డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసు.. వ్యక్తిపై పోలీసు కాల్పులు | Atlanta police shoot in kill DUI suspect after struggle | Sakshi
Sakshi News home page

డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసు.. వ్యక్తిపై పోలీసు కాల్పులు

Published Sun, Jun 14 2020 6:50 AM | Last Updated on Sun, Jun 14 2020 9:13 AM

Atlanta police shoot in kill DUI suspect after struggle  - Sakshi

అట్లాంటా: డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ ఆరోపణలపై ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకునే క్రమంలో పోలీసులు జరిపిన కాల్పుల్లో ఒక వ్యక్తి చనిపోయాడు. అమెరికాలోని అట్లాంటాలో శుక్రవారం ఈ ఘటన చోటుచేసుకుంది. వెండీ రెస్టారెంట్‌ వద్ద ఓ వ్యక్తి పార్కు చేసిన వాహనం కారణంగా ఇతర వినియోగదారులు ఇబ్బంది పడుతున్నారంటూ పోలీసులకు సమాచారం అందింది. అక్కడకు చేరుకున్న పోలీసులు కారులో ఉన్న వ్యక్తిని అదుపులోకి తీసుకునేందుకు యత్నించగా ప్రతిఘటించాడు. మద్యం మత్తులో ఉన్న ఆ వ్యక్తిని కట్టడి చేసేందుకు పోలీసులు టేజర్‌ (షాక్‌ కలిగించడం ద్వారా చేష్టలుడిగేలా చేయడం)ను ప్రయోగించేందుకు ప్రయత్నించారు. ఆ వ్యక్తి ఆ టేజర్‌ను కూడా లాగేసుకునేందుకు యత్నించాడు. ఈ సందర్భంగా జరిగిన పెనుగులాటలో పోలీసు అధికారి ఒకరు అగంతకుడిపైకి కాల్పులు జరిపాడు. ఆస్పత్రిలో చికిత్సపొందుతూ అతను మరణించాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement