రాడ్లతో కొట్టి, నోట్లో గుడ్డలు కుక్కి అత్యాచారం | rape attempt on minar girl like nirbhaya in hyderabad | Sakshi
Sakshi News home page

నిర్భయ తరహా ఘటన

Published Sun, Feb 18 2018 3:00 PM | Last Updated on Wed, Oct 17 2018 5:51 PM

rape attempt on minar girl like nirbhaya in hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : సికింద్రాబాద్‌లో నిర్భయ కంటే దారుణమైన అత్యాచార ఘటన చోటు చేసుకుంది. తోమ్మిదో తరగతి చదువుతున్న ఓ 15 ఏళ్ల బాలికను పైశాచికంగా కబళించిన మృగాలు. స్నేహితుని వద్దకు వెళ్లి తిరిగి ఇంటికి వస్తున్న సమయంలో ఓ ఆర్మీ జవాన్ కూతురిపై గుత్తుతెలియని దుండగులు అడ్డగించారు. అనంతరం చెట్ల పొదల్లోకి లాక్కెళ్లి అరవకుండా రాడ్డుతో కొట్టి, నోట్లో గుడ్డలు కుక్కి అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. 

స్పృహ కోల్పోయి ఉన్న బాలికను గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. అయితే స్నేహితుడే అత్యాచారానిక పాల్పడ్డాడా.. లేక గుర్తు తెలియని వ్యక్తులు చేశారా.? అనే విషయం ఇంకా తెలియదు. ఈ సంఘటన జరిగి  రెండు నెలలు అయింది. అయినా ఈ దారుణానికి పాల్పడ్డ వారిని ఇప్పటికీ పోలీసులు అరెస్టు చేయలేదని సమాచారం. దీనిపై పోలీసులు నిర్లక్ష్యం వహిస్తున్నారని బాధితురాలి కుటుంబ సభ్యులు చెబుతున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement