all indian service
-
ఐదురోజులు దాటినా నో పోస్టింగ్స్
సాక్షి, హైదరాబాద్: అఖిల భారత సర్వీసు అధికారులకు పోస్టింగ్‌లు ఇవ్వకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తాత్సారం చేస్తోంది. ఆంధ్రకు వెళ్లాల్సిన అధికారులను రిలీవ్ చేయడంలోనూ ప్రభుత్వం జాప్యం చేస్తుందన్న విమర్శలు వస్తున్నాయి. హైదరాబాద్‌లో ఉన్న సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారులను ఆదివారం రిలీవ్ చేయడంతో సోమవారం సాయంత్రంలోగా సీనియర్ అధికారులంతా తెలంగాణ ప్రభుత్వంలో రిపోర్టు చేశారు. ఆల స్యం అవుతున్న తీరుపై అధికారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఈనెల 7వ తేదీన వరంగల్ జిల్లా పర్యటనకు బయల్దేరి వెళ్లే ముందు పోస్టింగుల ఉత్తర్వులపై సంతకం చేసి వెళ్తారని అంతా భావించారు. కానీ ఆయన మాత్రం ఆ ఫైలుపై సంతకం చేయలేదు. ఇప్పటికే తెలంగాణలో ఉన్న దాదాపు 22 మంది ఐఏఎస్ అధికారులను తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు రిలీవ్ చేశారు. అలాగే 22 మంది ఐపీఎస్‌లను కూడా రిలీవ్ చేశారు. ఇప్పుడా పోస్టులన్నీ ఖాళీగానే ఉన్నాయి. తెలంగాణకు తక్కువ మంది ఐపీఎస్ అధికారులను కేటాయించారంటూ ఒక్కో అధికారికి ఐదారు శాఖలు కేటాయించడంతో.. ఏడు నెలలుగా పాలన కుంటినడక నడుస్తోంది. ఇప్పటికే కీలక పదవుల్లో ఉన్న అధికారులను మారుస్తారని ప్రచారం జరుగుతోంది. ఒకే నగరంలో ఉన్నవారు 24 గంటల్లోగా విధుల్లో చేరాలన్న నిబంధనతో అఖిల భారత సర్వీసు అధికారులు విధుల్లో చేరినా.. వారంతా పోస్టింగ్‌ల కోసం ఎదురుచూస్తుండడం గమనార్హం. దరఖాస్తులకు నేటితో గడువు ముగింపు గతనెల 26వ తేదీన అఖిల భారత సర్వీసు అధికారులను ఇరు రాష్ట్రాలకు కేటాయిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసిన తరువాత అభ్యంతరాలు ఉంటే ఈనెల 10వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని కేంద్రం స్పష్టం చేసింది. శనివారంతో ఆ గడువు ముగియనుంది. కొత్తగా రెండేళ్లలో పదవీ విరమణ చేసే అధికారులు తమకు కావాల్సినచోట పనిచేయడానికి విజ్ఞప్తి చేసుకోవచ్చని పేర్కొనడంతో టి.రాధ తెలంగాణలో పనిచేయడానికి దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం. అలాగే శాలినిమిశ్రా, జ్యోతి బుద్ధప్రకాశ్ సతీమణి ఐఎఫ్ ఎస్ అధికారి తెలంగాణకు రావడానికి దరఖాస్తు చేసుకున్నారు. క్యాట్‌ను ఆశ్రయించిన ఐఎఫ్ఎస్ కిషన్ తనను తెలంగాణకు కేటాయించినా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో సస్పెన్షన్‌కు గురయ్యానన్న కారణంగా ఇప్పుడు ఏపీ ప్రభుత్వం రిలీవ్ చేయడం లేదంటూ ఐఎఫ్ఎస్ అధికారి ఎ.కిషన్ క్యాట్‌ను ఆశ్రయించారు. ఈ మేరకు క్యాట్ సభ్యులు కాంతారావు, మిన్నీమాథ్యూలతో కూడిన ధర్మాసనం శుక్రవారం విచారిం చింది. తెలంగాణకు కేటాయించిన నేపథ్యంలో తనపై క్రమశిక్షణాచర్యలు తీసుకునే అధికారం ఏపీ ప్రభుత్వానికి లేదని నివేదించారు. పిటిషన్‌పై కౌంటర్ దాఖలుకు కేంద్రం, ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలకు క్యాట్ సభ్యులు నోటీసులు జారీ చేస్తూ విచారణను సంక్రాంతి సెలవుల తర్వాతకు వాయిదా వేసింది. -
‘ఆంధ్రా’కు వెళ్లే అధికారుల రిలీవ్
ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం సాక్షి, హైదరాబాద్: తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన అఖిల భారత సర్వీసు అధికారులను గురువారం రిలీవ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గతనెల 29వ తేదీన ఐదుగురు ఐఏఎస్, 12 మంది ఐపీఎస్‌లను రిలీవ్ చేసిన రాష్ట్ర ప్రభుత్వం గురువారం 17 మంది ఐఏఎస్, 10 మంది ఐపీఎస్, తొమ్మిది మంది ఐఎఫ్ఎస్ అధికారులను రిలీవ్ చేసింది. సోమేశ్ కుమార్, పూనం మాలకొండయ్య, రోనాల్డ్ రాస్, జయేష్ రంజన్లను ఇక్కడే కొనసాగించాలని కోరిన ప్రభుత్వం తాజాగా భార్యభర్తలకు సంబంధించి ఆంధ్రాకు వెళ్లే అధికారులను రిలీవ్ చేసి, తిరిగి తెప్పించుకోవడం కంటే.. ఇక్కడే ఉంచేయాలన్న ఉద్దేశంతో ఉన్నట్లు సమాచారం. అందుకే ఐఏఎస్‌లను మొత్తంగా కాకుండా విడతల వారీగా రిలీవ్ చేయడం గమనార్హం. కాగా, ఆంధ్రాకు వెళ్లే అధికారులను రిలీవ్ చేసిన ప్రభుత్వం.. అక్కడ నుంచి ఇక్కడకు వచ్చిన అధికారులకు ఇప్పటి వరకు పోస్టింగ్‌లు ఇవ్వకుండా జాప్యం చేస్తోంది. సాధారణంగా అక్కడ నుంచి వచ్చిన వారికి వెంటనే పోస్టింగ్‌లు ఇస్తారని ప్రచారం జరిగినా.. జాప్యం కారణంగా ఐఏఎస్‌లలో టెన్షన్ పెరుగుతోంది. అదే విధంగా పలు జిల్లాలకు కొత్త కలెక్టర్లను నియమిస్తారన్న ప్రచారం కూడా జరుగుతోంది. ముఖ్యమంత్రి కార్యాలయంలోనూ మార్పులు జరిగే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. తాజాగా ఇక్కడ నుంచి రిలీవ్ అయిన అధికారుల వివరాలు ఇలా ఉన్నాయి. ఐఏఎస్‌లు: పి.కోటేశ్వరరావు, వి.విజయరామరాజు, డాక్టర్ మల్లికార్జున్, జె.నివాస్, కార్తీకేయ మిశ్ర, సుజాతా శర్మ, ఎం. పద్మ, సామ్యూల్ ఆనందకుమార్, పీఎస్ ప్రద్యుమ్న, పి.వెంకటరామిరెడ్డి, ఎ.బాబు, బి. శ్రీధర్, ముఖేశ్ కుమార్ మీనా, జె. శ్యామల రావు, లవ్ అగర్వాల్, బి. కిషోర్, డాక్టర్ విజయ్‌కుమార్. ఐపీఎస్‌లు: సత్య ఏసుబాబు, పి. వెంకటరామిరెడ్డి, రాజకుమారి, త్రివిక్రమ వర్మ, అబ్రహం లింకన్, కృపానంద్ త్రిపాఠీ, కుమార్ విశ్వజీత్, అమిత్‌గార్గ్, అంజనా సిన్హా, ఎహ్సాన్ రాజా ఐఎఫ్ఎస్లు: శివప్రసాద్, బీఎన్ఎన్ మూర్తి, సురేందర్, పీవీ రమణారెడ్డి, రాజేంద్ర ప్రసాద్ ఖజునా, విపిన్ చౌదరి, సురేంద్ర పాండే, చిరంజీవి చౌదరి, రమాప్రసాద్