వాషింగ్టన్: అమెరికా పోలీసులతో కర్కశమైన అనుభవం తనకూ ఎదురైందని నల్లజాతి టెన్నిస్ ప్లేయర్ జేమ్స్ బ్లేక్ వివరించాడు. ఐదేళ్ల క్రితం యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీ సమయంలో ఈ ఘటన జరిగిందని, అది తలచుకుంటే పోలీసుల తీరుపై ఇప్పటికీ వణుకు పుడుతుందని 40 ఏళ్ల బ్లేక్ చెప్పాడు. ‘2015లో యూఎస్ ఓపెన్ జరుగుతుండగా నేను మన్‌హటన్ హోటల్ బయట నిల్చున్నాను. ఒక అభిమాని నాకు సమీపంగా వచ్చి నా మ్యాచ్‌ల్ని ఆసక్తిగా చూసేవాడినని చెప్పాడు.
తన కూతురు టెన్నిస్ ఆడుతుందన్నాడు. తర్వాత కాసేపటికే న్యూయార్క్ పోలీసులు నన్ను కర్కశంగా అదుపులోకి తీసుకున్నారు. క్రెడిట్ కార్డు మోసానికి పాల్పడిన వ్యక్తి నాలాగే ఉండటంతో నేనే మోసగాడినని నిశ్చయించుకున్న పోలీసులు నా పెడరెక్కలు విరిచేసి తొక్కిపెట్టేశారు. కనీస నిర్ధారణ అంటూ చేసుకోకుండానే నల్లజాతీయులపై ఈ స్థాయిలో అణచివేత ఉంటుంది’ అని ప్రపంచ మాజీ నాలుగో ర్యాంకర్ బ్లేక్ నాటి భయంకర అనుభవాన్ని వివరించాడు.
అమెరికా మాజీ టెన్నిస్ ప్లేయర్ జేమ్స్ బ్లేక్
Comments
Please login to add a commentAdd a comment