న్యూఢిల్లీ: స్వైన్‌ఫ్లూ వ్యాధి సోకిన ఓ 28 ఏళ్ల గర్భిణికి స్థానిక వైద్యులు విజయవంతంగా కాన్పు చేశారు. అలాగే స్వైన్‌ఫ్లూ నుంచి ఆ మహిళ బయట పడినట్లు వైద్యులు తెలిపారు. ‘సాధారణ గర్భిణులతో పోలిస్తే స్వైన్‌ఫ్లూ సోకిన మహిళకు, కడుపులోని శిశువుకు ప్రాణాపాయం ఎక్కువ. 10 శాతం కేసులు మాత్రమే ఇలా విజయవంతం అవుతాయి’ అని వైద్య నిపుణులు అభిప్రాయపడ్డారు. ‘జనవరి 25న గంగారాం ఆసుపత్రిలో ఆమె చేరింది. దగ్గు, జ్వరం, శ్వాసం తీసుకోవడంలో ఇబ్బంది వంటి వాటితో బాధపడుతుండటంతో వైద్య పరీక్షలు చేయగా ఆమెకు న్యుమోనియా అని, ఆక్సిజన్ తీసుకోవడంలో చాలా ఇబ్బంది పడుతున్నట్లు తేలింది. దీంతో స్వైన్‌ఫ్లూ నిరోధక వ్యాక్సిన్ ‘టామిఫ్లూ’ను ఆ మహిళకు ఇవ్వడం ప్రారంభించాం. దీంతో చాలా జాగ్రత్తగా వ్యవహరించి కాన్పు చేశాం. ఢిల్లీలో ఇప్పటి వరకు 1,608 కేసులు నమోదవగాగా, ఈ ఆస్పత్రిలో గత డిసెంబర్ 26న ఈ వ్యాధితో ఒక వ్యక్తి చనిపోయాడు’ అని గంగా రాం ఆస్పత్రి ఛాతీ విభాగం చైర్‌పర్సన్ ఆరుప్ బసు తెలిపారు. ‘తల్లీ బిడ్డను ఎలా రక్షించాలనే డైలమా ఏర్పడింది. శిశువుకు ఇంకా నెలలు నిండలేదు. తల్లి ఆక్సిజన్ పీల్చుకోడానికి ఇబ్బంది పడుతోంది. గర్భం దాల్చిన 32 వారాల లోపల కాన్పు చేస్తే శిశువు ప్రాణానికి ముప్పు. కానీ, విజయవంతంగా ఆపరేషన్ చే సి తల్లీ బిడ్డను రక్షించాం. త్వరలోనే డిశ్చార్జ్ చేస్తాం’ అని ’ అని బసు అన్నారు.
స్వైన్‌ఫ్లూ సోకిన గర్భిణికి విజయవంతంగా కాన్పు
Published Tue, Feb 17 2015 11:02 PM | Last Updated on Sat, Sep 2 2017 9:29 PM
Advertisement