వేర్వేరు చోట్ల ఇద్దరు బాలికలపై లైంగికదాడి | three boys sexual attacks on girls | Sakshi
Sakshi News home page

వేర్వేరు చోట్ల ఇద్దరు బాలికలపై లైంగికదాడి

Published Sat, Dec 7 2013 5:30 AM | Last Updated on Sat, Sep 2 2017 1:22 AM

three boys sexual attacks on girls

కల్వకుర్తి, న్యూస్‌లైన్:  ఓ బాలికపై ముగ్గురు యువకులు కలిసి లైంగికదాడికి ఒడిగట్టారు. స్థానికంగా సంచలనం రేకెత్తించిన ఈ ఘటన శుక్రవారం మండలంలోని తుర్కలపల్లి గ్రామంలో వెలుగుచూసిం ది. కల్వకుర్తి సీఐ భిక్షపతిరావు వివరాల ను వెల్లడించారు. తుర్కలపల్లి గ్రామం లో ఓ చిన్నారి తన అమ్మమ్మ ఇంటివద్ద ఉంటూ రెండోతరగతి చదువుతోంది. గురువారం పాఠశాలలకు సెలవుదినం కావడంతో బాలిక ఇంటివద్ద ఆడుకుంటోంది. ఇంటి సమీపంలో ఉన్న ముగ్గురు యువకులు జామకాయ ఇస్తామని చెప్పి చిన్నారిని ఇంట్లోకి తీసుకెళ్లి దారుణానికి పాల్పడ్డారు.

ఆ బాలిక కేకలు వేయడంతో ఇంట్లోనుంచి ఆ ముగ్గురు పారిపోయారు. ఇంటికి వచ్చిన తన తాతకు చిన్నారి జరిగిన విషయాన్ని విలపిస్తూ చెప్పింది. బాలిక తాత ఫిర్యాదు మేరకు నిర్భయచట్టం కింద కేసునమోదు చేసినట్లు సీఐ తెలిపారు. అయితే లైంగికదాడికి ఒడిగట్టిన వారిలో ఒకరు 9వ తరగతి, మరొకరు ఇంటర్ చదువుతున్నారు. మరొకరికి 14 ఏళ్లు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. వీరిని పోలీస్‌స్టేషన్‌కు తీసుకువచ్చారు.
 దోరేపల్లిలో పెళ్లిపేరుతో మోసం
 మద్దూరు, న్యూస్‌లైన్: మండలంలోని దోరేపల్లి గ్రామంలో గత కొంతకాలంగా ఓ మైనర్ బాలిక(15)ను పెళ్లిపేరుతో మోసంచేసిన వ్యక్తిపై శుక్రవారం కేసునమోదు చేశారు. ఎస్‌ఐ కథనం మేరకు.. గ్రామానికి చెందిన వెంకటప్ప అదే గ్రామానికి చెందిన మైనర్ బాలికను కొంతకాలంగా ప్రేమ, పెళ్లిపేరుతో మోసంచేశాడు. ఈ విషయం ఇంట్లో తెలియడంతో బాధితురాలి తండ్రి వివాహం చేసుకోవాలని వెంకటప్పను కోరారు. అందుకు అతడు నిరాకరించడంతో పోలీసులకు ఫిర్యాదుచేయగా, నిందితుడిపై కేసునమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్‌ఐ ఫర్హాద్‌హుసేన్ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement