ఇంట్లో గొడవల కారణంగా ఓ 11 ఏళ్ల బాలుడు తన తండ్రి, తాతను తుపాకీతో కాల్చాడు.
చికాగో: అమెరికాలో విచ్చలవిడి తుపాకీ సంస్కృతికి మనుషులు పిట్టల్లా రాలిపోతున్నారు. ఇంట్లో గొడవల కారణంగా ఓ 11 ఏళ్ల బాలుడు తన తండ్రి, తాతను తుపాకీతో కాల్చాడు. తాత అక్కడికక్కడే మరణించగా, తండ్రి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఉత్తర కరోలినాలో సోమవారం రాత్రి ఈ సంఘటన జరిగింది.
లాయిడ్ వుడ్లీఫ్ (84) తన కొడుకు లాయిడ్ పీటన్ వుడ్లీఫ్ (49) ఇంట్లో ఉంటున్నాడు. ఇంట్లో ఘర్షణ జరగడంతో కాల్పులు జరిగినట్టు అధికారులు చెప్పారు. ఫోన్ కాల్ రావడంతో పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లారు. పీటన్ తీవ్రంగా గాయపడగా, లాయిడ్ అప్పటికే మరణించాడు. 11 ఏళ్ల పిల్లాడే తుపాకీతో కాల్చినట్టు ప్రాథమిక విచారణలో తేలింది. అయితే ఫిర్యాదు చేయకపోవడంతో కేసు నమోదు చేయలేదు.