Pregnant mother
-
గన్‌తో ఆటలాడుతూ గర్భంతో ఉన్న అమ్మ కడుపులోకి బుల్లెట్ దించేసి..!
అమెరికాలోని ఒహాయో రాష్ట్రంలో దారుణ ఘటన జరిగింది. గన్‌తో ఆటలాడుతూ ప్రెగ్నెంట్‌గా ఉన్న అమ్మ(31) కడుపులోకి బుల్లెట్ దించేశాడు ఓ రెండేళ్ల చిన్నారి. దీంతో ఎనిమిది నెలల గర్బంతో ఉన్న తల్లి ప్రాణాలు కోల్పోయింది. ఇంట్లో ఆటలాడుతూ తండ్రి బెడ్ రూమ్‌లోకి వెళ్లాడు రెండేళ్ల చిన్నారి. లాకర్లో ఉన్న గన్ను ఆటబొమ్మ అనుకుని తీసుకున్నాడు. సినిమాల్లో చూసిన మాదిరే ఆటలాడసాగాడు. ఇతర గదిలో పనిలో ఉన్న అమ్మ(లారా ఐగా) వద్దకు వచ్చి పిస్టల్‌ను పేల్చేశాడు. తల్లి అరుపులతో తల్లిడిల్లిపోగా పిల్లాడు కూడా ఏడవడం ప్రారంభించాడు. కొనప్రాణాలతో ఉన్న బాధితురాలు భర్తకు ఫోన్ చేసింది. ఆ తర్వాత పోలీసులు రంగంలోకి దిగి ఆమెను ఆస్పత్రికి తీసుకువెళ్లారు. ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటూ బాధితురాలు మృతి చెందింది. తన పిల్లాడే ఆటబొమ్మ అనుకుని గన్‌తో కాల్చాడని ఆస్పత్రికి వెళ్లే క్రమంలో పోలీసులకు బాధితురాలు వెల్లడించింది. గన్‌లో 12 రౌండ్స్ బుల్లెట్లు లోడ్ చేసి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. గన్ను పిల్లలకు అందకుండా జాగ్రత్తగా ఉంచుకోవాలని తెలిపారు. ఈ ఘటనపై ఎలాంటి కేసు నమోదు చేయలేదు. అయినప్పటికీ పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తామని పోలీసులు తెలిపారు. ఇదీ చదవండి: అందం కోసం కొత్త దంతాలు.. ‘షార్క్’లా మారిన యువకుడు! -
ఇద్దరు కూతుళ్లతో గర్భిణీ ఆత్మహత్య
సాక్షి, మహబూబ్‌నగర్: జిల్లాలో విషాదం వెలుగు చూసింది. కుటుంబ కలహాలతో ఓ గర్భిణీ తన ఇద్దరు కూతుళ్లతో ఆత్మహత్యకు పాల్పడింది. మంగళవారం గద్వాల నుంచి బీరెల్లికి వెల్లే దారిలో ఉన్న జూరాల కాలువలో దూకేసింది. ఓ చిన్నారి మృత దేహాం లభ్యం కాగా మిగతా ఇద్దరి కోసం స్థానికులు గాలిస్తున్నారు. గల్లంతైన వారు తూర్పు దౌదర్ పల్లెకు చెందిన వారుగా భావిస్తున్నారు. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
స్వైన్‌ఫ్లూ సోకిన గర్భిణికి విజయవంతంగా కాన్పు
న్యూఢిల్లీ: స్వైన్‌ఫ్లూ వ్యాధి సోకిన ఓ 28 ఏళ్ల గర్భిణికి స్థానిక వైద్యులు విజయవంతంగా కాన్పు చేశారు. అలాగే స్వైన్‌ఫ్లూ నుంచి ఆ మహిళ బయట పడినట్లు వైద్యులు తెలిపారు. ‘సాధారణ గర్భిణులతో పోలిస్తే స్వైన్‌ఫ్లూ సోకిన మహిళకు, కడుపులోని శిశువుకు ప్రాణాపాయం ఎక్కువ. 10 శాతం కేసులు మాత్రమే ఇలా విజయవంతం అవుతాయి’ అని వైద్య నిపుణులు అభిప్రాయపడ్డారు. ‘జనవరి 25న గంగారాం ఆసుపత్రిలో ఆమె చేరింది. దగ్గు, జ్వరం, శ్వాసం తీసుకోవడంలో ఇబ్బంది వంటి వాటితో బాధపడుతుండటంతో వైద్య పరీక్షలు చేయగా ఆమెకు న్యుమోనియా అని, ఆక్సిజన్ తీసుకోవడంలో చాలా ఇబ్బంది పడుతున్నట్లు తేలింది. దీంతో స్వైన్‌ఫ్లూ నిరోధక వ్యాక్సిన్ ‘టామిఫ్లూ’ను ఆ మహిళకు ఇవ్వడం ప్రారంభించాం. దీంతో చాలా జాగ్రత్తగా వ్యవహరించి కాన్పు చేశాం. ఢిల్లీలో ఇప్పటి వరకు 1,608 కేసులు నమోదవగాగా, ఈ ఆస్పత్రిలో గత డిసెంబర్ 26న ఈ వ్యాధితో ఒక వ్యక్తి చనిపోయాడు’ అని గంగా రాం ఆస్పత్రి ఛాతీ విభాగం చైర్పర్సన్ ఆరుప్ బసు తెలిపారు. ‘తల్లీ బిడ్డను ఎలా రక్షించాలనే డైలమా ఏర్పడింది. శిశువుకు ఇంకా నెలలు నిండలేదు. తల్లి ఆక్సిజన్ పీల్చుకోడానికి ఇబ్బంది పడుతోంది. గర్భం దాల్చిన 32 వారాల లోపల కాన్పు చేస్తే శిశువు ప్రాణానికి ముప్పు. కానీ, విజయవంతంగా ఆపరేషన్ చే సి తల్లీ బిడ్డను రక్షించాం. త్వరలోనే డిశ్చార్జ్ చేస్తాం’ అని ’ అని బసు అన్నారు.