venkatappa
-
వ్యక్తిని హత్య చేసి రూ. 6 లక్షలతో పరారీ
చిత్తూరు : వ్యాపారం కోసం ఇంట్లోని నగదును తీసుకుని వెళ్తున్న వ్యక్తిని ఆగంతకులు ఉరి వేసి హతమర్చి అతని వద్దనున్న రూ. 6 లక్షలతో ఉడాయించారు. ఈ సంఘటన చిత్తూరు జిల్లా బెరైడ్డిపల్లి మండలం కమ్మనపల్లి గ్రామంలో గురువారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. పోలీసులు కథనం ప్రకారం ... గ్రామానికి చెందిన వెంకటప్ప (68) గొర్రెల విక్రయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఆ క్రమంలో ఈ రోజు తెల్లవారుజామునే ఇంట్లో నుంచి రూ. 6 లక్షలు తీసుకొని గొర్లను కొనుక్కొని రావడానికి గుంటూరు బయలుదేరాడు. అయితే గ్రామ శివారులోని గురుకుల పాఠశాల వద్దనున్న చెట్టుకు వెంకటప్ప ఉరేసుకొని వేళాడుతూ కనిపించడంతో.. స్థానికులు కుటుంబ సభ్యలకు తెలిపారు. దాంతో కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులకు ఘటనా స్థలానికి చేరుకుని వెంకటప్ప మృతదేహన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్ట్‌మార్టం నిమిత్తం మృతదేహన్ని చిత్తూరు తరలించారు. కాగా.. నగదు కోసమే ఈ హత్య చేసి ఉంటారని కుటుంబసభ్యులు భావిస్తున్నారు. అయితే ఆత్మహత్యలా కనిపించడం కోసం ఆగంతకులు వెంకట్టప్పకు ఉరేసి ఉంటారని పోలీసులు వద్ద ఆరోపించారు. -
చిరుత దాడిలో తాత, మనవడు మృతి
కోలారు: చిరుత దాడిలో తాత, మనవడు మరణించారు. స్థానికుల సమాచారం మేరకు... కోలారు తాలూకా ఎం.గొల్లహళ్లికి చెందిన వెంకటప్ప(60), మహేష్(16) మంగళవారం రాత్రి త్యావనహళ్లి వద్ద ఉన్న తమ తోట వద్దకు ద్విచక్ర వాహనంపై బయలుదేరారు. మరి కొద్ది సేపటిలో తోటను సమీపిస్తుండగా వారిపై చిరుత దాడి చేసింది. బుధవారం తెల్లవారుజామున మృతదేహాలను గుర్తించిన గ్రామస్తుల సమాచారం మేరకు ఎం.గొల్లహళ్లి వాసులు పెద్ద సంఖ్యలో అక్కడకు చేరుకుని పరిశీలించారు. మృతదేహాలు పడి ఉన్న తీరు. శరీరంపై ఉన్న గాట్లను ఆధారంగా చేసుకుని చిరుత దాడిలో మరణించినట్లు నిర్ధారణకు వచ్చారు. విషయం తెలుసుకున్న జిల్లా ఎస్పీ అజయ్ హిలోరి, అటవీశాఖాధికారి జగదీష్ అక్కడకు చేరుకుని పరిశీలించారు. ఘటనపై ఎస్పీ మాట్లాడుతూ... గ్రామస్తుల చెప్పిన దాన్ని బట్టి చిరుత దాడిలో మరణించినట్లు ఉన్నా.. పోస్టుమార్టం నివేదిక అందిన తర్వా త వాస్తవాలు వెలుగు చూస్తాయని అన్నారు. కాగా, చిరుత దాడిలో మరణించిన వారి కుటుంబాలకు రూ.5 లక్షల పరి హారాన్ని ఇవ్వాలని స్థానిక ఎమ్మెల్యే వర్తూరు ప్రకా ష్ డిమాండ్ చేశారు. ఘటనా స్థలాన్ని ఆయన పరిశీలించి, మృతుల కుటుంబాలను పరా మర్శిం చారు. -
వేర్వేరు చోట్ల ఇద్దరు బాలికలపై లైంగికదాడి
కల్వకుర్తి, న్యూస్‌లైన్: ఓ బాలికపై ముగ్గురు యువకులు కలిసి లైంగికదాడికి ఒడిగట్టారు. స్థానికంగా సంచలనం రేకెత్తించిన ఈ ఘటన శుక్రవారం మండలంలోని తుర్కలపల్లి గ్రామంలో వెలుగుచూసిం ది. కల్వకుర్తి సీఐ భిక్షపతిరావు వివరాల ను వెల్లడించారు. తుర్కలపల్లి గ్రామం లో ఓ చిన్నారి తన అమ్మమ్మ ఇంటివద్ద ఉంటూ రెండోతరగతి చదువుతోంది. గురువారం పాఠశాలలకు సెలవుదినం కావడంతో బాలిక ఇంటివద్ద ఆడుకుంటోంది. ఇంటి సమీపంలో ఉన్న ముగ్గురు యువకులు జామకాయ ఇస్తామని చెప్పి చిన్నారిని ఇంట్లోకి తీసుకెళ్లి దారుణానికి పాల్పడ్డారు. ఆ బాలిక కేకలు వేయడంతో ఇంట్లోనుంచి ఆ ముగ్గురు పారిపోయారు. ఇంటికి వచ్చిన తన తాతకు చిన్నారి జరిగిన విషయాన్ని విలపిస్తూ చెప్పింది. బాలిక తాత ఫిర్యాదు మేరకు నిర్భయచట్టం కింద కేసునమోదు చేసినట్లు సీఐ తెలిపారు. అయితే లైంగికదాడికి ఒడిగట్టిన వారిలో ఒకరు 9వ తరగతి, మరొకరు ఇంటర్ చదువుతున్నారు. మరొకరికి 14 ఏళ్లు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. వీరిని పోలీస్‌స్టేషన్‌కు తీసుకువచ్చారు. దోరేపల్లిలో పెళ్లిపేరుతో మోసం మద్దూరు, న్యూస్‌లైన్: మండలంలోని దోరేపల్లి గ్రామంలో గత కొంతకాలంగా ఓ మైనర్ బాలిక(15)ను పెళ్లిపేరుతో మోసంచేసిన వ్యక్తిపై శుక్రవారం కేసునమోదు చేశారు. ఎస్ఐ కథనం మేరకు.. గ్రామానికి చెందిన వెంకటప్ప అదే గ్రామానికి చెందిన మైనర్ బాలికను కొంతకాలంగా ప్రేమ, పెళ్లిపేరుతో మోసంచేశాడు. ఈ విషయం ఇంట్లో తెలియడంతో బాధితురాలి తండ్రి వివాహం చేసుకోవాలని వెంకటప్పను కోరారు. అందుకు అతడు నిరాకరించడంతో పోలీసులకు ఫిర్యాదుచేయగా, నిందితుడిపై కేసునమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్ఐ ఫర్హాద్హుసేన్ తెలిపారు.