పంజాబ్ రాష్ట్రంలోని జలంధర్‌లో చిరుత బీభత్సం సృష్టించింది. జనావాసాలపై విరుచుకుపడి ప్రజలను గాయపరిచింది. చివరకు అటవీ అధికారులు ట్రాంక్విలైజర్ గన్‌ను ఉపయోగించి చిరుతను అదుపు చేయడంతో జనాలు ఊపిరి పీల్చుకున్నారు. గురువారం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.