
ఢిల్లిలో మరోసారి చిరుతపులి సంచారం కలకలం రేపింది. ఇటీవలి కాలంలో ఢిల్లీ వాసులను వణికిస్తున్న చిరుత పట్టపగలే మరోసారి దర్శన మిచ్చింది. ఈ రోజు (సోమవారం) మధ్యాహ్నం ఉత్తర ఢిల్లిలో రూప్ నగర్‌లో చిరుతపులి ఓ ఇంట్లోకి చొరబడింది. ఈ క్రమంలో ముగ్గురిపై దాడిచేసినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియో నెటింట చక్కర్లు కోడుతుంది.
స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసుల సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అనంతరం అగ్నిమాపక బృందం సాయంతో ఎట్టకేలకు దానిని బంధించారు. దీంతో అక్కడి జనం, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
అయితే ఈ చిరుతను అదుపులోకి తెచ్చేందుకు అగ్నిమాపక బృందం నానా కష్టాలు పడినట్టు సమాచారం. చిరుతని గదిలో బంధించామని, గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించామని ఢిల్లీ అగ్నిమాపక అధికారులు వెల్లడించారు.
STORY | Leopard barges into house in Delhi's Roop Nagar, 5 injured
— Press Trust of India (@PTI_News) April 1, 2024
READ: https://t.co/EbH7OulTMV
VIDEO:
(Source: Third Party) pic.twitter.com/7bJRdu08YH