ఈ ఫొటోల్లో కనిపిస్తున్న పెద్దమనిషి కొంతకాలంగా అడవుల్లో సంచరిస్తూ గుహలలోనే తలదాచుకుంటూ బతికేస్తున్నాడు. గుహలలో తలదాచుకోవడానికి, అడవుల్లో సురక్షితంగా తిరగడానికి అవసరమైన మెలకువలు చెబుతూ సెల్ఫీ వీడియోలను ‘టిక్‌టాక్’లో షేర్ చేసుకుంటున్నాడు. అమెరికాలోని కొలరాడోకు చెందిన ఈ ఆధునిక అడవి మనిషి పేరు డానీ డస్ట్. ‘టిక్‌టాక్’లో ఇతడికి ఏకంగా కోటి మందికి పైగా ఫాలోవర్లు ఉన్నారు.
‘గుహలలో తలదాచుకోవడం అంత తేలికైన పనేమీ కాదు. తలదాచుకోవాలనుకున్న గుహ సురక్షితమైనదో కాదో చూసుకోవాలి. గుహలో ఏదైనా జంతువు విసర్జకాలు ఉన్నట్లయితే, అది ఆ జంతువు సొంతం. అలాంటి గుహలో తలదాచుకోవడం ప్రాణాలకే ప్రమాదం. అలాగే గుహల్లో ఉండే సాలెగూళ్లు, తేనెపట్లులాంటివి ఏవైనా ఉన్నా జాగ్రత్తగా చూసుకోవాలి.
గుహ పైభాగంలో పగుళ్లు ఉన్నాయో లేదో చూడాలి. పైభాగంలో పగుళ్లు ఉంటే, ఏ క్షణంలోనైనా పెళ్లలు విరిగి నెత్తిన పడే ప్రమాదం ఉంటుంది. అన్నీ సజావుగా ఉన్న గుహను ఎంపిక చేసుకోవడం ఒక కష్టమైతే, అందులోని రాతి నేల మీద అలాగే పడుకోలేం. అందుకని తగినంత ఎండుగడ్డిని పోగు చేసుకుని, పరుచుకుంటే పడుకోవడానికి సౌకర్యంగా ఉంటుంది’ అని చెబుతాడు డానీ. అడవుల్లో పక్షులను, జంతువులను వేటాడుతూ, వాటి మాంసంతోను, అడవిలో దొరికే పండ్లు కాయలతోనే కాలక్షేపం చేస్తూ ఇతడు తీసే వీడియోలు క్షణాల్లోనే వైరల్ అవుతుండటం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment