colarado
-
అడవుల్లో బతికేస్తున్న పాపులర్ టిక్‌టాకర్
ఈ ఫొటోల్లో కనిపిస్తున్న పెద్దమనిషి కొంతకాలంగా అడవుల్లో సంచరిస్తూ గుహలలోనే తలదాచుకుంటూ బతికేస్తున్నాడు. గుహలలో తలదాచుకోవడానికి, అడవుల్లో సురక్షితంగా తిరగడానికి అవసరమైన మెలకువలు చెబుతూ సెల్ఫీ వీడియోలను ‘టిక్‌టాక్’లో షేర్ చేసుకుంటున్నాడు. అమెరికాలోని కొలరాడోకు చెందిన ఈ ఆధునిక అడవి మనిషి పేరు డానీ డస్ట్. ‘టిక్‌టాక్’లో ఇతడికి ఏకంగా కోటి మందికి పైగా ఫాలోవర్లు ఉన్నారు. ‘గుహలలో తలదాచుకోవడం అంత తేలికైన పనేమీ కాదు. తలదాచుకోవాలనుకున్న గుహ సురక్షితమైనదో కాదో చూసుకోవాలి. గుహలో ఏదైనా జంతువు విసర్జకాలు ఉన్నట్లయితే, అది ఆ జంతువు సొంతం. అలాంటి గుహలో తలదాచుకోవడం ప్రాణాలకే ప్రమాదం. అలాగే గుహల్లో ఉండే సాలెగూళ్లు, తేనెపట్లులాంటివి ఏవైనా ఉన్నా జాగ్రత్తగా చూసుకోవాలి. గుహ పైభాగంలో పగుళ్లు ఉన్నాయో లేదో చూడాలి. పైభాగంలో పగుళ్లు ఉంటే, ఏ క్షణంలోనైనా పెళ్లలు విరిగి నెత్తిన పడే ప్రమాదం ఉంటుంది. అన్నీ సజావుగా ఉన్న గుహను ఎంపిక చేసుకోవడం ఒక కష్టమైతే, అందులోని రాతి నేల మీద అలాగే పడుకోలేం. అందుకని తగినంత ఎండుగడ్డిని పోగు చేసుకుని, పరుచుకుంటే పడుకోవడానికి సౌకర్యంగా ఉంటుంది’ అని చెబుతాడు డానీ. అడవుల్లో పక్షులను, జంతువులను వేటాడుతూ, వాటి మాంసంతోను, అడవిలో దొరికే పండ్లు కాయలతోనే కాలక్షేపం చేస్తూ ఇతడు తీసే వీడియోలు క్షణాల్లోనే వైరల్ అవుతుండటం విశేషం. View this post on Instagram A post shared by Überleben® (@uberleben.co) View this post on Instagram A post shared by Donny Dust (@donnydust) View this post on Instagram A post shared by Donny Dust (@donnydust) View this post on Instagram A post shared by Donny Dust (@donnydust) -
Liz Carter: ముడతల కాగితంతో ప్రయోగాలు; వదిలేసి వెళ్లిన భర్త తిరిగొచ్చి మరీ!
Liz Carter US Colorado Woman Italian Crepe Paper Bouquet Business: జీవితం పూలదారిలా సుతిమెత్తగా సాగాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అందుకు తగినట్టుగానే కృషి చేస్తుంటారు. అమెరికాలోని కొలరాడో ప్రాంతంలో ఉంటున్న లిజ్ కార్టర్ కూడా అదే ప్రయత్నం చేసింది. కాగితం పూల దారిలో ఓ కొత్త ప్రయాణం మొదలుపెట్టింది. ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తోంది. సీజన్లో విరబూయని పూలు కూడా ఆమె చేతిలో అందంగా ఊపిరి పోసుకుంటాయి. ఇటాలియన్ క్రేప్ పేపర్‌తో ఆమె డిజైన్ చేసిన అందమైన పూలు చూస్తే ప్రకృతి కూడా ‘ఔరా!’ అనకుండా ఉండదు. ఆ అందమైన పేపర్ పూలతోనే వ్యాపారాన్ని విస్తృతం చేస్తోంది 42 ఏళ్ల కార్టర్. ముడతల కాగితంతో ప్రయోగాలు.. పదేళ్లపాటు కొలరాడోలోని ఓ పూల దుకాణంలో పార్ట్ టైమ్ జాబ్ చేసింది కార్టర్. అక్కడకు నిత్యం వచ్చే వ్యక్తులను చూస్తూ ఉన్న ఆమె కొన్నాళ్లకు తనే పూల వ్యాపారం చేయాలనుకుంది. సొంతంగా పూల షాప్‌ను ఏర్పాటు చేసింది. అయితే, సీజనల్‌గా విరబూయని పూలతో బొకేలను తయారుచేసి, తన ప్రత్యేకతను చాటాలనుకుంది. వాటిని విక్రయిస్తూ ఓ కొత్త వ్యాపారాన్ని సృష్టించాలనుకుంది. ఆ ఆలోచనతో తన ఇంట్లో రేకలు, మొగ్గలు, ఆకుల ఆకారంలో 100 రకాల పువ్వులను ముడతలు ఉండే ఇటాలియన్ క్రేప్ కాగితంతో సృష్టించింది. పువ్వుల షాప్‌లో పార్ట్‌టైమ్ జాబ్ చేస్తూ కాగితం పువ్వులు విరబూయడానికి సాధన చేస్తూనే ఉంది. ఒక అభిరుచిగా ప్రారంభమైన ఆ కళ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసేలా ఎదిగింది. ఆ తర్వాత వాటికి కొన్ని ఆకర్షణలు జోడించింది. ఆర్డర్లు వచ్చాయి. దీంతో 2019 మొదట్లో కాగితం పూలతో ఆన్లైన్ వ్యాపారం ప్రారంభించింది. కార్టర్ చేతిలో అలా రూపుదిద్దుకున్న పుష్పగుచ్ఛాలకు ఇప్పుడు అమెరికాలోనే కాక ప్రపంచమంతా కస్టమర్లున్నారు. ఇంటి గ్యారేజ్ నుంచి కమర్షియల్ స్పేస్ వరకు.. ఈ నెలలో కార్టర్ తన వ్యాపారాన్ని గ్యారేజ్ నుంచి మిషిగాన్‌లోని ప్రఖ్యాతి చెందిన ఢిల్లీ కామర్స్ డ్రైవ్‌లో గల 3,130 చదరపు అడుగుల సూట్లోకి మార్చింది. అంటే, ఆమె తన వ్యాపారాన్ని ఎంతగా విస్తృతం చేసిందో మనకు ఇట్టే అర్థమైపోతుంది. ‘ఈ కొత్త స్థలం మా వద్ద ఉన్న వివిధ రకాల ఉత్పత్తుల విస్తృతిని పెంచడానికి, మరిన్ని కొత్త రకాల డిజైన్లను కనుక్కోవడానికి అనుకూలంగా ఉంటుంది’ అంటుంది కార్టర్. ఒక్కో పువ్వు ఒక కళారూపం... ‘పువ్వులు మనలోని సున్నితమైన భావోద్వేగాలకు ప్రతీకలు. ఈ పువ్వులు నా జీవితాన్ని అర్థవంతంగా మార్చేశాయి. వీటిని అమర్చడానికి సృజనాత్మకత అవసరం. దీనితో పాటు కస్టమర్ల అవసరాలకు సరిపోయే సామర్థ్యమూ అవసరం. నిరంతరం కాలానుగుణంగా వీటిని సృష్టిస్తూ ఉంటే చాలా ఆసక్తికరమైన పనిగా మారిపోతుంది. మనలోని భావోద్వేగాలు బ్యాలెన్స్ అవుతాయి కూడా’ అంటారు కార్టర్. ఐదేళ్లుగా ఈ కాగితం పూలను సృష్టిస్తున్న కార్టర్ మొదట్లో ప్రతి పువ్వుల దుకాణానికి వెళ్లి, తన పనితనాన్ని వివరించేది. వాటిలో తన కాగితం పూల గుచ్ఛాలను ఉంచడానికి వారిని ఒప్పించేది. ఒక విధంగా పెద్ద తపస్సు చేశానంటుంది కార్టర్. ఈ మదర్స్‌డేకి 500 ఆర్డర్లు రావడం, వచ్చిన ఆర్డర్లకు తగినట్టు పూలను అందించడంతో తన వ్యాపారాన్ని విస్తృతం చేయాలనుకుంది. ఒడిదొడుకులను తట్టుకోలేక వదిలి వెళ్లిన ఆమె భర్త అలెక్స్ కూడా తిరిగి వచ్చి, ఇదే వ్యాపారం చూసుకుంటున్నాడు. ఒక్కో పువ్వును తయారుచేయడానికి 30 నిమిషాల నుండి గంట సమయం పడుతుందనే కార్టర్ ‘నేను ఇప్పుడు రోజంతా పూలతో ఆడుకుంటున్నాను’ అని ఉత్సాహం చెబుతుంది. దేశమేదైనా ఆ ఉత్సాహం మనమూ అందుకోవాల్సిందే. కొత్తగా జీవితాన్ని నిర్మించుకోవాలనుకునేవారు కార్టర్ నుంచి స్ఫూర్తిని పొందాల్సిందే. చదవండి: Bipin Rawat Wife Madhulika: భర్తకు తగ్గ భార్య.. ఆఖరి శ్వాస వరకు ఆయనతోనే -
అమెరికాలో కాల్పులు... ఐదుగురికి గాయాలు
లాస్ఏంజెల్స్: యూఎస్ కొలరాడాలో అరోరా నగరంలోని సెంట్రల్ హైస్కూల్ సమీపంలో జరిగిన కాల్పుల్లో ఐదుగురు యువకులు గాయపడినట్లు అరోరా పోలీసులు తెలిపారు. అయితే అనుమానితుడు ఎవరు ఆ సమయంలో ఉన్నట్లు కనిపించలేదని అన్నారు. ఈ మేరకు సంఘటన పాఠశాల లోపల జరగలేదని పార్క్ వద్ద జరిగిందన్నారు. (చదవండి: జిమ్‌లో అసభ్య ప్రవర్తన... టిక్‌టాక్ షేర్ చేయడంతో పరార్!!) అంతేకాదు పార్క్‌కి సంబంధించిన సీసీపుటేజ్ కెమరాలను కూడా పరిశీలిస్తున్నట్టుల తెలిపారు. పైగా హైస్కూల్‌కి సంబంధించిన కార్ పార్కింగ్‌లో అత్యవసర వాహనాలు కూడా ఉన్నాయని, ఈ ఘటన జరిగినే వెంటనే అక్కడ పెద్ద సంఖ్యలో జనం గుమిగూడినట్లు పోలీసలు చెప్పారు. అయితే కొలరాడో తుపాకీ హింసకు కొత్తేమీ కాదు. పైగా యూఎస్ చరిత్రలో అత్యంత అపఖ్యాతి పాలైన రెండు సాముహిక కాల్పలు ఈ ప్రాంతంలోనే జరిగిన సంగతి తెలిసిందే. (చదవండి: యూకే లివర్‌పూల్ నగరంలో కారు బ్లాస్ట్... ఒకరు మృతి) -
మాతాజీ మృతి: వెండి తాగితే కరోనా తగ్గుతుందని..
వాషింగ్టన్: కరోనా వ్యాప్తి ప్రారంభమైన నాటి నుంచి రకరకాల సలహాలు, సూచనలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. ముఖ్యంగా ఆవు మూత్రం వంటివి తాగితే కరోనా తగ్గుతుందని విపరీతంగా ప్రచారం జరిగింది. జనాలు కూడా బాగానే ఎగబడ్డారు. అయితే ఇలాంటి సంఘటనలు మన దగ్గరే కాదు విదేశాల్లో కూడా చోటు చేసుకుంటాయి. తాజాగా ఓ మాతాజీ కరిగించిన వెండి తాగితే కరోనా తగ్గుతుందని భావించి.. ఆ ప్రయత్నం చేసి.. ప్రాణాలు విడిచింది. మరో వింత విషయం ఏంటంటే.. ఆమెకు అంత్యక్రియలు జరపకుండా ఓ వస్త్రంలో చుట్టి.. లైట్స్‌తో అలకరించి పూజిస్తున్నారు ఆమె శిష్యులు. ఇది కాస్త పోలీసులకు తెలియడంతో వారు సంఘటన స్థలానికి వచ్చి.. శిష్యులను అరెస్ట్ చేశారు. ఈ సంఘటన కొలరాడోలో చోటు చేసుకుంది. ఆ వివరాలు.. అమి కార్లసన్(45) అనే మహిళ ‘‘లవ్ హాస్ ఓన్’’ అనే ఆధ్యాత్మిక సంస్థను నిర్వహిస్తుంది. శిష్యులు అందరూ ఆమెను ‘‘మదర్ ఆఫ్ గాడ్’’ అని పిలుస్తారు. ఈ క్రమంలో ఆమె చనిపోయినట్లు పోలీసులకు సమాచారం అందింది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కార్లసన్ ఇంటికి చేరుకుని అక్కడ కనిపించిన దృశ్యం చూసి ఆశ్చర్యపోయారు. ఇంటిలో దాదాపు 10 మంది వరకు ఉన్నారు. ఇక కార్లసన్ మృతదేహాన్ని ఓ వస్త్రంలో చుట్టి.. బాక్స్‌లో పెట్టి.. విద్యుద్దీపాలతో అలంకరించారు. ఆమెను గురించి పాటలు పాడుతూ కూర్చున్నారు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని కార్లసన్ మృతదేహానికి పోస్ట్‌మార్టం నిర్వహించగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. కార్లసన్ ఈ ఏడాది మార్చిలోనే చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. ద్రవ రూపంలో ఉన్న వెండిని ఎక్కువ మొత్తంలో తీసుకోవడం వల్ల ఆమె మరణించినట్లు వెల్లడించారు. ఈ క్రమంలో పోలీసులు ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఇక కార్లసన్ 2018లో ‘‘లవ్ హాస్ ఓన్’’ అనే సంస్థను స్థాపించారు. దాదాపు లక్షన్నర మంది ఆమెకు శిష్యులుగా మారారు. వీరంతా కార్లసన్ దాదాపు 19 బిలియన్ ఏళ్లుగా మానవత్వాన్ని కాపాడటం కోసం శ్రమిస్తుందని.. ఏదో ఒక రోజు ఆమె తన శిష్యులను కొత్త లోకానికి తీసుకెళ్తుందని నమ్ముతారు. పైగా పూర్వజన్మలో డొనాల్డ్ ట్రంప్ కార్లసన్ తండ్రి అని ఆమె శిష్యులు నమ్ముతున్నారు. -
డబ్బా మొత్తం నాకే; అమ్మదొంగా!
ఆహారం కోసం బయల్దేరిందో ఎలుగుబంటి. కానీ ఎక్కడా ఏమీ కనిపించకపోవడంతో చెత్త డబ్బా దగ్గరికెళ్లి ఏమైనా దొరుకుతుందోమోనని దానిని తెరిచేందుకు ప్రయత్నించింది. అయితే ఎంతసేపటికి అది ఓపెన్ కాకపోవడంతో ఏకంగా డబ్బా మొత్తాన్ని తనతో పాటు తీసుకెళ్లింది. ఈ సరదా సంఘటన కొలెరెడోలో చోటుచేసుకుంది. ‘పాపం ఎలుగుబంటి దొంగగా మారింది. కానీ దురదృష్టవశాత్తు ఆహారం సంపాదించలేకపోయింది. కాబట్టి దానికి ఎటువంటి శిక్ష వేయబోము’ అంటూ కొలెరెడో పార్క్స్, వైల్డ్‌లైఫ్ తన ట్విటర్ ఖాతాలో ఎలుగుబంటి వీడియోను పోస్టు చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ క్రమంలో కొలెరెడో వైల్డ్‌లైఫ్ అధికారి మాట్లాడుతూ... ఆహారం కోసం ఎలుగుబంట్లు రాత్రుళ్లు ఎక్కువగా సంచరిస్తుంటాయి. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. -
అమెరికా చరిత్రలోనే తొలిసారిగా..
వాషింగ్టన్ : అగ్రరాజ్యం అమెరికా మధ్యంతర ఎన్నికల్లో డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి జారెడ్ పోలీస్ విజయం సాధించారు. కొలరెడో గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టనున్న జారెడ్ అమెరికా చరిత్రలో గవర్నర్‌గా ఎంపికైన తొలి స్వలింగ సంపర్కుడిగా చరిత్రకెక్కారు. తనను తాను గే అని ఎన్నికల ప్రచారంలో బహిరంగంగా ప్రకటించిన జారెడ్.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న విధానాలపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను ప్రచారాస్త్రంగా మార్చుకుని విజయం సాధించారు. గతంలోనూ ఐదుసార్లు కాంగ్రెస్ ప్రతినిధిగా ఎన్నికైన జారెడ్ ఇకపై కొలరెడో గవర్నర్‌గా సేవలు అందించనున్నారు. కాగా ఓరెగాన్ గవర్నర్ కేట్బ్రౌన్ అమెరికా తొలి బైసెక్సువల్ గవర్నర్‌గా గుర్తింపు పొందగా.. న్యూజెర్సీ మాజీ గవర్నర్ జిమ్ మెక్‌గ్రీవీ తన పదవికి రాజీనామా చేసిన తర్వాత తాను గేనని ప్రకటించుకున్నారు. పేరు మార్చుకుని.. యూదు అయిన జారెడ్ అసలు పేరు జారెడ్ చుల్జ్. తన బామ్మ ఙ్ఞాపకార్థం 25 ఏట తన పేరును జారెడ్ పోలీసుగా మార్చుకున్నారు. కాలేజీ రోజుల నాటి నుంచే రాజకీయాల్లో రాణించాలనే ఆశయం ఉన్న జారెడ్ మొదట వ్యాపారవేత్తగా ఎదిగి... ఆ తర్వాత డెమొక్రటిక్ పార్టీలో చేరి తన కలను సాకారం చేసుకున్నారు. -
అమెరికాలో మళ్లీ షూటౌట్
-
అమెరికాలో మళ్లీ షూటౌట్
- కొలరాడో స్ప్రింగ్స్ లోని ఆసుపత్రిలో సాయుధుడి కలకలం - పోలీసు సహా ముగ్గురి మృతి, 10 మందికి గాయాలు.. దుండగుడి పట్టివేత కొలరాడో స్ప్రింగ్స్: అమెరికా మరోసారి తుపాకి చప్పుళ్లతో దద్దరిల్లింది. కొలరాడో రాష్ట్రం, కొలరాడో స్ప్రింగ్స్ పట్టణంలోని ఓ ఆసుపత్రిలోకి ప్రవేశించిన సాయుధుడు.. పలువురిపై కాల్పులు జరిపి, మరొకొందరిని బందీలుగా పట్టుకున్నాడు. శనివారం ఉదయం (స్థానిక కాలమానం ప్రకారం శుక్రవారం ఉదయం ఉదయం 11:45కు) ఈ సంఘటన చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలికి చేరుకుని రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించారు. ఈ క్రమంలో దుండగుడికి, పోలీసులకు మధ్య కూడా కాల్పులు చోటుచేసుకున్నాయి. కాల్పుల్లో ఒక పోలీస్ అధికారి సహా ముగ్గురు చనిపోగా, మరో 10 మంది గాయపడ్డారు. వీరిలో నలుగురు పోలీసులు కూడా ఉన్నారు. ఆసుపత్రి లోపల నక్కిఉన్న దుండగుడి వద్ద భారీ ఎత్తున గుర్తుతెలియని పదార్థాలు ఉన్నట్లు పోలీసులు అనుమానించారు. బందీగా లోపలే ఉండిపోయిన ఓ మహిళ.. తన బంధువులకు ఫోన్ చేసి ఇద్దరు సాయుధులు ఉన్నట్లు చెప్పింది. అధికారుల ద్వారా కాల్పుల ఘటన వివరాలను తెలుసుకున్న అధ్యక్షుడు బరాక్ ఒబామా.. పౌరుల ప్రాణాలకు ముప్పు వాటిల్లకుండా ఆపరేషన్ నిర్వాహించాల్సిందిగా ఆదేశించారు. దాదాపు మూడు గంటల ఉత్కంఠ అనంతరం పోలీసులు.. దుండగుణ్ని పట్టుకోగలిగారు. గాయపడ్డ 11 మందికి ప్రాణాపాయం లేదని కొలరాడో స్ప్రింగ్స్ మేయర్ జాన్ షతెర్స్ చెప్పారు. ఐదు రోజుల కిందట న్యూ ఆర్లియాన్స్ ప్రాంతంలోని ఓ పార్క్ లో ఇరు వర్గాలకు మధ్య చోటుచేసుకున్న కాల్పుల్లో 10 మరణించిన సంగతి తెలిసిందే.