పొరపాటున ట్రిగ్గర్ లాగిన చిన్నారి.. | US Toddler Dies After Accidentally Shooting Himself in Head | Sakshi
Sakshi News home page

పొరపాటున ట్రిగ్గర్ లాగిన చిన్నారి..

Published Thu, May 28 2015 10:30 AM | Last Updated on Thu, Apr 4 2019 5:12 PM

పొరపాటున  ట్రిగ్గర్ లాగిన చిన్నారి.. - Sakshi

పొరపాటున ట్రిగ్గర్ లాగిన చిన్నారి..

వాషింగ్టన్ :  అమెరికాలో తల్లిదండ్రుల నిర్లక్ష్యం.. ఓ చిన్నారి ప్రాణాన్ని బలిగొంది.  బొమ్మ అనుకొని చేతి తుపాకీతో  ఆడుకుంటున్న సమయంలో ప్రమాదవశాత్తూ అది  పేలడంతో రెండేళ్ల బాలుడు  ప్రాణాలు  పోగొట్టుకున్నాడు. వర్జీనియాలో బుధవారం ఈ సంఘటన చోటు చేసుకుంది. తల్లిదండ్రులతో పాటు సౌత్ వర్జీనియాలోని సొంత ఇంటికి చూడ్డానికి వెళ్లిన బాలుడు దురదృష్టవశాత్తూ తన  ప్రాణాలు తానే తీసుకున్నాడు.  

బెడ్ రూంలో ఒంటరిగా ఉన్న బాలుని  దృష్టి  అక్కడే  లోడ్ చేసి వున్న  హ్యాండ్ గన్ పై పడింది. దాంతో ఆడుకుంటూ తలపై  పెట్టుకున్నాడు.  పొరపాటున ట్రిగ్గర్ లాగడంతో అది పేలి తీవ్ర గాయాలపాలయ్యాడు.   వెంటనే  ఆ బాలుడిని రిచమండ్లోని ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకపోయింది.  చికిత్స పొందుతూ బాలుడు చనిపోయాడు.

ఈ సంఘటనపై అమెరికాలో పెరుగుతున్న గన్ గల్చర్కి వ్యతిరేకంగా పోరాడుతున్నవారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.   ఇటువంటి  ప్రమాదాల్లో   సగటున ప్రతి ఏడాదికి 17 ఏళ్ల లోపు వయసుగల  పిల్లలు దాదాపు 100 మంది  చనిపోతున్నారని తెలిపారు.  దీనిపై ప్రభుత్వం తగిన  చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement