Aurora Police Said 5 Teenagers Had Been Hurt in Shooting Near US School - Sakshi
Sakshi News home page

అమెరికాలో కాల్పులు... ఐదుగురికి గాయాలు

Published Tue, Nov 16 2021 8:23 AM | Last Updated on Tue, Nov 16 2021 10:36 AM

Aurora Police Said Five Teenagers Had Been Hurt in Shooting Near US School - Sakshi

లాస్‌ఏంజెల్స్‌: యూఎస్‌ కొలరాడాలో అరోరా నగరంలోని సెంట్రల్ హైస్కూల్ సమీపంలో జరిగిన కాల్పు‍ల్లో ఐదుగురు యువకులు గాయపడినట్లు అరోరా పోలీసులు తెలిపారు. అయితే అనుమానితుడు ఎవరు ఆ సమయంలో ఉన్నట్లు కనిపించలేదని అన్నారు. ఈ మేరకు సంఘటన పాఠశాల లోపల జరగలేదని పార్క్ వద్ద జరిగిందన్నారు.

(చదవండి: జిమ్‌లో అసభ్య ప్రవర్తన... టిక్‌టాక్‌ షేర్‌ చేయడంతో పరార్‌!!)

అంతేకాదు పార్క్‌కి సంబంధించిన సీసీపుటేజ్‌ కెమరాలను కూడా పరిశీలిస్తున్నట్టుల తెలిపారు. పైగా హైస్కూల్‌కి సంబంధించిన కార్‌ పార్కింగ్‌లో అత్యవసర వాహనాలు కూడా ఉన్నాయని, ఈ ఘటన జరిగినే వెంటనే అక్కడ పెద్ద సంఖ్యలో జనం గుమిగూడినట్లు పోలీసలు చెప్పారు. అయితే కొలరాడో తుపాకీ హింసకు కొత్తేమీ కాదు. పైగా యూఎస్‌ చరిత్రలో అత్యంత అపఖ్యాతి పాలైన రెండు సాముహిక కాల్పలు ఈ ప్రాంతంలోనే జరిగిన సంగతి తెలిసిందే.

(చదవండి: యూకే లివర్‌పూల్‌ నగరంలో కారు బ్లాస్ట్‌... ఒకరు మృతి)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement