US Police
-
మెక్సికో డ్రగ్ లార్డ్ అరెస్ట్
వాషింగ్టన్: మెక్సికోలో మాదకద్రవ్యాల వ్యాపారంతో వేలకోట్ల రూపాయల నేరసామ్రాజ్యాన్ని విస్తరించిన డ్రగ్ లార్డ్ ఇస్మాయిల్ ‘ఎల్ మాయో’ జంబాడా గార్షియా ఎట్టకేలకు అమెరికా పోలీసులకు చిక్కాడు. 76 ఏళ్ల జంబాడా వాస్తవానికి విమానంలో వేరే ప్రాంతానికి వెళ్లాల్సి ఉండగా అతనికి తెలీకుండా చాకచక్యంగా ప్రైవేట్ విమానాన్ని అమెరికాలో ల్యాండ్ చేశారు. గురువారం టెక్సాస్ రాష్ట్రంలోని ఎల్ పాసో సిటీ శివారులోని చిన్న ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ అయిన అదే విమానంలో ఉన్న డ్రగ్ లార్డ్ ఎల్‌చాపో కుమారుడు జోక్విన్ ‘ఎల్ చాపో’ గుజ్మాన్(38)నూ పోలీసులు అరెస్ట్‌చేసి గుర్తుతెలియని ప్రాంతానికి తీసుకెళ్లి విచారిస్తున్నారు. దశాబ్దాలుగా జంబాడా అరెస్ట్‌కోసం అమెరికా ప్రయతి్నస్తోంది. అతని జాడ చెప్తే రూ.125 కోట్ల నజరానా ఇస్తామని గతంలో ప్రకటించింది. ‘అమెరికాలోకి వందల కోట్ల డాలర్ల విలువైన ఫెంటానిల్, మెథాంఫెటమైన్ డ్రగ్స్‌ను సరఫరా చేస్తూ అమెరికా యువతను మాదకద్రవ్యాల మత్తులో ముంచేసిన నేరానికి వీరికి కఠిన శిక్ష పడనుంది’ అని ఎఫ్‌బీఐ డైరెక్టర్ క్రిస్టఫర్ అన్నారు. రియల్ఎస్టేట్ వ్యాపార నిమిత్తం వెళ్తున్నామని అబద్దం చెప్పి జంబాడాను జోక్విన్ గుజ్మానే విమానం ఎక్కించాడని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. అత్యంత హింసాత్మక, శక్తివంత ‘ సినోలా కార్టెల్’ మాదకద్రవ్యాల అక్రమ తయారీ, ఎగుమతికి ప్రపంచ కేంద్రస్థానంగా నిలిచే మెక్సికోలో అత్యంత హింసాత్మక, శక్తివంతమైన డ్రగ్స్ ముఠాల్లో సినోలా కార్టెల్ కూడా ఒకటి. దీనిని ఎల్ చాపో గుజ్మాన్, జంబాడా, మరొకరు సంయుక్తంగా స్థాపించి డ్రగ్స్‌ను విచ్చలవిడిగా అమ్మడం మొదలెట్టారు. వందల కోట్ల డ్రగ్స్ సామ్రాజ్యానికి అధిపతిగా కొనసాగిన జాక్విన్ అర్చివాల్డో గుజ్మాన్ లోయెరా (ఎల్‌చాపో)ను 2019లో మెక్సికో ప్రభుత్వం అరెస్ట్‌చేసి అమెరికాకు అప్పగించడంతో అక్కడే జీవితకాలకారాగార శిక్ష అనుభవిస్తున్నారు. దీంతో ఎల్ చాపో కుమారులు రంగంలోకి దిగి అక్రమ వ్యాపారాన్ని మరింత విస్తరించారు. అమెరికా సహా విదేశాలకు సరకు అక్రమ రవాణా మొత్తం జంబాడా కనుసన్నల్లో జరుగుతోంది. ప్రత్యర్థి డ్రగ్స్ ముఠా సభ్యులు చిక్కితే వారి తల నరకడం, చర్మం ఒలిచేయడం, శరీరాన్ని ముక్కలుగా నరకడం వంటి హేయమైన నేరాలకు పాల్పడటం అక్కడి ముఠాలకు మామూలు విషయం. -
కేసులతో సంబంధమే లేదు.. పోలీసులను చూడగానే పరుగందుకుని..
వాషింగ్టన్: పోలీసులను రక్షకభటులని అంటారు. కానీ దొంగల కంటే వారిని చూస్తేనే ఎక్కువగా భయపడుతుంటారు జనం. ఆ భయమే అమెరికాలో ఓ అభాగ్యుడిని పొట్టనబెట్టుకుంది. పోలీసులు ఎందుకు వచ్చారో ఏంటో తెలుసుకోకుండా వారు కనపడగానే భయంతో పరిగెత్తుకుంటూ వెళ్లి కన్నింగ్ హాం సరస్సులోకి దూకేశాడు. కొద్దిసేపు ఈత కొట్టే ప్రయత్నం చేసిన అతను చూస్తుండగానే నీటమునిగిపోయాడు. గ్రీన్విల్లే కౌంటీ పోలీసు అధికారులు బెయిలుపై ఉన్న ఒక వ్యక్తికి అరెస్ట్ వారెంట్ జారీ కావడంతో నిందితుడిని అదుపులోకి తీసుకునేందుకు కన్నింగ్ హాం రోడ్డులోని ఒక ఇంటిలోకి వెళ్లారు. ఆ సమయంలో అక్కడున్నాడు చక్ గిల్బర్ట్ షెల్టన్ జూనియర్ (38). కేసుతో అసలు ఏమాత్రం సంబంధం లేని అతడు పోలీసులను చూస్తూనే పరుగందుకున్నాడు. అది చూసి బిత్తరపోయిన పోలీసులు వాడెందుకు పరిగెడుతున్నాడన్న డైలమాలో ఉండిపోయారు. అంతలోనే గిల్బర్ట్ షెల్టన్ దగ్గర్లో ఉన్న కన్నింగ్ హాం సరస్సులోకి దూకేశాడు. ఒడ్డు నుండి 15-20 అడుగుల దూరం ఈత కొట్టుకుంటూ వెళ్లిన షెల్టన్ క్రమక్రమంగా మునిగిపోయాడు. వెంటనే గ్రీన్విల్లే పోలీసులు, స్థానిక ఈతగాళ్లు కొందరు కాలువలోకి దూకి వెతికినా ప్రయోజనం లేకపోయింది. సుదీర్ఘంగా కొనసాగిన గాలింపుల తర్వాత అతడి మృతదేహాన్ని వెలికితీశారు. అతను ఎందుకు పారిపోయాడు? అతడిపై నేరారోపణలు ఏమైనా ఉన్నాయా? అన్న కోణంలో విచారణ చేస్తున్నారు పోలీసులు. ఏదైతేనేం భయం దెయ్యం కంటే చెడ్డదని మరోసారి రుజువైంది. ఇది కూడా చదవండి: ఖలిస్థానీల ముసుగులో అక్రమ వలసలు.. -
గన్‌తో ఆటలాడుతూ గర్భంతో ఉన్న అమ్మ కడుపులోకి బుల్లెట్ దించేసి..!
అమెరికాలోని ఒహాయో రాష్ట్రంలో దారుణ ఘటన జరిగింది. గన్‌తో ఆటలాడుతూ ప్రెగ్నెంట్‌గా ఉన్న అమ్మ(31) కడుపులోకి బుల్లెట్ దించేశాడు ఓ రెండేళ్ల చిన్నారి. దీంతో ఎనిమిది నెలల గర్బంతో ఉన్న తల్లి ప్రాణాలు కోల్పోయింది. ఇంట్లో ఆటలాడుతూ తండ్రి బెడ్ రూమ్‌లోకి వెళ్లాడు రెండేళ్ల చిన్నారి. లాకర్లో ఉన్న గన్ను ఆటబొమ్మ అనుకుని తీసుకున్నాడు. సినిమాల్లో చూసిన మాదిరే ఆటలాడసాగాడు. ఇతర గదిలో పనిలో ఉన్న అమ్మ(లారా ఐగా) వద్దకు వచ్చి పిస్టల్‌ను పేల్చేశాడు. తల్లి అరుపులతో తల్లిడిల్లిపోగా పిల్లాడు కూడా ఏడవడం ప్రారంభించాడు. కొనప్రాణాలతో ఉన్న బాధితురాలు భర్తకు ఫోన్ చేసింది. ఆ తర్వాత పోలీసులు రంగంలోకి దిగి ఆమెను ఆస్పత్రికి తీసుకువెళ్లారు. ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటూ బాధితురాలు మృతి చెందింది. తన పిల్లాడే ఆటబొమ్మ అనుకుని గన్‌తో కాల్చాడని ఆస్పత్రికి వెళ్లే క్రమంలో పోలీసులకు బాధితురాలు వెల్లడించింది. గన్‌లో 12 రౌండ్స్ బుల్లెట్లు లోడ్ చేసి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. గన్ను పిల్లలకు అందకుండా జాగ్రత్తగా ఉంచుకోవాలని తెలిపారు. ఈ ఘటనపై ఎలాంటి కేసు నమోదు చేయలేదు. అయినప్పటికీ పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తామని పోలీసులు తెలిపారు. ఇదీ చదవండి: అందం కోసం కొత్త దంతాలు.. ‘షార్క్’లా మారిన యువకుడు! -
పోలీసు ఓవరాక్షన్.. విద్యార్థిని మెడపై మోకాలితో నొక్కి, చేతులను కట్టి..
వాషింగ్టన్: సెక్యూరిటీగా పని చేసే ఆఫ్ డ్యూటీ పోలీసు అధికారి పాఠశాలలో చదువుతున్న విద్యార్థిని పట్ల అమానుషంగా ప్రవర్తించాడు. ఆమె మెడపై మెకాలును నొక్కి పెట్టి మైనర్‌ను హింసించాడు. ఈ దారుణ ఘటన అమెరికాలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. విస్కాన్సిన్లోని కెనోషా పాఠశాలలో మధ్యాహ్నం లంచ్ బ్రేక్‌లో విద్యార్థిని(12) మరో బాలుడితో గొడవ పడుతోంది. అది చూసిన ఆఫ్ డ్యూటీ పోలీసు అధికారి షాన్ గుట్షో అక్కడికి వెళ్లాడు. గొడవలో ఆమె ఆపే ప్రయత్నం చేశాడు. ఇంతలో ఆమె సదరు పోలీసులను వెనక్కి నెట్టి వేసింది. తిరిగి లేచిన అతడు విద్యార్థిని అడ్డుకున్నాడు. ఆ సమయంలో ఆమె ఆవేశంతో ఊగిపోతుండగా.. విద్యార్థిని నియంత్రించే క్రమంలో షాన్ గుట్షో దురుసుగా ప్రవర్తించాడు. దీనికి సంబంధించి సీసీ టీవీ ఫుటేజీని స్కూల్ యాజమాన్యం విడుదల చేసింది. విద్యార్థిని కింద పడేసి ఆమె కదలకుండా చేతులు కట్టేసి, ఆమె మెడపై మోకాలితో నొక్కి పెట్టి నియంత్రించాడు. దాదాపు అర నిమిషంపాటు ఇలా మోకాలు ఉంచటంతో విద్యార్థిని గాయపడింది. కాగా, ఈ ఘటనకు సంబంధించి గుట్షోపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని బాలిక తండ్రి స్కూల్ యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. ఈ దాడి కారణంగా తన కూతురికి గాయాలు అయ్యాయని పేర్కొన్నాడు. కాగా, ఈ ఘటన తర్వాత అతడు తన సెక్యూరిటీ ఉద్యోగానికి రాజీనామా చేసినట్లు తెలిసింది. -
అమెరికాలో కాల్పులు... ఐదుగురికి గాయాలు
లాస్ఏంజెల్స్: యూఎస్ కొలరాడాలో అరోరా నగరంలోని సెంట్రల్ హైస్కూల్ సమీపంలో జరిగిన కాల్పుల్లో ఐదుగురు యువకులు గాయపడినట్లు అరోరా పోలీసులు తెలిపారు. అయితే అనుమానితుడు ఎవరు ఆ సమయంలో ఉన్నట్లు కనిపించలేదని అన్నారు. ఈ మేరకు సంఘటన పాఠశాల లోపల జరగలేదని పార్క్ వద్ద జరిగిందన్నారు. (చదవండి: జిమ్‌లో అసభ్య ప్రవర్తన... టిక్‌టాక్ షేర్ చేయడంతో పరార్!!) అంతేకాదు పార్క్‌కి సంబంధించిన సీసీపుటేజ్ కెమరాలను కూడా పరిశీలిస్తున్నట్టుల తెలిపారు. పైగా హైస్కూల్‌కి సంబంధించిన కార్ పార్కింగ్‌లో అత్యవసర వాహనాలు కూడా ఉన్నాయని, ఈ ఘటన జరిగినే వెంటనే అక్కడ పెద్ద సంఖ్యలో జనం గుమిగూడినట్లు పోలీసలు చెప్పారు. అయితే కొలరాడో తుపాకీ హింసకు కొత్తేమీ కాదు. పైగా యూఎస్ చరిత్రలో అత్యంత అపఖ్యాతి పాలైన రెండు సాముహిక కాల్పలు ఈ ప్రాంతంలోనే జరిగిన సంగతి తెలిసిందే. (చదవండి: యూకే లివర్‌పూల్ నగరంలో కారు బ్లాస్ట్... ఒకరు మృతి) -
పోలీసు సంస్కరణలకు ట్రంప్ ఓకే
వాషింగ్టన్: ఆఫ్రికన్ అమెరికన్ జార్జ్ ఫ్లాయిడ్ మరణంతో కొద్ది వారాల పాటు జాతి వివక్షకు వ్యతిరేకంగా అగ్రరాజ్యం నిరసనలతో హోరెత్తిపోవడంతో ట్రంప్ ప్రభుత్వం పోలీసు శాఖలో భారీ సంస్కరణలను చేపట్టింది. అమెరికా పోలీసులు మరింత బాధ్యతా యుతంగా ప్రవర్తించేలా సంస్కరణలు తెస్తూ రూపొందించిన కార్యనిర్వాహక ఉత్తర్వులపై రోజ్ గార్డెన్లో జరిగిన ఒక కార్యక్రమంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం చేశారు. అయితే దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన జాతి వివక్ష అంశంపై అందులో ఎలాంటి ప్రస్తావన లేదు. ఈ సంతకం చేసే కార్యక్రమానికి ముందు పోలీసుల దాష్టీకానికి బలైపోయిన నల్లజాతీయుల కుటుంబాలను ట్రంప్ వ్యక్తిగతంగా కలుసుకున్నారు. వారి కుటుంబ సభ్యుల మరణాల పట్ల విచారం వ్యక్తం చేశారు. ఆ తర్వాత పోలీసుల్ని కలుసుకున్న ట్రంప్ తన స్వరం మార్చారు. ప్రజలందరినీ సురక్షితంగా ఉంచడానికి రేయింబగళ్లు కష్టపడుతున్న పోలీసులకి గౌరవం ఇవ్వాలన్నారు. పోలీసు అధికారుల్లో అత్యధికులు నిస్వార్థంగా ప్రజాసేవ చేస్తారంటూ కొనియాడారు. -
డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు.. వ్యక్తిపై పోలీసు కాల్పులు
అట్లాంటా: డ్రంక్ అండ్ డ్రైవ్ ఆరోపణలపై ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకునే క్రమంలో పోలీసులు జరిపిన కాల్పుల్లో ఒక వ్యక్తి చనిపోయాడు. అమెరికాలోని అట్లాంటాలో శుక్రవారం ఈ ఘటన చోటుచేసుకుంది. వెండీ రెస్టారెంట్ వద్ద ఓ వ్యక్తి పార్కు చేసిన వాహనం కారణంగా ఇతర వినియోగదారులు ఇబ్బంది పడుతున్నారంటూ పోలీసులకు సమాచారం అందింది. అక్కడకు చేరుకున్న పోలీసులు కారులో ఉన్న వ్యక్తిని అదుపులోకి తీసుకునేందుకు యత్నించగా ప్రతిఘటించాడు. మద్యం మత్తులో ఉన్న ఆ వ్యక్తిని కట్టడి చేసేందుకు పోలీసులు టేజర్ (షాక్ కలిగించడం ద్వారా చేష్టలుడిగేలా చేయడం)ను ప్రయోగించేందుకు ప్రయత్నించారు. ఆ వ్యక్తి ఆ టేజర్‌ను కూడా లాగేసుకునేందుకు యత్నించాడు. ఈ సందర్భంగా జరిగిన పెనుగులాటలో పోలీసు అధికారి ఒకరు అగంతకుడిపైకి కాల్పులు జరిపాడు. ఆస్పత్రిలో చికిత్సపొందుతూ అతను మరణించాడు. -
‘చోక్‌హోల్డ్’ కూడా మంచిదే: ట్రంప్
వాషింగ్టన్: పోలీసులు అనుసరిస్తున్న వివాదాస్పద చోక్‌హోల్డ్(అనుమానితులను మెడపై మోకాలితో నొక్కి ఉంచడం) విధానంపై అధ్యక్షుడు ట్రంప్ తనదైన శైలిలో స్పందించారు. అనుమానితులను కట్టడి చేయడానికి పోలీసులు ఈ విధానం పాటించకుండా నిషేధం విధించాలనీ, అయితే, ప్రమాదకర పరిస్థితులు తలెత్తినప్పుడు ఈ విధానమే అవసరమవుతుందని వ్యాఖ్యానించారు. ఫాక్స్‌న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన..‘ఎవరైనా వ్యక్తి గొడవకు దిగినప్పుడు పోలీసు అధికారి అతనితో జాగ్రత్తగా ఉండాలి. చోక్‌హోల్డ్ పద్ధతి హాని చేయనిది, ఉత్తమమైంది. అయితే, కొన్ని సందర్భాల్లో ప్రాణాలు తీస్తుంది’ అని ట్రంప్ తెలిపారు. ఓడిపోతే ప్రశాంతంగా తప్పుకుంటా వచ్చే నవంబర్‌లో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో ఓటమి పాలైతే మనస్ఫూర్తిగా పదవి నుంచి తప్పు కోబోరంటూ వచ్చిన వార్తలు అబద్ధమని ట్రంప్ ఖండించారు. రెండోసారి తాను అధ్యక్ష పదవికి ఎన్నిక కాకుంటే దేశానికి నష్టమంటూ ఆయన వ్యాఖ్యానించారు. -
జార్జ్ ఫ్లాయిడ్ హత్య; నిందితుడికి బెయిల్
వాషింగ్టన్: అమెరికాను అతలాకుతలం చేసిన ఆఫ్రికన్–అమెరికన్ జార్జ్ ఫ్లాయిడ్ హత్యతో సంబంధం ఉన్న పోలీసు అధికారి డెరెక్ చౌవిన్‌కి మిన్నియాపాలిస్ కోర్టు న్యాయమూర్తి మిలియన్ డాలర్ల (ఇండియన్ కరెన్సీలో రూ.7,55,25,050.00) పూచీకత్తుతో బెయిల్ మంజూరు చేశారు. మే 25న జరిగిన ఘటనలో చౌవిన్, ఫ్లాయిడ్ మెడపై మోకాలుతో నొక్కి అతడి మరణానికి కారణమయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సోమవారం మిన్నెసోటా రాష్ట్ర కోర్టు వీడియో ద్వారా చౌవిన్‌కు రెండవ డిగ్రీ హత్య, మూడవ డిగ్రీ హత్య, నరహత్య నేరాలకు శిక్ష విధించింది. ఈ క్రమంలో హెన్నెపిన్ కౌంటీ డిస్ట్రిక్ట్ కోర్ట్ న్యాయమూర్తి జెన్నిస్ రెడింగ్, చౌవిన్‌కు షరతులుతో 1 మిలియన్ డాలర్ల పూచీకత్తుతో, షరతులు లేకుండా 1.25 మిలియన్ డాలర్ల పూచీకత్తుతో బెయిల్ మంజూరు చేశారు. చౌవిన్ వద్ద ఉన్న ప్రభుత్వ ఆయుధాలను తిరిగి ఇచ్చేయడమే కాక.. లా ఎన్ఫోర్స్మెంట్, సెక్యూరిటీ విభాగాల్లో పని చేయకూడదని కోర్టు ఆదేశించింది. అంతేకాక ఫ్లాయిడ్ కుటుంబంతో ఎలాంటి సంబంధం ఉండకూడదని హెచ్చరించింది. తదుపరి విచారణను ఈ నెల 29కి వాయిదా వేసింది. ఈ కేసులో చౌవిన్‌తో పాటు ఉన్న మరో ముగ్గురు పోలీసులు హత్యకు సహకరించారనే అభియోగం మీద స్థానిక జైలులో ఉన్నారు. (పోలీస్ విభాగం రద్దుకు మినియాపోలిస్ సిటీ కౌన్సిల్ తీర్మానం) -
ఆ పద్ధతి ప్రమాదకరం!
లీ పెక్(ఫ్రాన్స్): ఫ్లాయిడ్ హత్యతో ప్రపంచవ్యాప్తంగా పోలీసుల దాష్టీకాలు, అనుమానితులతో వారు వ్యవహరించే తీరు తీవ్ర చర్చనీయాంశమైంది. ఫ్లాయిడ్ విషాధ ఘటన జరిగిన మూడు రోజులకే ఫ్రాన్స్‌లోని పారిస్‌లోనూ అలాంటి ఘటనే చోటు చేసుకుంది. ఒక నిందితుడిని పోలీసులు రోడ్డుపై బోర్లా పడుకోబెట్టి, మెడపై మోకాలు ఆన్చి, చేతులకు సంకెళ్లు వేశారు. అరెస్ట్ చేయాలనుకునే వ్యక్తులను ఎటూ కదలకుండా ఉంచడం కోసం మోకాళ్లతో వారిని అణచిపెట్టడం ప్రపంచవ్యాప్తంగా పోలీసులంతా సాధారణంగా అనుసరించే విధానమే. అయితే, నిరాయుధులను, ఎలాంటి వ్యతిరేకత చూపని వారిని అలా నిర్బంధించడం, లొంగిపోయేందుకు అవకాశం ఇవ్వకుండా, ఊపిరాడకుండా చేసి, వారు చనిపోయేందుకు కారణం కావడంపై ప్రపంచవ్యాప్తంగా ఆగ్రహాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ‘పోలీసులు ఇలా వ్యవహరించడం మా వద్ద కూడా జరుగుతుంది’అని ఫ్రాన్స్ ఎంపీ ఫ్రాంకోయిస్ రుఫిన్ వ్యాఖ్యానించారు. హాంకాంగ్‌లోనూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్నవారిపై అక్కడి పోలీసులు ఇలాంటి హింసాత్మక విధానాలనే అవలంబిస్తుంటారు. మెడపై ఒత్తిడి చేసి, శ్వాస అందకుండా చేయడమనే విధానం మా వద్ద లేదని ఇజ్రాయెల్ పోలీస్ విభాగ అధికార ప్రతినిధి మికీ రోజెన్ఫీల్డ్ స్పష్టం చేశారు. -
నన్నూ అలాగే చేశారు
వాషింగ్టన్: అమెరికా పోలీసులతో కర్కశమైన అనుభవం తనకూ ఎదురైందని నల్లజాతి టెన్నిస్ ప్లేయర్ జేమ్స్ బ్లేక్ వివరించాడు. ఐదేళ్ల క్రితం యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీ సమయంలో ఈ ఘటన జరిగిందని, అది తలచుకుంటే పోలీసుల తీరుపై ఇప్పటికీ వణుకు పుడుతుందని 40 ఏళ్ల బ్లేక్ చెప్పాడు. ‘2015లో యూఎస్ ఓపెన్ జరుగుతుండగా నేను మన్హటన్ హోటల్ బయట నిల్చున్నాను. ఒక అభిమాని నాకు సమీపంగా వచ్చి నా మ్యాచ్‌ల్ని ఆసక్తిగా చూసేవాడినని చెప్పాడు. తన కూతురు టెన్నిస్ ఆడుతుందన్నాడు. తర్వాత కాసేపటికే న్యూయార్క్ పోలీసులు నన్ను కర్కశంగా అదుపులోకి తీసుకున్నారు. క్రెడిట్ కార్డు మోసానికి పాల్పడిన వ్యక్తి నాలాగే ఉండటంతో నేనే మోసగాడినని నిశ్చయించుకున్న పోలీసులు నా పెడరెక్కలు విరిచేసి తొక్కిపెట్టేశారు. కనీస నిర్ధారణ అంటూ చేసుకోకుండానే నల్లజాతీయులపై ఈ స్థాయిలో అణచివేత ఉంటుంది’ అని ప్రపంచ మాజీ నాలుగో ర్యాంకర్ బ్లేక్ నాటి భయంకర అనుభవాన్ని వివరించాడు. అమెరికా మాజీ టెన్నిస్ ప్లేయర్ జేమ్స్ బ్లేక్ -
భగ్గుమంటున్న అగ్రరాజ్యం
వాషింగ్టన్/మినియాపొలిస్: మినియాపొలిస్‌లో రాజుకున్న అశాంతి అగ్గి అమెరికాలోని ఇతర నగరాలకూ వ్యాపిస్తోంది. జార్జి ఫ్లాయిడ్ అనే ఆఫ్రికన్‌అమెరికన్‌ను శ్వేత జాతి పోలీసు అధికారులు పొట్టనబెట్టుకోవడంపై ఆగ్రహం పెల్లుబికింది. పోలీసులతో ఆందోళనకారులు బాహాబాహీకి దిగడంతో పాటు షాప్‌లు, ఆఫీస్‌లు, వాహనాలకు నిప్పుపెట్టారు. ఫ్లాయిడ్ మృతికి నిరసనగా వాషింగ్టన్లో ఆదివారం శాంతియుతంగా ప్రదర్శన జరిగింది. ఆందోళనకారులు అధ్యక్ష భవనం సమీపంలో చెత్త కుప్పకు నిప్పుపెట్టారు. న్యూయార్క్‌లో ఓ యువతి అరెస్ట్ దృశ్యం ఆందోళనలకు కేంద్ర బిందువైన మినియాపొలిస్‌లో పోలీస్‌స్టేషన్‌ను చుట్టుముట్టిన ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు టియర్ గ్యాస్, రబ్బర్ బుల్లెట్లను ప్రయోగించారు. నగరంలో పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రభుత్వం 4 వేల నేషనల్ గార్డులను రంగంలోకి దించింది. ఇండియానాపొలిస్‌లో జరిగిన కాల్పుల్లో ఒకరు చనిపోయారు. రెండు రోజుల క్రితం డెట్రాయిట్, మినియాపొలిస్‌ల్లో జరిగిన ఘటనల్లోనూ ఇద్దరు మరణించారు. ఫిలడెల్ఫియాలో ఆందోళనకారుల దాడిలో 13 మంది పోలీసులు గాయపడగా నాలుగు పోలీసు వాహనాలు కాలిబూడిదయ్యాయి. న్యూయార్క్‌లో వీధుల్లోకి వచ్చిన ఆందోళనకారులను అదుపు చేసేందుకు పోలీసులు యత్నించడం కొట్లాటలకు దారి తీసింది. గురువారం నుంచి ఇప్పటి వరకు 22 నగరాల్లో 1,669 మందిని అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు. ఇందులో సగం అరెస్టులు లాస్ఏంజెలిస్లోనే జరిగాయి. లాస్ఏంజెలిస్ నగరంలో నిరసన కారులు భవనాలు, వాహనాలకు నిప్పుపెడుతుండటంతో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. అట్లాంటా, డెన్వెర్, లాస్ఏంజెలిస్, మినియాపొలిస్, శాన్ ఫ్రాన్సిస్కో, సియాటెల్ సహా 12కు పైగా నగరాల్లో రాత్రి పూట కర్ఫ్యూ విధించారు. నా రెస్టారెంట్ కాలిపోయినా సరే.. మినియాపొలిస్ నిరసనలకు బంగ్లాదేశీయుడు, స్థానిక ‘గాంధీ మహల్ రెస్టారెంట్’ యజమాని రుహేల్ ఇస్లాం(44) మద్దతుగా నిలిచారు. మినియాపొలిస్ పోలీస్ ఆఫీస్ దగ్గర్లో ఇతన రెస్టారెంట్ ఉంది. ఆ రెస్టారెంట్‌కు ఆందోళనకారులు నిప్పుపెట్టారు. ఆ రోజు జరిగిన ఘటనపై రుహేల్ కుమార్తె హఫ్సా (18) ఫేస్బుక్లో పెట్టిన పోస్టు అందరి ప్రశంసలు అందుకుంటోంది. ‘ఆ రోజు నాన్న పక్కనే కూర్చుని టీవీలో వార్తలు చూస్తున్నా. నాన్న ఎవరితోనో ఫోన్లో.. నా బిల్డింగ్‌ను తగలబడనివ్వండి. బాధితులకు మాత్రం న్యాయం దక్కాలి. బాధ్యులను జైల్లో పెట్టాలి..అని అంటుండగా విన్నాను. మాకు నష్టం జరిగినా సరే, పొరుగు వారికి సాయంగా, బాసటగా నిలవాలన్న మా సంకల్పం ఏమాత్రం సడలదు’ అని అందులో హఫ్సా పేర్కొంది. -
కర్ఫ్యూను ధిక్కరించి..
మినియాపొలిస్: జార్జి ఫ్లాయిడ్ అనే నల్లజాతీయుడు పోలీస్ కస్టడీలో మృతి చెందడంతో భగ్గుమన్న నిరసనలు మినియాపొలిస్ నుంచి అమెరికాలోని ఇతర నగరాలకు వ్యాపించాయి. కోవిడ్ నేపథ్యంలో అమలవుతున్న నిషేధాజ్ఞలను ఆందోళనకారులు ధిక్కరించారు. మినియాపొలిస్‌లో వరుసగా నాలుగో రోజూ ఆందోళనలు కొనసాగాయి. మినియాపొలిస్‌లోని ఓ పోలీస్‌స్టేషన్‌ను నిరసనకారులు చుట్టుముట్టి పోలీసులను శిక్షించాలంటూ నినాదాలు చేశారు. నగరంలో పలు ప్రాంతాల్లో కాల్పుల ఘటనలు చోటుచేసుకున్నాయి. ఒక రెస్టారెంట్, బ్యాంకు, మరో కార్యాలయానికి దుండగులు నిప్పుపెట్టారు. భద్రతా కారణాల రీత్యా అగ్ని మాపక సిబ్బంది అక్కడికి రాకపోవడంతో గంటలపాటు మంటలు కొనసాగాయి. డెట్రాయిట్లో జరిగిన కాల్పుల్లో ఒకరు మృతి చెందగా, అట్లాంటాలో ఆందోళనకారులు పోలీసుకార్లకు నిప్పంటించారు. న్యూయార్క్, హూస్టన్, వాషింగ్టన్ నగరాల్లో భారీగా ప్రదర్శనలు జరిగాయి. ఈ సందర్భంగా పోలీసులతో ఘర్షణలు చోటుచేసుకున్నాయి. దొంగ నోట్ల చెలామణీకి యత్నించాడన్న ఆరోపణలపై ఫ్లాయిడ్‌ను ఇటీవల పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బేడీలు వేసిన తర్వాత ఫ్లాయిడ్‌ను కింద పడేసి, డెరెక్ చౌవిన్ అనే అధికారి అతడి మెడపై 9 నిమిషాల పాటు మోకాలితో తొక్కిపెట్టి ఉంచడంతో అతడు ఊపిరాడక చనిపోయినట్లు తేలింది. దీంతో, చౌవిన్‌తోపాటు మరో ముగ్గురు అధికారులను సస్పెండ్ చేశారు. వీరిపై నేరం రుజువైతే 12 ఏళ్ల వరకు జైలు శిక్షపడే అవకాశముంది. అట్లాంటాలో నినాదాలిస్తున్న ఆందోళనకారులు -
కారు కొనేందుకు కారేసుకెళ్లిన బుడ్డోడు
కాలిఫోర్నియా: అమ్మ తిట్టిందనో, నాన్న కొట్టాడనో పిల్లలు అలుగుతుంటారు.. అది సహజం. అయితే ఓ ఐదేళ్ల బుడ్డోడు మాత్రం అలిగి బుంగమూతి పెట్టుకుని కూర్చోలేదు. తను కోరింది దక్కాల్సిందేనన్న మంకుపట్టుతో చెప్పాపెట్టకుండా కారేసుకుని వెళ్లిపోయాడు. హైవేపై పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులు ఆ బుడతడు డ్రైవింగ్ చేయడం చూసి ఖంగు తిన్నారు. ఈ ఆశ్చర్యకర ఘటన సోమవారం అమెరికాలోని ఉటావాలో జరిగింది. ఓ బాలుడు తన తల్లిని ఖరీదైన లంబోర్గిని కారు కొనివ్వమని అడిగాడు. అందుకు అతని తల్లి నిరాకరించింది. (సైకిల్‌పై వచ్చి చిన్నారిని ఈడ్చుకెళ్లిన కోతి) దీంతో స్వయంగా అతనే వెళ్లి తెచ్చుకోవాలని భావించిన పిల్లవాడు మూడు డాలర్లు వెంట పెట్టుకుని ఇంట్లో మాటైనా చెప్పకుండా తన పేరెంట్స్ ఎస్యూవీ కారు తీసుకుని కాలిఫోర్నియాకు బయలు దేరాడు. మార్గమధ్యంలో అనుమానం వచ్చిన పోలీసులు అతడిని అడ్డుకున్నారు. నీకు ఐదేళ్లే కదా? ఇంత చిన్న వయసులో డ్రైవింగ్ ఎక్కడ నేర్చుకున్నావ్? అంటూ ప్రశ్నలు కురిపించారు. అదృష్టవశాత్తూ అతని డ్రైవింగ్‌లో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని అధికారులు పేర్కొన్నారు. సుమారు నాలుగైదు కిలోమీటర్ల వరకు అతను కారు నడిపాడని తెలిపారు. తర్వాత అతడిని మందలించి తల్లిదండ్రులకు అప్పగించారు. (డిస్ట్రబ్ చేసింది.. స్టార్ అయ్యింది) -
త్వరలో భారత్‌కు ముంబై ఉగ్రదాడి నేరస్తుడు?
వాషింగ్టన్: 2008 ముంబై ఉగ్రదాడిలో విచారించేందుకు పాకిస్తానీ కెనడియన్ తహవ్వుర్ హుస్సేన్ రాణాను 2021లోపే భారత్‌కు రప్పించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. షికాగోలో నివసించే రాణాను ముంబై ఉగ్రదాడికి సంబంధించి 2009లో అమెరికా పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో లష్కరే తోయిబా ఉగ్ర సంస్థకు సహకరించినట్లు విచారణలో బయటపడటంతో 2013లో కోర్టు రాణాకు 14 ఏళ్ల జైలు శిక్ష విధించింది. అతడి శిక్షా కాలం డిసెంబర్ 2021 లో ముగియనుంది. ఈ కేసులో రాణాను విచారించేందుకు భారత ప్రభుత్వం అమెరికా అధికార యంత్రాంగంతో చర్చలు జరుపుతోంది. అయితే ముంబై ఉగ్రదాడికి సంబంధించే రాణా ప్రస్తుతం జైలు శిక్ష అనుభవిస్తుండటంతో.. అదేకేసు విచారణపై భారత్ కు అతన్ని అప్పగించే అవకాశం లేదు. దీంతో భారత ప్రభుత్వం ఢిల్లీలోని నేషనల్ డిఫెన్స్ కాలేజీ, చాబాద్ హౌస్‌లపై దాడి కేసులతోపాటు ఫోర్జరీ కేసుపై భారత్‌కు రప్పించేలా ప్రయత్నాలు చేస్తోంది. ఇటీవల జాతీయ దర్యాప్తు సంస్థ అమెరికాలో పర్యటించిన సమయంలో ఇరు దేశాల మధ్య ఉన్న పలు అధికారిక విధానాల్లో సడలింపు చేసుకోవాలని ఒప్పందం కుదుర్చుకున్నాయి. దీంతో ఎలాగైనా రాణాను శిక్షాకాలం పూర్తయ్యేలోపే భారత్‌కు రప్పించే అవకాశాలు మెరుగ్గా ఉన్నట్లు తెలుస్తోంది. -
క్రిస్మస్ సందర్భంగా షాపింగ్‌కు వచ్చి...
-
పోలీస్ ఫ్లాష్‌మాబ్ వైరల్!
ఫ్లొరిడా : అమెరికా ఫ్లొరిడాలోని ఓ షాపింగ్ మాల్లో పోలీసులు ఫ్లాష్‌మాబ్‌తో ఔరా అనిపించారు. క్రిస్మస్ సందర్భంగా షాపింగ్‌కు వచ్చిన కొందరు.. ఫ్లాష్‌మాబ్‌తో సడెన్ సప్రైజ్ ఇచ్చారు. అయితే ఈ విషయం తెలుసుకున్న ఆ షాపింగ్ పోలీస్ అధికారులు ఈ ఫ్లాష్‌మాబ్‌ను అడ్డుకున్నారు. కానీ అందరికీ ట్విస్ట్ ఇస్తూ వారు ఆ ఫ్లాష్‌మాబ్‌లో భాగమయ్యారు. వారితో కలిసి చిందేశారు. ఈ ఘటనతో అక్కడున్నవారు సంభ్రమాశ్చర్యానికిలోనయ్యారు. పోలీసుల డ్యాన్స్ చూసి అక్కడున్న వారు పెద్దగా అరుస్తూ.. వారిని అభినందించారు. ఫ్లొరిడాలోని అవెంచురా మాల్లో ఇది జరగగా.. దీనికి సంబంధించి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ‘అవెంచురా పోలీసులు షాపింగ్‌కు వచ్చిన వారి హాలిడే మూవ్‌మెంట్‌ను అందిపుచ్చుకున్నారు’ అని అవెంచురా పోలీస్ సోషల్‌మీడియా విభాగం తమ అధికారిక ట్విటర్లో ఈ వీడియోను షేర్ చేసింది. దీంతో ఇది వైరల్ అయింది. -
కుక్కను కరిచి, అరెస్ట్ అయ్యాడు!
హ్యూస్టన్: మనిషిని కుక్క కరిస్తే అది వార్త కాదు... కుక్కను మనిషే కరిస్తేనే అది వార్తవుతుందని సరదాగా చెప్పుకుంటారు. కుక్కను మనిషి కరవడం అనేది నిజంగా జరుగుతుందా? అలాంటి వార్తను మనం చదువుతామా? అని ఎంతోమంది అనుకోవచ్చు. ఇక ఆ లోటు కూడా తీరిపోయింది. కుక్కను కరిచాడనే ఆరోపణలపై అమెరికా పోలీసులు ఓ వ్యక్తిని అరెస్టు చేశారు. అదీ.. అలాంటి ఇలాంటి శునకం కాదు, మనోడు ఏకంగా పోలీసు కుక్కనే కరిచాడట. వివరాల్లోకి వెళితే... న్యూ హాంప్‌షైర్‌కు చెందిన ఓ వ్యక్తి.. పోలీసుల నుంచి తప్పించుకు తిరుగుతూ ఓ చోట దాక్కున్నాడు. దానిని గమనించిన జాగిలం.. సదరు దొంగ దగ్గరకు పరిగెత్తి, మొరగడం మొదలుపెట్టింది. దీంతో దాని అరుపులకు ఎక్కడ పోలీసులు వచ్చి తనను అరెస్టు చేస్తారో అనే భయంతో ఆ శునకాన్ని పట్టుకొని కరిచేశాడు. దీంతో ఆ శునకం మరింత పెద్దగా అరవడంతో అక్కడికి చేరుకున్న పోలీసులు అవాక్కయ్యారు. అతడి చేతుల్లో నుంచి శునకాన్ని కాపాడి, ఆపై ఆ చేతులకు బేడీలు వేశారు. శునకాన్ని కరిచిన నేరం కింద అరెస్టు చేసినట్లు పోలీసులు ఎఫ్ఐఆర్లో నమోదు చేశారు. -
ఫోన్ చేస్తే చాలు పోలీసులు వాలిపోతారు!
అమెరికాలో ప్రజలు తమకు ఏ ఆపద ఎదురైనా వెంటనే 911కు ఫోన్ చేస్తారు. నిమిషాల్లో పోలీసులు వాలిపోయి సమస్య పరిష్కరిస్తారు. అందువల్ల ఈ నంబర్ ఎల్లప్పుడు అమెరికాలో బిజీగా ఉంటుంది. హ్యుస్టన్‌లో తన తండ్రికి గుండెపోటు రాగా, ఒక 6 సంవత్సరాల బాలిక పోలీసులకు ఫోన్ చేసి, ప్రాణాలను కాపాడుకున్న సంఘటనను ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. సంచార పోలీస్ వాహనాలు అమెరికాలో విరివిగా ఉన్నాయి. 911కు ఫోన్ చేయగానే ఆపద ఏర్పడిన అడ్రసుకు సమీపంలో ఉన్న సంచార వాహనానికి సమాచార మిస్తారు. నిమిషాల వ్యవధిలోనే సంఘటన జరిగిన స్థలానికి పోలీసులు చేరుకుంటారు. అర్థరాత్రి కూడా మహిళలు స్వేచ్ఛగా సంచరిస్తారు. విద్యార్థినులను ఈవ్ టీజింగ్ చేయం కనిపించదు. అమెరికా ప్రజలు ఎవరి పనులను వారు చక్కగా చేసుకుంటారు. శ్రమను గౌరవిస్తారు. ఎవరి ఇళ్లను వారే శుభ్రం చేసుకుంటారు. పని మనుషులు లేరు. ఒక వేళ ఎవరైనా పని మనుషులను పెట్టుకోవాలంటే చాలా డబ్బులు వ్యయం చేయాలి. చలి ప్రదేశాల్లో ప్రతి ఇంట్లోనూ ఉన్నితో తయారు చేసిన కార్పెట్ ఉంటుంది. దానిని యంత్రంతో శుభ్రం చేస్తారు. సోషల్ సెక్యూరిటీ నంబర్ అమెరికాలో నివసించే ప్రతి స్వదేశీ, విదేశీ పౌరులకు అక్కడి ప్రభుత్వం ఒక సోషల్ సెక్యూరిటీ నంబర్ కేటాయిస్తుంది. ఆ నంబర్ పైనే ఆయా పౌరుల వివరాలు రికార్డు అవుతాయి. ఎక్కడైనా పొరపాటుగా కారు నడిపి ప్రమాదం కలిగిస్తే, అలాంటి విషయాలను కూడా రికార్డు చేస్తారు. అమెరికాలో విశాలమైన రోడ్లు, అడుగడుగునా సిగ్నల్స్‌తో ప్రమాదం జరిగేందుకు ఆస్కారముండదు. ర్యాష్ డ్రైవింగ్ చేసే వారికి కూడా పోలీసులు జరిమానా విధిస్తారు. ఒక సారి జరిమానా టికెట్ కట్ చేసిన తరువాత ఫైన్ చెల్లించవలసిందే. అక్కడ ఎలాంటి పైరవీలకు ఆస్కారం ఉండదు. మన దేశంలో ఆధార్ నంబర్ మాదిరిగానే ఇది కూడా పని చేస్తుంది. అయితే ఆధార్ నంబర్ పూర్తిగా ఇక్కడ మనుగడలోకి రాలేదు. అమెరికా అంతటా లోకల్ మొబైల్ ఫోన్లు ఇంటర్నెట్ ఆధారంగా అమెరికా అంతటా లోకల్ మొబైల్ ఫోన్లు వాడుతున్నారు. ఇవి మన ఫోన్ల కంటే చాలా చౌక. అందువల్ల అమెరికాలో ఉన్న వారు మన దేశంలోని బంధువులతో మాట్లాడేందుకు ఈ ఫోన్ ఉపయోగిస్తారు. ఏటీ అండ్ టీ ఫోన్లను ఫిక్స్డ్ ఫోన్లుగా అక్కడ వాడతారు. అమెరికాలో ఇంటర్నెట్ వినియోగం ఎక్కువగా ఉంది. ప్రతి రెస్టారెంట్లో, షాపులో ఇంటర్నెట్ వినియోగంలోకి వచ్చింది. అక్కడ కాఫీ షాపులు రీడింగ్ అండ్ రైటింగ్ రూంలుగా ఉపయోగపడుతున్నాయి. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా వినియోగించడం ద్వారా అమెరికా ప్రజలు తమ జీవన విధానాన్ని మెరుగు పర్చుకున్నారు. వాస్తవానికి మన దేశంలోనే అమెరికా కంటే ఎక్కువగా సహజ వనరులున్నాయి. సంవత్సరంలో సుమారు 6 నుంచి 8 మాసాలపాటు అమెరికా చాలా ప్రాంతాలు మంచుతో కప్పబడి ఉంటాయి. రోడ్లపై సులభంగా తిరిగేందుకు అవకాశం ఉండదు. ఆఫీసులకు వెళ్లలేక అనేక మంది ఇంటి నుంచి ఆన్లైన్లో పనిచేస్తారు. ప్రతి ఇంట్లో ఎలక్ట్రిక్ స్టౌలు ఉంటాయి. అక్కడ వంటగ్యాస్ వినియోగం లేదు. అద్దె ఇళ్లలో సోఫాలు, ఫ్రిజ్, ఓవెన్.... ఇతర సౌకర్యాలుంటాయి. అపార్టుమెంట్లలో వాచ్‌మేన్ ఉండరు. ప్రతి ఫ్లాట్ యజమానికి ఒక కీ ఇస్తారు. డోర్ ఓపెన్ చేసుకుని రావాలి. ఎవరైనా బంధువులు వస్తే, ఫ్లాట్ నంబర్‌కు సంబంధించిన నంబర్ నొక్కుతారు. అప్పుడు ఫ్లాట్ ఉన్న వ్యక్తి ఆడియో సిస్టం ద్వారా మాట్లాడి నిర్ధారించుకుని మీటనొక్కగానే డోర్ తెరుచుకుంటుంది. అమెరికాలో బహిరంగ మలవిసర్జన పూర్తిగా నిషేధం. అడుగడుగునా ప్రజల కోసం మరుగు దొడ్లు నిర్మించారు. అమెరికాలోని చాలా నగరాల్లో దుమ్ము ధూళీ లేదు. కాలుష్యం చాలా తక్కువ. ఏడాదిలో చాలా కాలం పాటు మంచు కురవడం వల్లనే ఈ పరిస్థితి ఉందని భావిస్తున్నారు. - జి.గంగాధర్, సీనియర్ సబ్ ఎడిటర్.