
చిరుత దాడిలో వ్యక్తికి గాయాలు
చిరుతపులి దాడిచేసి ఓ వ్యక్తిని గాయపరిచింది.
సైదాపేట: చిరుతపులి దాడిచేసి ఓ వ్యక్తిని గాయపరిచింది. ఈ ఘటన నెల్లూరు జిల్లా సైదాపేట మండలంలోని మొలకలపల్లి గ్రామంలో మంగళవారం ఉదయం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన మద్దిపాటి శివయ్య(33) ఉదయం బావి వద్దకు వెళ్తున్న సమయంలో పొదల్లో చిరుత అలికిడి అయింది. వెంటనే అప్రమత్తమైన శివయ్య వెనక్కితిరిగి అరుస్తూ పరిగెత్తాడు. ఇంతలోనే చిరుతపులి ఆయనపై దాడి చేసింది. ఆయన అరుపులు విన్న కొందరు స్థానికులు సంఘటనా స్థలానికి చేరుకోవడంతో బెదిరిన చిరుత పొదల్లోకి జారుకుంది. గాయాలపాలైన శివయ్యను గూడూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.