వ్యక్తిని హత్య చేసి రూ. 6 లక్షలతో పరారీ | Man murdered in chittoor district | Sakshi
Sakshi News home page

వ్యక్తిని హత్య చేసి రూ. 6 లక్షలతో పరారీ

Published Thu, Sep 10 2015 9:08 AM | Last Updated on Wed, Aug 29 2018 8:36 PM

Man murdered in chittoor district

చిత్తూరు : వ్యాపారం కోసం ఇంట్లోని నగదును తీసుకుని వెళ్తున్న వ్యక్తిని ఆగంతకులు ఉరి వేసి హతమర్చి అతని వద్దనున్న రూ. 6 లక్షలతో ఉడాయించారు. ఈ సంఘటన చిత్తూరు జిల్లా బెరైడ్డిపల్లి మండలం కమ్మనపల్లి గ్రామంలో గురువారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. పోలీసులు కథనం ప్రకారం ... గ్రామానికి చెందిన వెంకటప్ప (68) గొర్రెల విక్రయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు.

ఆ క్రమంలో ఈ రోజు తెల్లవారుజామునే ఇంట్లో నుంచి రూ. 6 లక్షలు తీసుకొని గొర్లను కొనుక్కొని రావడానికి గుంటూరు బయలుదేరాడు. అయితే గ్రామ శివారులోని గురుకుల పాఠశాల వద్దనున్న చెట్టుకు వెంకటప్ప ఉరేసుకొని వేళాడుతూ కనిపించడంతో.. స్థానికులు కుటుంబ సభ్యలకు తెలిపారు. దాంతో కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు.

పోలీసులకు ఘటనా స్థలానికి చేరుకుని వెంకటప్ప మృతదేహన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్ట్మార్టం నిమిత్తం మృతదేహన్ని చిత్తూరు తరలించారు. కాగా.. నగదు కోసమే ఈ హత్య చేసి ఉంటారని కుటుంబసభ్యులు భావిస్తున్నారు. అయితే ఆత్మహత్యలా కనిపించడం కోసం ఆగంతకులు వెంకట్టప్పకు ఉరేసి ఉంటారని పోలీసులు వద్ద ఆరోపించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement