Boy Playing With Gun Fatally Shoots Pregnant Mother In US - Sakshi
Sakshi News home page

గన్‌తో రెండేళ్ల చిన్నారి ఆటలు.. గర్భంతో ఉన్న తల్లి కడుపులోకి బుల్లెట్ దించేశాడు..

Jun 24 2023 3:14 PM | Updated on Jun 24 2023 8:47 PM

Boy Playing With Gun Fatally Shoots Pregnant Mother In US - Sakshi

అమెరికాలోని ఒహాయో రాష్ట్రంలో దారుణ ఘటన జరిగింది. గన్‌తో ఆటలాడుతూ ప్రెగ్నెంట్‌గా ఉన్న అమ్మ(31) కడుపులోకి బుల్లెట్ దించేశాడు ఓ రెండేళ్ల చిన్నారి. దీంతో ఎనిమిది నెలల గర్బంతో ఉన్న తల్లి ప్రాణాలు కోల్పోయింది. 

ఇంట్లో ఆటలాడుతూ తండ్రి బెడ్‌ రూమ్‌లోకి వెళ్లాడు రెండేళ్ల చిన్నారి. లాకర్‌లో ఉన్న గన్‌ను ఆటబొమ్మ అనుకుని తీసుకున్నాడు. సినిమాల్లో చూసిన మాదిరే ఆటలాడసాగాడు. ఇతర గదిలో పనిలో ఉన్న అమ్మ(లారా ఐగా) వద్దకు వచ్చి పిస్టల్‌ను పేల్చేశాడు. తల్లి అరుపులతో తల్లిడిల్లిపోగా పిల్లాడు కూడా ఏడవడం ప్రారంభించాడు. కొనప్రాణాలతో ఉన్న బాధితురాలు భర్తకు ఫోన్ చేసింది. ఆ తర్వాత పోలీసులు రంగంలోకి దిగి ఆమెను ఆస్పత్రికి తీసుకువెళ్లారు. 

ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటూ బాధితురాలు మృతి చెందింది. తన పిల్లాడే ఆటబొమ్మ అనుకుని గన్‌తో కాల్చాడని  ఆస్పత్రికి వెళ్లే క్రమంలో పోలీసులకు బాధితురాలు వెల్లడించింది. గన్‌లో 12 రౌండ్స్ బుల్లెట్లు లోడ్ చేసి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. గన్‌ను పిల్లలకు అందకుండా జాగ్రత్తగా ఉంచుకోవాలని తెలిపారు. ఈ ఘటనపై ఎలాంటి కేసు నమోదు చేయలేదు. అయినప్పటికీ పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తామని పోలీసులు తెలిపారు.  

ఇదీ చదవండి: అందం కోసం కొత్త దంతాలు.. ‘షార్క్‌’లా మారిన యువకుడు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement