకు పోస్టింగ్‌లు ఇవ్వకుండా జాప్యం చేస్తోంది. సాధారణంగా అక్కడ నుంచి వచ్చిన వారికి వెంటనే పోస్టింగ్‌లు ఇస్తారని ప్రచారం జరిగినా.. జాప్యం కారణంగా ఐఏఎస్‌లలో టెన్షన్ పెరుగుతోంది. అదే విధంగా పలు జిల్లాలకు కొత్త కలెక్టర్లను నియమిస్తారన్న ప్రచారం కూడా జరుగుతోంది. ముఖ్యమంత్రి కార్యాలయంలోనూ మార్పులు జరిగే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. తాజాగా ఇక్కడ నుంచి రిలీవ్ అయిన అధికారుల వివరాలు ఇలా ఉన్నాయి.
ఐఏఎస్‌లు: పి.కోటేశ్వరరావు, వి.విజయరామరాజు, డాక్టర్ మల్లికార్జున్, జె.నివాస్, కార్తీకేయ మిశ్ర, సుజాతా శర్మ, ఎం. పద్మ, సామ్యూల్ ఆనందకుమార్, పీఎస్ ప్రద్యుమ్న, పి.వెంకటరామిరెడ్డి, ఎ.బాబు, బి. శ్రీధర్, ముఖేశ్ కుమార్ మీనా, జె. శ్యామల రావు, లవ్ అగర్వాల్, బి. కిషోర్, డాక్టర్ విజయ్‌కుమార్.
ఐపీఎస్‌లు: సత్య ఏసుబాబు, పి. వెంకటరామిరెడ్డి, రాజకుమారి, త్రివిక్రమ వర్మ, అబ్రహం లింకన్, కృపానంద్ త్రిపాఠీ, కుమార్ విశ్వజీత్, అమిత్‌గార్గ్, అంజనా సిన్హా, ఎహ్‌సాన్ రాజా ఐఎఫ్‌ఎస్‌లు: శివప్రసాద్, బీఎన్‌ఎన్ మూర్తి, సురేందర్, పీవీ రమణారెడ్డి, రాజేంద్ర ప్రసాద్ ఖజునా, విపిన్ చౌదరి, సురేంద్ర పాండే, చిరంజీవి చౌదరి, రమాప్రసాద్
‘ఆంధ్రా’కు వెళ్లే అధికారుల రిలీవ్
Published Fri, Jan 9 2015 2:05 AM | Last Updated on Sat, Sep 2 2017 7:24 PM
Advertisement